Categories
National

ఇండియన్ ఆయిల్‌లో 600 ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL)లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 20, 2020 నాటికి దరఖాస్తు గడువు ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం నెలకొనడంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మరో 100 పోస్టులను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మెుత్తం 600 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. 

ఫిబ్రవరి 22, 2020 నుంచి మార్చి 20, 2020 మధ్య అప్లై చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేసిన దరఖాస్తులే పరిగణలోకి తీసుకుంటుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత : అభ్యర్దులు ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికా విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్ట్, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 22, 2020. 

దరఖాస్తు చివరి తేదీ : జూన్ 21, 2020.

Read: లాక్‌డౌన్‍‌తో వాయిదా పడిన SSCపరీక్షల రీ-షెడ్యూల్

Categories
Education and Job Viral

పదో తరగతి పాస్ అయితే చాలు : సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 4వేల ఉద్యోగాలు

సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగుల కోసం వివిధ ట్రేడ్స్‌ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

విభాగాల వారీగా ఖాళీలు:
ఫిట్టర్ – 1460, ఎలక్ట్రీషియన్ – 871, డీజిల్ మెకానిక్ – 640, వెల్డర్ – 597, ఏసీ మెకానిక్ – 249, ఎలక్ట్రానిక్ మెకానిక్ – 102, మెకానిస్ట్ – 74, పెయింటర్ – 40, ఎంఎండబ్ల్యూ – 34, ఎలక్ట్రికల్ – 18, కార్పెంటర్ – 16, ఎంఎంటీఎం – 12 

దరఖాస్తు ఫీజు: 
జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళలకు ఎటాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

వయోపరిమితి: 
అభ్యర్ధులు 15 నుంచి 24 ఏళ్లు మించకూడదు. SC, ST అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత: 
అభ్యర్ధులు పదోతరగతి 50శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 11, 2019.

దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 8, 2019

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Read Also: ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం…భారీగా ఉద్యోగుల తొలగింపు

Categories
Education and Job National

అప్లయ్ చేస్కోండి : IOCLలో 466 ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లోని  466 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.    

                పోస్టులు        ఖాళీలు
ట్రేడ్ అప్రెంటీస్ (కెమికల్ ప్లాంట్) 89 పోస్టులు
ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్) 43 పోస్టులు
ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్) 30 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటీస్ (కెమికల్) 65 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్)  18 పోస్టుులు
టెక్నీషియన్ అప్రెంటీస్ (ఎలక్ట్రికల్) 73 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటీస్ (ఇన్స్ట్రుమెంటేషన్) 47 పోస్టులు
ట్రేడ్ అప్రెంటీస్ (సెక్రెటరియల్ అసిస్టెంట్) 75 పోస్టులు
ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్) 26 పోస్టులు 
మొత్తం 466 పోస్టులు 

 
 ముఖ్యమైన తేదిలు:
అన్ లైన్ దరఖాస్తు ప్రారంభం      :     ఫిబ్రవరి 16న 
అన్ లైన్ దరఖాస్తు ముగింపు    :     మార్చి 8న 
రిటన్ టెస్ట్                             :     ఫిబ్రవరి 24
ఇంటర్వ్యూ                            :     ఏప్రిల్ 1 నుంచి 5 వరకు 

వయసు పరిమితి :
ఫిబ్రవరి 28, 2019 నాటికి 18 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: 
అభ్యర్థులు రాతపూర్వక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ లో 85% మార్కులు రావాలి. ఇంటర్వ్యూలో 15% రావాలి.