Categories
Andhrapradesh

రాజమండ్రి ఎస్పీని మెచ్చుకున్న సీఎం జగన్. ఎందుకంటే?

‘రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం డెడికేటెడ్ పోలీస్ స్టేషన్స్ చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు (ఫిబ్రవరి 8, 2020)న రాజమండ్రీలోని పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రారంభోత్సవం చేశాం. అంతేకాదు ఈ నెలాఖరు కల్లా ఇలాంటి పోలీస్ స్టేషన్లు  రాష్ట్రంలోని 13జిల్లాల్లో 18 పీఎస్‌లు ఉంటాయి’ అని చెప్పారు సీఎం జగన్. దీనికి తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. శనివారం రాజమండ్రిలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…

దిశ పీఎస్‌లో పని చేసేవాళ్లు 5మంది SIలు, ASIలు, హెడ్ కానిస్టేబుల్ లు, పోలీస్ కానిస్టేబుల్‌లు మొత్తం మీద దాదాపు 36 – 47మంది సిబ్బందితో ఈ స్టేషన్లు పనిచేయడం జరుగుతోందన్నారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారనే విషయాన్ని తెలియజేయడానికి గర్వపడతున్నట్లు వెల్లడించారాయన. 

రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో SP మహిళేనని తెలిపారు. ఈ పీఎస్‌లో ఏకంగా ఆమె 47మంది సిబ్బందిని పెట్టేశారనే విషయాన్ని చెప్పారు. ఇందుకు ఎస్పీ గారు..మీరు నిజంగా గ్రేట్ అంటూ సీఎం జగన్ కితాబిచ్చారు. రాష్ట్రంలో ఒకటే ఒక ఫారెన్సిక్ ల్యాబ్ మంగళగిరిలో ఉందని, విశాఖ, తిరుపతిలో ఒక్కో  ఫారెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో 108మంది సిబ్బంది పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు సీఎం జగన్.