Categories
Movies

‘భీష్మ’ బాగుంది – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి.. నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా చూసి టీమ్‌ని అభినందించారు..

మెగాస్టార్ చిరంజీవి ‘భీష్మ’ సినిమా చూసి, చిత్ర బృందాన్ని అభినందించారు. యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).

మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ అండ్ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. నితిన్ పెర్ఫార్మెన్స్, వెంకీ టేకింగ్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు సినిమా చూసి నితిన్, దర్శకుడు వెంకీకి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also : ‘ప్రశ్నిస్తా.. ప్రశ్నించడానికే వచ్చా.. ఒక్కొక్కరికీ బల్బులు పగిలిపోతాయ్’..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి, వెంకీతో కలిసి ‘భీష్మ’ ప్రత్యేక షో వేయించుకుని చూశారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉందని, నితిన్, రష్మికల నటన, వెంకీ కామెడీ టైమింగ్, ఆర్గానికి ఫార్మింగ్ గురించి చెప్పిన విధానం బాగుందని చిరు ప్రశంసించారు. చిరంజీవి తమ సినిమా చూసి అభినందించడం ఆనందంగా ఉందని దర్శకుడ వెంకీ కుడుముల సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Categories
Hyderabad Movies

కాస్టింగ్ కౌచ్ : కమిటీ ఏర్పాటుపై హర్షం

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విధానాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు సామాజికవేత్త దేవి. గతంలో ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. వారితోపాటు కొత్తవారు ఫిర్యాదు చేయాలంటే కమిటీ పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే.. బాధితుల తరపున తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని స్వాగతించారు మహిళా సంఘం నేత సంధ్య. సినీ ఇండస్ట్రీలోనే కాదు.. సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. పోరాట ఫలితంగా వచ్చిన జీవోను వెల్‌కం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ కంటితుడుపు చర్యలకు పరిమితం కాకుండా.. బాధితులకు న్యాయం జరిగేలా పని చేయాలని డిమాండ్ చేశారు. 

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై 2019, ఏప్రిల్ 18వ తేదీ గురువారం టి.సర్కార్ స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 984 విడుదల చేసింది. ఈ ప్యానెల్లో సినీ నటి సుప్రియ, నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినిరెడ్డిని టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో కమిటీ ఏర్పాటు చేసింది.