Categories
Education and Job

నిరుద్యోగులకు శుభవార్త : ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్‌లో 84 పోస్టుల భర్తీకి 2019,

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్‌లో 84 పోస్టుల భర్తీకి 2019, జనవరి 23వ తేదీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 78 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు, 6 అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీచేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు 2019, జనవరి 30 వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ స్టాటికల్ పోస్టుకు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 6 వరకు దరఖాస్తుకు చేసుకోవచ్చు.

 

* ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్
* ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్‌లో 84 పోస్టులు భర్తీ
* 78 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు
* 6 అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు
* అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల దరఖాస్తుకు జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు గడువు
* అసిస్టెంట్ స్టాటికల్ పోస్టుకు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు అప్లికేషన్స్‌కు గడువు

Categories
Andhrapradesh Education and Job

237 జేఎల్ పోస్టులు : APPSC నోటిఫికేషన్

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగాల్లో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్ణీత మొత్తంతో

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగాల్లో పీజీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్ణీత మొత్తంతో అప్లికేషన్, పరీక్ష ఫీజు చెల్లించి 2019, ఫిబ్రవరి 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7 వరకు మాత్రమే ఫీజు చెల్లించడానికి అవకాశం.

 

* ఇంటర్మీడియట్ బోర్డులో జేఎల్ పోస్టులు
* జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్లు- 237 పోస్టులు
* ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
* ఫిబ్రవరి 7 ఫీజు చెల్లించడానికి చివరి తేది
* అప్లికేషన్ ప్రాసెస్ ఫీ – రూ.250
* ఎగ్జామినేషన్ ఫీ – రూ.120
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీల అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీ మినహాయింపు
* పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ(150 ప్రశ్నలు)
* పేపర్ -2 సంబంధిత సబ్జెక్ట్ (150 ప్రశ్నలు)
* ఇంటర్వ్యూ (ఓరల్ టెస్ట్)

 

స‌బ్జెక్టుల వారీగా ఖాళీలు…
సబ్జెక్టు     ఖాళీలు
ఇంగ్లీష్     19
తెలుగు     18
హిందీ     17
ఉర్దూ     04
సంస్కృతం     03
ఒరియా     02
కెమిస్ట్రీ     21
బోట‌నీ     19
జువాలజీ     20
కామ‌ర్స్     18
ఎక‌నామిక్స్     25
సివిక్స్     18
హిస్టరీ     18

 

విద్యార్హ‌త‌లు: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకాం/ బీఎస్సీ ఆన‌ర్స్/ బీఏ ఆన‌ర్స్/ బీకాం ఆన‌ర్స్) లేదా ఇత‌ర త‌త్స‌మాన పీజీ ఉత్తీర్ణ‌త‌ ఉండాలి.

వెబ్‌సైట్ : https://psc.ap.gov.in

Categories
Education and Job

ఏపీపీఎస్సీలో ఏం జరుగుతోంది ? 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు జాబ్‌ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ ఎప్పుడు నోటిఫికేషన్‌లు విడుదల చేస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ…ప్రభుత్వం మధ్య సమన్వయం కొరవడిందా ? రాజకీయ వత్తిళ్లకు లోనవుతుందా అనే టాక్ వినిపిస్తోంది. వీటన్నింటి గురించి తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయ భాస్కర్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి.