Categories
Movies

వారే నిజమైన హీరోలు.. ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ వీడియో..

లాక్‌డౌన్ వేళలో మన కోసం కష్టపడుతున్న డాక్టర్స్, పోలీసులు మరియు పరిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో అల్లరి నరేష్..

ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వలన పలు దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక మన దేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటన చేశారు. అయితే దీని వలన అన్ని రంగాలు మూత పడడం, ఎక్కడి ప్రజలు అక్కడే పూర్తిగా ఇళ్లకు పరిమితం అవడం జరుగుతోంది.
కాగా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రం తమ ప్రాణాలొడ్డి మన రక్షణ కోసం ఎంతో గొప్పగా పాటుపడుతున్నారు. కాగా వారిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తుండగా, నేడు టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

Read Also : కొట్టు పెట్టించాను.. ప్రతి పండక్కి ఫొటో పంపేది.. రజితమ్మ మృతి-విచారం వ్యక్తం చేసిన ఉదయభాను

నిజంగా ఇటువంటి విపత్కర సమయంలో ఆ మూడు శాఖల వారు మన కోసం, మన కుటుంబాల రక్షణ కోసం చేస్తున్న ఈ సేవకు విలువ కట్టలేమని, వారే నిజమైన హీరోలని ఒక వీడియో బైట్ ద్వారా తెలిపారు. అలాగే పనిలేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయమందించారు నరేష్.