Categories
Andhrapradesh Jobs

ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఖరారు

ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో వాయిదా వేసిన పలు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం (జూన్ 22, 2020)న విడుదల చేసిన ప్రకటనలో పరీక్షల తేదీల వివరాలను పేర్కొన్నారు. 

(సెప్టెంబర్‌ 15, 2020)న ప్రారంభించనుంది. (నవంబర్‌ 13, 2020) వరకు పలు తేదీల్లో వివిధ ఉద్యోగ నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. నవంబర్ 2వ తేది నుంచి 13 వరకు గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ప్రకటనలో పేర్కొన్నారు. 

పరీక్షల తేదీలు
సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు 
సెప్టెంబర్‌ 21, 22, 23, 24 తేదీల్లో గెజిటెడ్‌ ఉద్యోగాల నియామక పరీక్షలు 
సెప్టెంబర్‌ 21, 22 అసిస్టెంట్‌ బీసీ, సోషల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగ పరీక్షలు
సెప్టెంబర్‌ 22న రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ మైనింగ్‌ సర్వీస్‌ ఉద్యోగ నియామక పరీక్ష
సెప్టెంబర్‌ 23న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల నియామక పరీక్ష
సెప్టెంబర్‌ 23న పోలీస్‌ విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామక పరీక్ష 
సెప్టెంబర్‌ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు
సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
 

 

Categories
Andhrapradesh Jobs Latest

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ 

ఏపీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగాల నియామక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13 వరకు పలు విభాగాలకు పరీక్షలు నిర్వహించనుంది.

నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూపు 1 ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో డిగ్రీ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 22న రాయల్టీ ఇన్ స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీసు ఉద్యోగ నియామక పరీక్షలు, సెప్టెంబర్ 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల నియామక పరీక్ష, సెప్టెంబర్ 23న పోలీసు విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష నిర్వహించనుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ విభాగంలో డైరెక్టర్ పోస్టులు, అదే తేదీల్లో ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్షలు, సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో  నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

Categories
Education and Job

APPSC: AEE సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలు వచ్చేసింది

విజయవాడలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (AEE) పోస్టుల భర్తీకి సంబంధించి మే 14, 15 తేదీల్లో మెయిన్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 2న విడుదల చేసింది.

అయితే షెడ్యూలు ప్రకారం మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 10 వరకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారని ఈ రోజు (డిసెంబర్ 11, 2019)న APPSC వెల్లడించింది. ఇక మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 527 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు APPSC ఎంపిక చేసింది.

రాష్ట్రంలోని మొత్తం 309 AEE పోస్టుల భర్తీకి న‌వంబ‌ర్ 29న APPSC నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 17న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఫిబ్రవరి 25న విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఏప్రిల్ 18న తుది ‘కీ’ తోపాటు స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించింది.

స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షల నిర్వహించారు. జూన్ 5న ప్రాథమిక కీని, ఆగస్టు 29న రివైజ్డ్ కీని APPSC విడుదల చేసింది. డిసెంబరు 2న మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ధ్రవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.

Categories
Education and Job

APPSC నోటిఫికేషన్లలో మార్పులు

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో మార్పు చేశారు. ఏపీపీఎస్సీ 2018-19లో విడుదల చేసిన 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ లో మార్పులు చేసింది.

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో మార్పు చేశారు. ఏపీపీఎస్సీ 2018-19లో విడుదల చేసిన 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ లో మార్పులు చేసింది. ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన షెడ్యూల్ రివైజ్ అయింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజేనేయులు తెలిపిన వివరాల ప్రకారం రివైజ్ చేసిన షెడ్యూల్ లో మార్పులు ప్రకటించారు. అందులో భాగంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్ పరీక్షలు (ఫిబ్రవరి 3, 2020), (ఫిబ్రవరి 4, 2020)న నిర్వహించనున్నారు. అదే విధంగా డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ పోస్టు కోసం మెయిన్ పరీక్ష తేదీ (ఫిబ్రవరి 5, 2020), (ఫిబ్రవరి 6, 2020)గా ఖరారు చేశారు. 

పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టు కోసం (ఫిబ్రవరి 17, 2020) నుండి (ఫిబ్రవరి 20, 2020) తేదీల్లో నిర్వహించనున్నారు. సంక్షేమ విభాగాల అసిస్టెంట్ పరీక్షల తేదీలను (ఫిబ్రవరి 26, 2020)తో పాటుగా (ఫిబ్రవరి 27, 2020)వ తేదీన జరుపనున్నారు. రాయల్టీ ఇన్ స్పెక్టర్ పోస్టు కోసం (ఫిబ్రవరి 27, 2020)వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టుల పరీక్ష (ఫిబ్రవరి 28, 2020)న నిర్వహించాలని నిర్ణయించారు.

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం (ఫిబ్రవరి 28, 2020)న పరీక్ష నిర్వహించనున్నారు. (ఫిబ్రవరి 28, 2020) అసిస్టెంట్ డైరెక్టర్ పరీక్ష, అసిస్టెంట్ కెమిస్ట్ పరీక్ష జరుగనుంది. (ఫిబ్రవరి 28, 2020), (ఫిబ్రవరి 29, 2020) టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల కోసం మెయిన్స్ నిర్వహించనున్నారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం మెయిన్స్ పరీక్షను (ఫిబ్రవరి12, 2020)తో పాటుగా (ఫిబ్రవరి 13, 2020)న నిర్వహించాలని నిర్ణయించారు. 

జియో ఫిజికల్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం (మార్చి 27, 2020), మార్చి (29, 2020)న నిర్వహించనున్నారు. (మార్చి 28, 2020) హౌడ్రోజియోలజీ టెక్నికల్ అసిస్టెంట్ కోసం పరీక్ష జరుగనుంది. (మార్చి 28, 2020)న వెల్ఫేర్ ఆర్గనైజర్ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారుల పోస్టుల పరీక్షను (మార్చి 28, 2020) వ తేదీతోపాటుగా (మార్చి 29, 2020)న నిర్వహించనున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం పరీక్షలను (మార్చి 28, 2020) వ తేదీతో పాటుగా (మార్చి 29, 2020) వ తేదీన నిర్వహించనున్నారు. (మార్చి 29, 2020) డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే పోస్టుల భర్తీ కోసం మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
 

Categories
Education and Job

అభ్యర్థులకు ముఖ్యగమనిక : APPSC పరీక్షలు వాయిదా

ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 5 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ లో పరీక్షలు జరగాల్సి

ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 5 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ లో పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పుడా షెడ్యూల్ మారింది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు రానున్నాయి. 

వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్(10/2018), గెజిటెడ్‌ పోస్టులు(14/2108), పాలిటెక్నిక్‌ లెక్చరర్(23/2018), నాన్‌-గెజిటెడ్‌ ఆఫీసర్స్(15/2019), డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల(26/2018) మెయిన్స్ పరీక్షలు వాయిదా ఉన్నాయి. ఎగ్జామ్స్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్ తయారీ ఇతర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు తగిన సమయం లేకపోవడంతో పరీక్షలను వాయిదా వేసినట్టు కమిషన్ తెలిపింది. వీటి పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది అక్టోబర్ 22న ప్రకటిస్తామని కమిషన్ సభ్యులు వెల్లడించారు.

* ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా
* 5 నోటిఫికేషన్లకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా
* అక్టోబర్, నవంబర్ లో జరగాల్సిన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్
* అక్టోబర్ 22న కొత్త పరీక్షల తేదీలు ప్రకటన

Categories
Uncategorized

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

అధికారంలోకి వచ్చిన స్వల్ప సమయంలోనే ఒకేసారి లక్షా 20 వేలకు పైగా సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డ్ సృష్టించిన ఏపీ సీఎం జగన్.. మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్

అధికారంలోకి వచ్చిన స్వల్ప సమయంలోనే ఒకేసారి లక్షా 20 వేలకు పైగా సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డ్ సృష్టించిన ఏపీ సీఎం జగన్.. మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్ చర్చించారు. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. 

సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అందించాలని అధికారులను కోరారు. వారి నుంచి పూర్తి వివరాలు వచ్చాక నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ద్వారా పోస్టులను ఫిలప్ చేస్తారు. ప్రతి జనవరిలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం జగన్ తెలిపారు. 

అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చాక హామీల అమలు దిశగా సీఎం ముందుకెళ్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. లక్షా 20 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తానని ప్రజా సంకల్ప యాత్రలో జగన్ చెప్పారు. అధికారం చేపట్టిన 4 నెలల్లోనే 2 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్ ఉద్యోగాలను సృష్టించారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి.. 1.20 లక్షల మంది కార్యదర్శులను నియమించారు.

Categories
Andhrapradesh

నో టెన్షన్ : అన్ని ఉద్యోగాలకు…ఒకటే పరీక్ష

యువతపై పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ దీనిపై దృష్టి సారించింది. దీని కోసం కమిషన్ అంతర్గతంగా ఓ కమిటీ వేసి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగాలను ఇంజనీరింగ్,టీచింగ్,సివిల్ సర్వీసెస్,మెడికల్,జనరల్ సర్వీసెస్ గ్రూపులుగా విభజించాలని కమిషన్ ఫ్లాన్ చేస్తోంది.

వీటికి అనుగుణంగా ప్రకటనలు జారీ చేసి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో గ్రూప్ నకు ఒక్కో పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఈ గ్రూపుల్లో ఉండే ప్రత్యేకమైన(న్యాయ,ఆర్థిక,తదితర)పోస్టులకు మాత్రం వాటి అర్హతలను అనుసరించి అభ్యర్థుల ఎంపిక జరుగనుందని తెలుస్తోంది. నెలాఖరులోగా గ్రూపులపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వం దీనిని పరిశీలించిన అనంతరం అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
 

Categories
Education and Job

ఇంటర్ అర్హతతో గ్రూప్ 4 ఉద్యోగాలు

తెలుగు రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు గ్రూప్ 4 విభాగంలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నాయి. ఇందుకోసం పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఇంటర్ పాస్ అయిన వాళ్లు అర్హులు.

గ్రూప్ 4 ఉద్యోగాలు
* విద్యార్హత : ఇంటర్ పాసైన వాళ్లు అర్హులు
* ఎంపిక : రిటన్ టెస్ట్ 2 పేపర్లు (జనరల్ స్టడీస్, సెక్రటేరియల్ ఎబిలిటీస్).
* ఒక్కో పేపర్ కి రెండున్నర గంటల వ్యవధి
* ప్రశ్నాపత్రం ఇంటర్మీడియట్ స్తాయిలో ఉంటుంది
* ఒక్కో పేపర్ కు 150 ప్రశ్నలు చొప్పున 300 ప్రశ్నలు ఉంటాయి
* వెబ్ సైట్స్ tspsc.gov.inpsc.ap.gov.in

Categories
Education and Job

నేడు ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్

ఏపీలో 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి  స్క్రీనింగ్ పరీక్ష జరుగునుంది. స్ర్కీనింగ్ టెస్ట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్-2 పరీక్షలకు 2లక్షల 96వేల 36 మంది హాజరు కానున్నారు. టెస్ట్ కోసం ఏపీ వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ ఓఎంఆర్ విధానంలోనే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. మొదటిసారిగా నెగెటివ్ మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలశ్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు.

స్క్రీనింగ్ టెస్ట్ ఓఎంఆర్ షీట్ బేస్డ్ గా జరుగనుంది. ఒరిజినల్ ఐడీ కార్డుతో పరీక్షకు హాజరు కావాలని సూచించింది. ఓఎంఆర్ షీట్ డ్యామేజ్ కాకుండా అభ్యర్థులు జాగ్రత్త పడాలని తెలిపింది. ఓఎంఆర్ షీట్ డ్యామేజ్ అయితే స్కానర్ పరిగణనలోకి తీసుకోదు. అభ్యర్థులు బ్లూ, బ్లాక్ పెన్ లను మాత్రమే వాడాలని సూచించించారు. ఇంగ్లీష్ వెర్షన్ ను మాత్రమే అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపింది. 

రివైజ్డ్‌ హాల్‌ టికెట్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు ఒరిజినల్‌ ప్రూఫ్‌తో పాటు చేరుకోవాలని.. ఆలస్యమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమంటున్నారు. ఇక ఈసారి గ్రూప్-2 పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు. 

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 12 నిష్పత్తిలో మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. వీరికి జులై 18, 19 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్‌ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.

 

Categories
Education and Job

మే 5న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష

మే 5వ తేదీన గ్రూప్ – 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, సాధారణ ఎన్నికలు రావడంతో ప్రిపరేషన్‌కు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని, పరీక్షను నెలపాటు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు, పలువురు ప్రజాప్రతినిధులు APPSC చైర్మన్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధానాధికారికి విన్నవించారు. కానీ APPSC ఛైర్మన్ ఉదయ భాస్కర్ గ్రూప్ – 2 ప్రిలిమ్స్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

727 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ముందే చూసుకుని.. చెప్పిన టైమ్ కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. పరీక్ష కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం మే 5న గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా జులై 18, 19 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో గ్రూప్-2 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

పరీక్ష విధానం.. 
రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం రెండు దశల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష, రెండో దశలో 450 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలో ఒకే పేపర్ ఉండగా మెయిన్ పరీక్షల్లో మాత్రం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు. స్క్రీనింగ్ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.