Categories
Movies

వెయ్యిమందికి సాయం.. అమితాబ్ ఆశ్చర్యపోయారు.. అభినందించారు..

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని అభినందించిన అమితాబ్..

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో సంపాదన కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. సినీ రంగంలోని రోజువారీ వేతన కార్మికులకు సహాయం చేసేందుకు సీసీసీ సభ్యులు చాలా కష్టపడుతున్నారు.

మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే  వెయ్యి మంది సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు. దీంతో ఈ టీమ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ‘ఒకే రోజు వెయ్యి మందికి స‌రుకులు పంపిణీ చేశారని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. చాలా ఆనందంగా ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ ముందుకొచ్చి తమ బాధ్య‌త‌గా భావించి ఈ ప‌ని చేశారు.

డ‌బ్బు ఉన్నా, సహకరించే మనషులు కావాలి. అమితాబ్ బ‌చ్చ‌న్‌గారు ఈ పంపిణీ విధానం తెలుసుకొని నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, ఎన్.శంక‌ర్‌, మెహ‌ర్ ర‌మేష్‌కి నా ప్రత్యేక అభినంద‌న‌లు’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు. 

Read Also : 500 మందికి అన్నం పెట్టిన హీరో..

Categories
Hyderabad Technology

తొలిసారిగా గాల్లో ఎగిరిన తెలంగాణ 3D ఏరియల్‌ వెహికల్‌ 

తొలి 3డీ ముద్రిత మానవ రహిత ఏరియల్‌ వెహికల్‌ (యూఏవీ) తొలిసారిగా విజయవంతంగా గాలిలోకి ఎగిరింది.

తొలి 3డీ ముద్రిత మానవ రహిత ఏరియల్‌ వెహికల్‌ (యూఏవీ) తొలిసారిగా మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) విజయవంతంగా గాలిలోకి ఎగిరింది. 3డీ ముద్రిత మానవ రహిత విమానాన్ని ‘టి వర్క్స్‌’ గతేడాది నవంబర్‌ నెలలో రూపొందించారు. పలు ప్రయత్నాలు చేసిన తర్వాత గాలిలోకి ఎగిరింది. గంటకు 80 కి.మీ. వేగంతో గాలిలోకి ఎగిరిన విమానం వేగం పుంజుకుని ఆ తర్వాత గంటకు 140 కి.మీ. వేగాన్ని అందుకుంది. 

2 నిమిషాల పాటు గాలిలో ప్రయాణం
సుమారు రెండు నిమిషాల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత రేడియో సంబంధాలను కోల్పోయి నేలకూలింది. ఈ అనుభవంతో మరింత మెరుగైన యూఏవీని త్వరలో తయారుచేస్తామని టి వర్క్స్‌ ప్రకటించింది. 3డీ ముద్రిత యూఏవీని తయారు చేయడంలో టి వర్క్స్‌ చేసిన కృషిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.

ఎన్నో ప్రత్యేకతలు
ఎన్నో ప్రత్యేకతలను కలిగిన యూఏవీ తయారీలో పూర్తిగా 3డీ ముద్రిత విడి భాగాలను ఉపయోగించారు. ఈ విడి భాగాలను పాలీ లాక్టిక్‌ యాసిడ్‌ (పీఎల్‌ఎ), అక్రిలోనైట్రిల్‌ బ్యూటడీన్‌ స్టిరీన్, హై ఇంపాక్ట్‌ పాలిస్ట్రీన్‌ (హెచ్‌ఐపీఎస్‌) వంటి పదార్థాలతో తయారు చేశారు. ఒకటిన్నర కిలోల బరువున్న ఈ యూఏవీని గంటకు 200 కి.మీ. వేగంతో పయనించే సామర్థ్యం తో రూపొందించారు. మంగళవారం జరిగిన ప్రయోగ ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో 3డీ ముద్రిత యూఏవీల ఎయిరోడైనమిక్‌ ధర్మాలను విశ్లేషించి, మరింత మెరుగైన యూఏవీని తయారుచేసేందుకు టి వర్క్స్‌ సన్నాహాలు చేస్తోంది.

తయారీ సులభం
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమెకానికల్, మెకానికల్‌ రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్‌ సెంటర్‌గా పేరొందిన టి వర్క్స్‌.. ఎయిరోస్పేస్‌ రంగంలో 3డీ ప్రింటింగ్‌ అప్లికేషన్ల సామర్థ్యం, పనితీరుపై వరుస పరిశోధనలు చేస్తోంది. గతంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలను కలప, ఫ్లైవుడ్‌తో తయారు చేసేందుకు నాలుగైదు వందల గంటల గంటల సమయం పట్టేది. కానీ కంప్యూటర్‌ లో విడి భాగాల డిజైనింగ్, 3డీ ప్రింటర్ల ద్వారా ప్రోటోటైప్‌ల తయారీ సులభతరమైంది. 

తక్కువ ఖర్చుతో
యూఏవీలో అంతర్భాగాలను నట్లు, బోల్టులు తదితరాలతో సంబంధం లేకుండానే తేనెపట్టులో అమర్చినట్లు బిగించి రూపాన్ని ఇచ్చారు. లిథియం పాలిమర్‌ బ్యాటరీ వినియోగంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సంక్లిష్టతతో తయారు చేసిన ఈ యూఏవీ డిజైన్, 3డీ విడి భాగాల ముద్రణకు వంద గంటల సమయం మాత్రమే పట్టిందని టి వర్క్స్‌ వర్గాలు వివరించాయి.
 

Categories
Uncategorized

దిశ చట్టం : జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన చిరంజీవి

ఏపీలో దిశ చట్టాన్ని అభినందిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దిశా చట్టంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.

ఏపీలో దిశ చట్టాన్ని అభినందిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దిశా చట్టంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు, చిన్నారులకు ఈ చట్టం భరోసా కల్పిస్తుందన్నారు. సత్వర న్యాయం కోసం తొలి అడుగులు పడటం హర్షణీయమన్నారు. 

ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే అతి త్వరగా నిందితులకు మరణశిక్ష పడేలా చట్టం తీసుకొచ్చింది. ఇటువంటి కేసుల్లో నిందితులను దోషులుగా నిర్థారించే ఆధారాలున్నప్పుడు మూడు వారాల్లోగా అంటే 21 వర్కింగ్ డేస్ ల్లో తీర్పు వచ్చేలా క్రిమినల్ లా చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ ఆమోదం పలికింది. ఇటువంటి కేసుల్లో వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి..14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి..మొత్తం 21 రోజుల్లో కోర్టుల్లో తీర్పు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. 

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రస్తుతం అత్యాచారాల కేసుల్లో నాలుగు నెలల్లోగా తీర్పు రావాలనే ఉంది. దీన్ని నాలుగు నెలల నుంచి 21 రోజులకు కుదిస్తూ చేసిన బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం పలికింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలోను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం జరిగింది. అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక ఘటనల్లో నేరాల విచారణకు ప్రతి జిల్లాల్లోను ప్రత్యే కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అంతేకాదు సోషల్ మీడియా వేధికగా బాధిత మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్టవేసేలా కేబినెట్ నిర్ణయించింది. మహిళలను కించపరిచేలా చేస్తున్న చర్యల్ని ఖండించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగ్ లు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపనుంది.

ఇటువంటి చర్యలు మొదటిసారి చేస్తే.. రెండేళ్ల జైలు శిక్ష, రెండోసారి చేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష పడేలా కఠిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిల్లలపై లైంగిక వేధింపులు, నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్) సెక్షన్ కింద ఐదేళ్ల నుంచి పదేళ్ల పాటు జైలుశిక్ష..పోక్సో చట్టం కింద ఇప్పటి వరకూ 3 నుంచి ఐదేళ్లు జైలు శిక్ష ఉన్న ఈ శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవన్నీ అమల్లోకి రానున్నాయి.