Categories
International

టిక్‌టాక్‌ నిషేధం దిశగా.. భారత్ దారిలోనే అమెరికా?

టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలు కూడా చైనాపై చర్యలు ప్రారంభించాయి. టిక్‌టాక్‌తో సహా ఇతర చైనా యాప్‌లపై నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ మంగళవారం ట్వీట్ చేశారు.

గతంలో, టిక్‌టాక్‌తో సహా పలు చైనీస్ యాప్‌లను నిషేధించడం గురించి ఆస్ట్రేలియా కూడా మాట్లాడింది. టిక్‌టాక్‌లో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. భారతదేశంలోనే టిక్‌టాక్‌లో 200 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే నిషేధం తర్వాత టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లు భారతదేశంలో తమ కార్యకలాపాలను మూసివేసాయి. దీనివల్ల ఈ కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో కూడా టిక్‌టాక్ నిషేధం?
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించడం గురించి చర్చ జరుగుతోంది. టిక్‌టాక్‌ వంటి చైనా సోషల్ మీడియా యాప్స్ జాతీయ భద్రతకు ముప్పు అని ఆస్ట్రేలియా ప్రభుత్వం అభిప్రాయపడింది. వినియోగదారులు చైనాతో డేటాను పంచుకుంటే ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం భావిస్తుంది. టిక్‌టాక్‌కు ఆస్ట్రేలియాలో 1.6 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.

చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్ ఆస్ట్రేలియా ప్రజల నుంచి డేటాను సేకరిస్తోందని, మొత్తం సమాచారం చైనాలోని సర్వర్‌లో నిల్వ చేయబడుతోందని, ఇది ఆస్ట్రేలియా జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా మారనుందని ఆస్ట్రేలియా అభిప్రాయపడింది.

Categories
Latest National

లద్దాక్ కు ప్రధాని మోడీ..టాప్ కమాండర్లతో మీటింగ్

భారత ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్ లో పర్యటించారు. 2020, జులై 03వ తేదీ శుక్రవారం ఉదయం జరిగిన ఈ అకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఉదయం CDF Chief బిపిన్ రావత్ తో కలిసి లేహ్ కు చేరుకున్నారు. భారతీయ సైనికులను కలువనున్నారు. ఇటీవలే చైనా సైనికులు జరిపిన దాడిలో భారతీయ జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సైనికులు, ఆయుధాలను చైనా భారీగా మోహరిస్తుడడంతో..ధీటుగా భారత్ స్పందిస్తోంది. ఈ క్రమంలో అందరి చూపు ప్రధాని మోడీ పర్యటనపై నెలకొంది.  సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు.

అంతేగాకుండా టాప్ కమాండర్లతో సమావేశమై..తీసుకుంటున్న..తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకోనున్నారు. చైనా సైనికులు జరిపిన దాడిలో గాయపడిన జవాన్లను మోడీ పరామర్శించనున్నారని తెలుస్తోంది. సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు ఓ గట్టి సందేశాన్ని ఇవ్వడంలో భాగంగా మోడీ అక్కడ పర్యటించారని సమాచారం. 2020, జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్‌కు చెందిన 20 మందిసైనికులు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే.

తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో భారత సైనికులపై డ్రాగన్‌ ఆ‍ర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మన జవాన్లపై దాడికి చైనా లాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్‌-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

Read:సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి తరగతులు..

Categories
National

చైనా యాప్ లపై నిషేధాన్ని స్వాగతించిన పేటీఎం వ్యవస్థాపకుడు

టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించాడు. విశేష జనాదరణ పొందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్ లను దేశంలో నిషేధించడం దేశ ప్రయోజనాల విషయంలో తీసుకున్న ఓ సాహసోపేతమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ సేవలందిస్తున్న పేటీఎం యాప్ ను వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే భారత సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇదో మొబైల్ ఇంటర్నెట్ కంపెనీ. దీనిలో చైనా కంపెనీలైన ఆలీబాబా, యాంట్ ఫైనాన్స్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అయినప్పటికీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చైనా యాప్ ల నిషేధంపై స్పందించడం విశేషం. మంగళవారం (జూన్ 30, 2020) ఆయన ట్వీట్ చేస్తూ దేశ ప్రయోజనాల విషయంలో ఇదో ధైర్యంతో కూడిన చర్యని అన్నారు.

భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా దోహదం చేస్తుందని చెప్పారు. భారతీయ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ప్రజలకు కొత్త ఆవిష్కరణలను అందించాల్సిన సమయమిదేనని అన్నారు.

Categories
Latest National Technology

TikTokతో స‌హా 52 చైనా APPల‌పై నిషేధం ?

చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు భార‌త్ రెడీ అవుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. 20 మంది భార‌త సైనికుల‌ను పొట్ట‌న పెట్టుకున్న చైనాపై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హంగా ఉంది. ఆ దేశం త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. క్రమంలోనే టెలికాం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ కు త‌గిన ఆదేశాలు జారీ చేసింది. 4జీ అప్ గ్రేడ్ సేవలకు చైనా వస్తువులను వినియోగించకూడదని నిర్ణయం తీసుకుంది.

తాజాగా…చైనా యాప్ ల‌పై కూడా నిషేధం విధించాల‌ని కేంద్రం భావిస్తోంది. చైనాతో సంబంధం ఉన్న 52 యాప్ ల‌ను నిషేధించాల‌ని నిఘా సంస్థ‌లు కేంద్రాన్ని కోరాయి. భ‌ద్ర‌తా కార‌ణాల వ‌ల్ల వాటిని వాడ‌కుండా వినియోగ‌దారుల‌ను చైత‌న్య‌ప‌రిచే విధంగా చూడాల‌ని నిఘా సంస్థ‌లు ప్ర‌తిపాదించాయి. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి ఆమోదం తెలిపింది.

చైనా యాప్ ల‌ వినియోగం వ‌ల్ల‌…వినియోగ‌దారుల డేటా భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంద‌ని ఇటు నిపుణులు కూడా హెచ్చ‌రిస్తున్నారు. నిషేధిత జాబితాలో TikTok, Zoom, LIKE, Helo, Mi Video call-Xiaomi, Vigo Video, Kwai, Bigo Live, Weibo, WeChat, VivaVideo- QU Video Inc, and Mi Community ఇత‌ర యాప్స్ ఉన్నాయ‌ని స‌మాచారం.

ఈ యాప్స్ కూడా ఉన్నాయా ? : – gaming, sharing files, mailing, and accessing news. mail master, parallel space, qq mail, qq newsfeed, wesync, selfiecity, clash of kings, qq launcher, qq security centre, qq player, qq music, wonder camera, es file explorer, qq international, cacheclear du apps studio, baidu translate, baidu map, du cleaner, du privacy, and clean master- cheetah

Read: చైనాపై యుద్ధం ప్ర‌క‌టించిన డిఫెన్స్ కాల‌నీ..ఎలా అంటే

Categories
Technology

Mobile Appలు ఫోన్‌లో నుంచి తీసేసినా అకౌంట్‌లోనే..

ఆండ్రాయిడ్ ఫోన్2లో వద్దనుకున్న యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తారు. ఇక అక్కడితో అయిపోయిందనుకోవద్దు. అది మీ అకౌంట్‌లోనే ఉంటుంది. ఉండిపోతే ఏదో నష్టం ఉందని కాదు. కాకపోతే మీరు ఏ యాప్ వాడారో.. ఇతరులు తెలుసుకోవడం ఇట్టే సులువైపోతుంది. లేదా మీరే పాత యాప్‌ను రీ ఇన్‌స్టాల్ చేసుకోవాలనిపిస్తే.. ఎక్కడ ఉంటుందో తెలుసా..

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Play store ఓపెన్ చేయండి. 
స్క్రీన్‌లో కుడివైపు ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయండి. అప్పుడొక మెనూ వస్తుంది. అందులో My apps & games మీద నొక్కండి. 
అక్కడ నాలుగు ఆప్షన్‌లు Updates, Installed, Library, Beta కనిపిస్తాయి. 
Library మీద క్లిక్ చేస్తే మీరు ఆ Google accountతో ఎప్పుడు ఏ యాప్ వాడారో అన్నీ వివరాలు వచ్చేస్తాయి. 
అక్కడ ఉన్న Install బటన్ మీద నొక్కితే రీ ఇన్‌స్టాల్ అవుతుంది. లేదంటే అక్కడే ఉన్న’×’ మీద నొక్కితే శాశ్వతంగా క్లోజ్ అయిపోతుంది. 

మరింకెందుకు ఆలస్యం.. మీ ఫోన్‌లో గ్యాప్ కోసం cachesని క్లియర్ చేసుకోవడంతో పాటు ఈ యాప్ సమాచారాన్ని కూడా తుడిచిపెట్టేయండి. 

Categories
International Technology

డేంజరస్ యాప్స్ : ఫేస్ బుక్ చేతికి యూజర్ల డేటా

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో షాక్‌ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్ల డేటా లీక్‌తో ఇబ్బందులు పడుతున్న ఫేస్‌బుక్‌ మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లకు చెందిన 11 ప్రముఖ యాప్స్..యూజర్ల పర్మిషన్ లేకుండానే వారి పర్సనల్ డేటా (వ్యక్తిగత వివరాలు)ను  ఫేస్ బుక్ కు పంపుతాన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ ఆర్టికల్ ను ప్రచురించింది. 
 

ఆ యాప్స్ వినియోగించేవారి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని ఫేస్ బుక్ కు ఈ యాప్స్ చేరవేస్తున్నాయనే ఆ ఆర్టికల్ లో పేర్కొంది. దీంట్లో  మహిళలకు సంబంధించిన పలు రహస్య సమాచారం కూడా ఉందట. ఆ యాప్స్ వినియోగించే యూజర్రలు ఫేస్ బుక్ ను వాడకపోయినా ఇన్ఫర్మేషన్ మాత్రం ఫేస్ బుక్ కు చేరుతోందని తెలిపింది. తాము వ్యక్తిగత సమాచారాన్ని  సేకరిస్తున్న విషయాన్ని యూజర్లకు యాప్స్ స్పష్టం చేయటంలేదని  వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఫేస్ బుక్ అధికార ప్రతినిథి నిస్సా ఆన్ క్లలెసరియా సమర్థించుకున్నారు. మొబైల్ ప్రకటనల కోసం ఈ పద్ధతిని  చాలాకాలంగా వాడుతున్నామని చెప్పారు. తాము ఏ సమాచారాన్ని సేకరిస్తున్నామో యూజర్లకు చెప్పాల్సిన బాధ్యత ఆయా యాప్స్ పైనే ఉందన్నారు. యాప్స్ నుంచి ఇప్పటి వరకూ తాము అందుకున్న సున్నితమైన సమాచారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు.