Categories
National

కరోనాకు ఫ్లాస్మా థెరపీ : కేరళకు అనుమతిచ్చిన ICMR,కానీ

కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కేరళకు అనుమతిచ్చింది. కరోనా వైర‌స్‌ ను నాశ‌నం చేసేందుకు ప్ర‌స్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేన‌ప్ప‌టికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందులు, యాంటీ మలేరియా డ్రగ్- హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందుల‌తో క‌రోనాను త‌గ్గిస్తున్నారు.

అయితే క‌రోనా వైర‌స్ వ‌ల్ల తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారికి మాత్రం ఈ మందులు ప‌నిచేయ‌డం లేదు. దీంతో అలాంటి వారికి వైద్యులు ప్లాస్మా థెర‌పీ చేసేందుకు కేరళకు ICMR అనుమతిచ్చింది. ఇప్ప‌టికే ఈ విధానం అమెరికా, చైనాల్లో ఉప‌యోగంలో ఉంది. అయితే దీనికి మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తి లేదన్న విషయం తెలిసిందే.(ఏప్రిల్ 14 తర్వాత అందరి లైఫ్ ఎలా ఉండబోతోంది.. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఎన్ని దశల్లో ఉంటుంది?)

కేర‌ళ రాష్ట్రానికి ICMR తాజాగా అనుమ‌తులు జారీ చేయడంతో అక్క‌డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న క‌రోనా ఎమ‌ర్జెన్సీ పేషెంట్ల‌కు ప్లాస్మా థెర‌పీ విధానంతో చికిత్స చేయ‌నున్నారు. ప్లాస్మా థెర‌పీలో… క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి శ‌రీరం నుంచి ర‌క్తాన్ని సేక‌రించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న క‌రోనా రోగి ర‌క్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధార‌ణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్ర‌మంలో క‌రోనా వ‌చ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. ఈ విధానం ద్వారా రోగుల‌ను బ‌తికించేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే ప్లాస్మా థెర‌పీలో ఒక వ్య‌క్తి నుంచి సేక‌రించే ప్లాస్మాతో రెండు డోసులు మాత్ర‌మే త‌యారు చేయ‌వ‌చ్చ‌ని ICMR తెలియ‌జేసింది. ఒక డోసు వ్య‌క్తికి స‌రిపోతుంద‌ని.. అయితే ప్లాస్మాను సేక‌రించేందుకు క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి వారిని ఒప్పించాల్సి ఉంటుంద‌ని.. ICMR తెలిపింది. ఇక అమెరికా, చైనాల‌లో ఇప్పటికే ఈ విధానం స‌క్సెస్ అయినందున‌.. మ‌న దేశంలోనూ దీన్ని ప్ర‌స్తుతం ప్రారంభించారు. అయితే ఈ విధానం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ది క‌నుక‌.. కేవ‌లం అత్య‌వ‌సర స్థితి ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు మాత్ర‌మే ఈ విధానంలో చికిత్స చేయ‌నున్నారు.

అయితే ICMR నుంచి కేరళ.. ఫ్లాస్మా థెరపీ కోసం అనుమతి పొందినప్పటికీ, డ్రగ్ కంట్రోలర్స్ ఆఫ్ ఇండియా CDCSOనుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ఎవరైనా కరోనా సోకి కోలుకున్న వ్యక్తి అంగీకరిస్తే, తాము యాంటీబాడీ లెవల్స్ కోసం పరీక్ష చేయవచ్చని సీఎం పిన్నరయి విజయన్ కు సూచనల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ ఎక్స్ పర్ట్ ప్యానెల్ సభ్యుడు మరియు బేబీ మొమోరియల్ హాస్పిటల్ లో ఓ క్రిటికల్ కేర్ డాక్టర్ అనూప్ కుమార్ తెలిపారు. ఇది రక్తదానం లాంటిది కాదని ఆయన తెలిపారు. కేవలం శరీరంలో నుంచి ఫ్లాస్మా మాత్రమే సేకరించబడుతుందని తెలిపారు. 55కేజీల బరువు మరియు రక్తంలో తగినంత ప్రొటీన్ ఉన్న వ్యక్తి…800ML ఫ్లాస్మా దానం చేయవచ్చని తెలిపారు. దీంతో నలుగురు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయవచ్చని తెలిపారు.

ఒక్కో పేషెంట్ కు 200ML ఫ్లాస్మా అవసరమవుతుందని ఆయన తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్నవారు మరియు ఆరోగ్యం విషమంగా ఉన్న కరోనా పేషెంట్ల కోసమే ఫ్లాస్మా థెరపీ ఉద్దేశించబడిందని తెలిపారు. తిరువనంతపురంలోని ప్రముఖ… శ్రీచిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ డైరక్టర్ డాక్టర్ ఆశా కిషోర్ మాట్లాడుతూ… డ్రగ్ కంట్రోలర్ నుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని,రాష్ట్రంలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ఫ్లాస్మాథెరపీస్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును శ్రీచిత్ర లీడ్ చేస్తుందని ఆశా కిషోర్ తెలిపారు.

Categories
Political

3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ కేపిటల్ గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మూడు రాజధానులపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. అమరావతిని లెజిస్టేటివ్ రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన హయాంలో కర్నూలుకు మేలు చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చినందుకు సంతోషపడుతున్నట్లు తెలిపారు. 

అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు చారిత్రిక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం జరిగే విధంగా పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించామని తెలిపారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖటపట్నం ప్రాంతంలో కార్యనిర్వహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనదని ప్రజలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం జరిగే విధంగా పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించామని తెలిపారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖటపట్నం ప్రాంతంలో కార్యనిర్వహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనదని ప్రజలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. 

మూడు రాజధానులకు మద్దతు పలకాలని రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని కోరుతున్నట్లు తెలిపారు. న్యాయం చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడి గారిని కూడా వారి మనసు మారాలని దేవుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు. అమరావతి ప్రాంతానికి అన్యాయం చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. స్పీకర్.. రేపు ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేశారు. 

అంతకముందు మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. ప్రతిపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. అంతకంటే ముందు..బాబు సుదీర్ఘంగా మాట్లాడడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతరం చంద్రబాబు మైక్‌ను స్పీకర్ కట్ చేశారు. దీంతో సీఎం జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దు..అంటూ నినాదాలు చేశారు. టీడీపి చేస్తున్న ఆందోళనను వైసీపీ సభ్యులు ఖండించారు. సీఎం జగన్ ప్రసంగం ప్రజలకు తెలియకుండా నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు మంది టీడీపీ సభ్యులు మాట్లాడారని, బాబు గంటన్నరసేపు మాట్లాడారనే విషయాన్ని గుర్తు చేశారు.

తమ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలుంటే..కేవలం 7 మంది సభ్యులు మాత్రమే మాట్లాడరని తెలిపారు. సభలో జరిగిన దానిపై బాబు క్షమాపణలు చెప్పాలని మంత్రి అనీల్ కుమార్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. 
 

మార్షల్ పిలిచి ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను బయటకు పంపించాలని సీఎం జగన్ సూచించారు. ఏపీ మంత్రి బుగ్గన మార్షల్‌ను పిలిపించారు. ఆందోళన సద్దుమణగకపోవడంతో వారిని 17 మంది సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

అచ్చెన్నాయుడు, కరణం బలరాం, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిన రాజప్ప, వెంకటిరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, మంతెన రామరాజు, బాల వీరాంజనేయ స్వామి సస్పెండ్ చేశారు.  

 

Categories
Technology

భారత్ లో 5G వచ్చేస్తోంది…ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొలుత హువావేకు అనుమతివ్వాలనుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఆపరేటర్లందరికీ అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఇది కేవలం స్పెక్ట్రం ట్రయల్ టెస్ట్‌లకు ఇస్తున్న అనుమతి మాత్రమేనన్నారు. భవిష్యత్తు 5G దేనని,ఇది చాలా వేగంఃవంతమైనదని,5Gలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ 5జీ టెక్నాలజీతో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో డేటా వేగం మరింత పెరిగనుంది. అంతేకాదు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ సహా సాంకేతికత ప్రజలకు మరింత చేరువకానున్నాయి.

అయితే భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ సెక్యూరిటీ పరంగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న హువావే సంస్థకు కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో కాస్త ఉపశమనం లభించనుంది. గతంలో ఈ సంస్థపై నిషేధం విధించాలనుకున్నప్పటికీ.. అలా చేస్తే భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ మరో రెండు, మూడు ఏళ్లు ఆలస్యమవుతుందన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే ఇండియా రెండో అతిపెద్ద మొబైల్ సర్వీస్ మార్కెట్‌గా ఉంది. దీంతో ఈ 5జీ స్పెక్ట్రం అనుమతుల ప్రక్రియ ఆపరేటర్లకు ఎంతో కీలకం కానుంది.
 

Categories
Uncategorized

ఏపీ శాసనమండలిలో ఆరు కీలక బిల్లులకు ఆమోదం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఆమోదం తెలిపింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఆమోదం తెలిపింది. సోమవారం (డిసెంబర్ 16, 2019) శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- క్రిమినల్ శాసన చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- మహిళలు, బాలికలపై నిర్దేశిత అపరాధముల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల, ఎండోమెంట్ చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. 

మొత్తం 11 కీలక బిల్లులను మండలిలో ప్రవేశపెట్టగా ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. మిగిలిన వాటిపై మం‍ళవారం (డిసెంబర్ 17, 2019) సభలో చర్చను చేపట్టనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది.

మరోవైపు ఏపీ అసెంబ్లీ 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు, చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు బిల్లు, ఏపీ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, ఏపీ రాష్ట్ర షెడ్యూల్ కులాల బిల్లు, ఏపీ షెడ్యూల్ ట్రైబల్ కమిషన్ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించింది. అలాగే ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగుల పన్ను సవరణ బిల్లు, ఏపీ అబ్కారీ 2వ సవరణ బిల్లు, మద్యనిషేధం సవరణ బిల్లు, ఏపీ వస్తువులు, సేవల పన్నుల వసరణ బిల్లులు ఆమోదం పొందాయి.
 

Categories
Uncategorized

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణి అవుతారని వెల్లడించారు. దాదాపు 52 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.  దీనికోసమే ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం 3 వేల 600 కోట్ల రూపాయలను ఉద్యోగుల తరపున ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపారు. చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పారు. ప్రతి ఉద్యోగి కూడా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఆర్టీసీ గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కోసం ప్రజారవాణా శాఖను కూడా తీసుకొచ్చేందుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే జగన్ సీఎం బాధ్యతలు చేపట్టాక విలీనం దిశగా అడుగులు వేశారు. 

కానీ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉండటంతో ఆర్టీసీని విలీనం చేయడం కుదరలేదు. దీంతో ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవలే కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించింది. దానికి అనుగుణంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ చట్టం చేసింది.
 

Categories
Andhrapradesh

దిశా చట్టం..రాష్ట్రపతి ఆమోదం తర్వాతే – సుచరిత

దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేస్తామన్నారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం గుంటూరు జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడారు.

ఆయేషా హత్యాచారం కేసులో గతంలో న్యాయం జరగలేదని, నిందితులను గుర్తించలేకపోయారన్నారు. తమ ప్రభుత్వంలో తప్పక న్యాయం జరుగుతుందనే హామీనిచ్చారు. ఆయేషా తల్లిదండ్రులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. CBIకి పోలీసు అధికారులు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం అసెంబ్లీలో హోం మినిస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సభను దీనిని ఆమోదించింది.

గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై ఇంటర్ విద్యార్థి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. 
చికిత్స నిమిత్తం చిన్నారిని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు ఆయేషా మీరా హత్యాచారం కేసులో పోలీసులు.. మహిళా కోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్‌ఏ నిజంగా ఆమెదేనా అనే సందేహం రావటంతో సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం కోసం కోర్టును ఆశ్రయించారు. 
ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి ఆమెను చంపేశారు. 
దీనిపై విచారణ జరిపిన విజయవాడ 4వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రీ- పోస్టుమార్టం చేశారు.
ఆయేషా మీరాకు న్యాయం జరగాలని దేశంలోని మహిళలంతా ఎదురుచూస్తున్నారని తల్లి శంషాద్ బేగం అన్నారు. 
Read More : ఏపీకి వేల కోట్ల రూపాయలు తెస్తా : వర్మ సినిమా ఫ్లాప్..పిచ్చి సినిమా – పాల్

Categories
Andhrapradesh

వ్యవస్థలో విప్లవాత్మక మార్పు కోసమే ‘దిశ చట్టం’: సీఎం జగన్

ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడాలంటే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాలనీ..అందుకే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సమాజంలో మార్పు రావాలన్నారు. ఆడవారి జోలికి వస్తే కఠిన శిక్షలు పడతాయని భయం వ్యవస్థలో రావాలనీ..వ్యవస్థలో మార్పు కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోక తప్పదనీ..తమ చెల్లెళ్లు..అక్కల భద్రత కోసం ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చామని తెలిపారు. 

ఆడబిడ్డలు బైటకు రావాలంటే భయపడే పరిస్థితి సమాజంలో నెలకొందనీ..రోజు రోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనీ..దీంతో ఆడవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. 
ప్రతీ చోటా దిశ ఘటనపై చర్చ జరుగుతోందనీ..ఇటువంటి ఘనటను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీలో 13 జిల్లాల్లో ఆడవారిపై జరగుతున్న అఘాయిత్యాలు సంబంధించి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు.  
ఈ స్పెషల్ కోర్టుల్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల కేసులపై తక్షణ విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. 

లైంగిక దాడుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి అయ్యి తీర్పు అతి త్వరగా వచ్చేలా..నిందితులు దోషులుగా నిరూపించడిన వెంటనే ఉరిశిక్ష పడేలా చర్యలు ఈ స్పెషల్ కోర్టులు పనిచేస్తాయని తెలిపారు. దీంట్లో భాగంగా..చట్టాల్లో మార్పులు తీసుకొస్తామనీ..173,309 సెక్షన్లలో మార్పులు తీసుకొస్తామన్నారు.  అత్యాచార కేసుల్లో ఖచ్చితమైన ఆధారాలతో నిరూపణ అయితే దోషులకు మరణశిక్ష పడేలా మార్పుల్ని తీసుకొస్తామన్నారు. 
అంతేకాదు సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరుస్తూ..అగౌరపరిచేలా పాల్పడినవారికి కూడా కఠిన శిక్షల్ని అమలు జరిగేలా చట్టాలను రూపొందిస్తామన్నారు.  

దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి సుచరిత
అత్యాచారం ఘటనలో 21 పనిదినాల్లో నిందితుడు దోషిగా నిరూపించబడం వంటి పలు కీలక ఘట్టాల్నీ పూర్తైన తరువాత దోషిగా తేలటం..ఇలా అన్నీ 21 రోజుల్లో అఘాయిత్యాలకు పాల్పడినవారికి ఉరిశిక్ష పడేలా దిశ చట్టం రూపొందించేందుకు సీఎం జగన్ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయించటం..దాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఐదవ రోజు హోంమత్రి సుచరిత దిశ చట్టం బిల్లును ప్రవేశ పెట్టారు. 

గతంలో అత్యాచార ఘటనలల్లో విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నాలుగు నెలల్లో పూర్తి కావాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సీఎం జగన్ ప్రభుత్వం మరింతగా కుదించి…మూడు వారాల్లోగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి 21 రోజుల్లో ఉరి శిక్షపడాలని మార్పులు చేశారు. ఈ దిశ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందింది.

Categories
National

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. సోమవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభకు పంపగా బుధవారం అక్కడ కూడా ఆమోదం లభించింది. పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లుకు ఆమోదం లభించడంతో రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లును కేంద్రం పంపించింది. దీంతో బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ కూడా ఆమోదం తెలిపారు.

బుధవారం(డిసెంబర్11, 2019) రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. అంతకముందు లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు CAB. 

పౌరసత్వ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింల హక్కులకు విఘాతం కలుగుతుందని వాపోతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ వచ్చిన భారత మూల సిద్ధాంతాలకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుందని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. విభజించి పాలించు అనే విధానానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసినట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డాయి.

పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఈ బిల్లును సుప్రీం కోర్టులో సవాల్‌ చేయాలని భావిస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకంతో చట్టరూపం దాల్చిన ఈ బిల్లుపై తాము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు న్యాయ సమీక్ష ముందు నిలవదని ఇది వరకే ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఇదే బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఐయూఎంఎల్‌ తన పిటిషన్‌లో తెలిపింది.

మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అసోం, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గువాహటిలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గురువారం సాయంత్రం రోడ్లపైకి చేరుకున్న నిరసనకారులపై భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఘర్షణల్లో గాయపడ్డ మరికొందరికి గువాహటి మెడికల్‌ కాలేజ్‌లో చికిత్స అందిస్తున్నారు.  
 

Categories
Uncategorized

అత్యాచారం చేస్తే 21 రోజుల్లో మరణశిక్ష : ఏపీ క్రిమినల్ లా-2019కు కేబినెట్ ఆమోదం

ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే అతి త్వరగా నిందితులకు మరణశిక్ష పడేలా చట్టం తీసుకొచ్చింది. ఇటువంటి కేసుల్లో నిందితులను దోషులుగా నిర్థారించే ఆధారాలున్నప్పుడు మూడు వారాల్లోగా అంటే 21 వర్కింగ్ డేస్ ల్లో తీర్పు వచ్చేలా క్రిమినల్ లా చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ ఆమోదం పలికింది. ఇటువంటి కేసుల్లో వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి..14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి..మొత్తం 21 రోజుల్లో కోర్టుల్లో తీర్పు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటారు.
  
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రస్తుతం అత్యాచారాల కేసుల్లో నాలుగు నెలల్లోగా తీర్పు రావాలనే ఉంది. దీన్ని నాలుగు నెలల నుంచి 21 రోజులకు కుదిస్తూ చేసిన బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం పలికింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలోను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం జరిగింది.

అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక ఘటనల్లో నేరాల విచారణకు ప్రతి జిల్లాల్లోను ప్రత్యే కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు సోషల్ మీడియా వేధికగా బాధిత మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్టవేసేలా కేబినెట్ నిర్ణయించింది. మహిళలను కించపరిచేలా చేస్తున్న చర్యల్ని ఖండించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగ్ లు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపనుంది.

ఇటువంటి చర్యలు మొదటిసారి చేస్తే.. రెండేళ్ల జైలు శిక్ష, రెండోసారి చేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష పడేలా కఠిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిల్లలపై లైంగిక వేధింపులు, నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్) సెక్షన్ కింద ఐదేళ్ల నుంచి పదేళ్ల పాటు జైలుశిక్ష..పోక్సో చట్టం కింద ఇప్పటి వరకూ 3 నుంచి ఐదేళ్లు జైలు శిక్ష ఉన్న ఈ శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. దీంతో ఇక మహిళల్ని టచ్ చేయాలంటే భయపడాల్సిందే అనేలా జగన్ ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది.

* మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
* ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కు కేబినెట్ ఆమోదం
* ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019కి కేబినెట్ ఆమోదం
* అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష
* నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు
* వారం రోజుల్లో దర్యాఫ్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి, 21 వర్కింగ్ డే స్ లో తీర్పు
* ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు
* మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు
* అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు
* సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడితే చర్యలు
* మహిళలను కించపరిస్తే సెక్షన్ 354(ఇ) కింద చర్యలు
* మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష
* పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354(ఎఫ్) కింద చర్యలు
* ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలశిక్ష
* పోక్సో చట్టం కింద ఇప్పటివరకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష
* శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు ఆమోదం

Categories
National

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం 

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం (డిసెంబర్ 4)ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర కేబినెట్ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్  శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లు ఈ వారంలోనే వేశపెట్టనుంది.  

పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బిల్లు ప్రవేశపెడతారని సమాచారం. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లోక్ సభ, రాజ్యసభల్లో  సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ఆయన మంత్రి రాజ్ నాథ్ సింగ దిశానిర్దేశం చేశారు.
 
బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. భారత్‌లో 11 ఏళ్లు తప్పనిసరిగా నివసించి ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. దానిని ఇప్పుడు ఆరేళ్లకు తగ్గించినట్లు సమాచారం. 1955నాటి పౌరసత్వ బిల్లు స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.