Categories
National

సీబీఐ వివాదం : విచారణ నుంచి తప్పుకొన్న సీజేఐ

సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నే నాగేశ్వర్ రావు కేంద్రప్రభుత్వం నియమించడాన్ని సవాల్ చేస్తూ ఎన్జీవో కామన్ ఖాజ్ తదితరులు న్యాయవాది ప్రశాంత్ భూషన్ ద్వారా సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తప్పుకొన్నారు. సీబీఐ డైరక్టర్ ను ఎంపిక చేసే సెలక్షన్  కమిటీలో ఉన్నందున ఈ విచారణ నుంచి దూరంగా ఉండేందుకు గొగొయ్ నిర్ణయించుకొన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని  సెలఓన్ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష్ నేత, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఉంటారు. సీబీఐకు కొత్త డైరక్టర్ ఎంపికపై జనవరి 24,2019న సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.

గతేడాది అక్టోబర్ లో సీబీఐ డైరక్టర్ గా ఉన్న అలోక్ వర్మ, అడిషనల్ డైరక్టర్ గా ఉన్న రాకేష్ ఆస్తానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం అర్థరాత్రి వర్మ, ఆస్తానాలను సెలవుపై ఇంటికి పంపించి సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నె నాగేశ్వర్ రావుని నియమించింది. అయితే తనను అర్థాంతరంగా ఇంటికి కేంద్రం పంపించడాన్ని తప్పుబడుతూ అలోక్ వర్మ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. వర్మ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వర్మను తిరిగి సీబీఐ డైరక్టర్ గా నియమించాలని జనవరి 8,2019 తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పు తర్వాత సీబీఐ డైరక్టర్ నియామకానికి సంబంధించి ప్రధాని అధ్యక్షతన భేటీ అయిన హై పవర్ కమిటీ అలోక్ వర్మను ఫైర్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకొంది.

అప్పుడు కూడా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్..వర్మ  కేసులో తీర్పు చెప్పిన బెంచ్ లో తాను ఉన్న కారణంగా తన తరపున సెలఓన్ కమిటీకి సీనియర్ జడ్జి ఏకే సిక్రీని  నామినేట్ చేసిన విసయం తెలిసిందే. అయితే సెలక్షన్ కమిటీ నిర్ణయం పట్ల  అసంతృప్తి వ్యక్తం చేసిన వర్మ ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆస్తానాను కూడా విమానయాన శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.