Categories
Business National

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : ఏప్రిల్ నుంచి పెట్రోల్ రేట్ల పెరుగుదల

వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమౌతుంటే..మళ్లీ ఈ బాదుడేంది ? అంటున్నారా ? కానీ ఇది నిజమే. ఏప్రిల్ 01 నుంచి ధరలు పెరగబోతున్నట్లు వ్యాపారనిపుణులు వెల్లడిస్తున్నారు. కొన్ని రోజులుగా ఏదో తగ్గుతున్న రేట్లు..మరికాస్తా తగ్గుతాయని అనుకుంటే..ఈ చేదు వార్త ఏంటీ అని దిగాలు చెందుతున్నారు కొంతమంది. దీనికంతటికి కారణం BS-6 ఇంధనం.

ప్రస్తుతం యూరో -4 లేదా భారత్ స్టేజ్ (BS-6) ఇంధానాన్ని వాడుతున్నాం. BS-6 వాహనాలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి BS-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగించడం జరుగుతోంది. కానీ కాలుష్యం మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీంతో మోదీ సర్కార్ ఏప్రిల్ 01 నుంచి దేశ వ్యాప్తంగా BS – 6 ఇంధనాన్ని అందుబాటులోకి రానుంది. ఇధిలా ఉంచితే…BS – 6 ఇంధన ఉత్పత్తి కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఏప్రిల్ 01 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలకు మరలా రెక్కలు వస్తాయని, పెరుగుదల లీటర్‌కు 50 పైసల నుంచి ఒక రూపాయి మధ్య ఉండే అవకాశం ఉందని అంచాన వేస్తున్నారు. 

శుద్ధి కర్మగారాలను అప్ గ్రేడ్ చేయడానికి ఇప్పటి వరకు దాదాపు రూ. 17 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు IOC కంపెనీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ శుద్ధి కర్మాగారాలను అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు డబ్బులు ఖర్చు పెట్టాయన్నారు. మార్చి 01వ తేదీ నుంచి కొత్త ఇంధనాలు మాత్రమే సప్లై అవుతాయన్నారు. ధరల పెరుగుదల వినియోగదారులపై అంతగా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

యూరో 6 గ్రేడ్ ఇంధనం అత్యంత శుద్ధి చేసింది కావడంతో కాలుష్య కారకాలు ఉత్పన్నం కాబోవని అంచనా. దేశ రాజధాని ఢిల్లీతో పాటు..అన్ని ప్రధాన నగరాల్లో వాహన కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో..BS-6 రాకతో సమస్యకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అందుకే BS -6  ఇంధన ఉత్పత్తిని ముందుకు తీసుకొచ్చారు. 

Read More | Delhi Riots : చిన్న ఆస్పత్రి ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది

Categories
Business National

ఏప్రిల్ 1 నుంచి దేశంలో క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్

కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్‌గా పేరున్న యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా

కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్‌గా పేరున్న యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం ఏర్పాట్లు చేసింది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్ అందుబాబులోకి రానుంది. తద్వారా యూరో-6 ఇంధనం వినియోగిస్తున్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరనుంది. ఏప్రిల్ 1 నుంచి అత్యంత శుద్ధి ఇంధనం భారత్‌లో వినియోగంలోకి వస్తుంది.

కాలుష్యం తగ్గించడమే లక్ష్యం:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూరో-4 లేదా భారత్ స్టేజ్(బీఎస్-6) ఇంధనాన్ని వాడుతున్నాం. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినా.. బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీంతో కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా యూరో-6 ఇంధనాన్ని అందుబాటులోకి తేనుంది కేంద్ర ప్రభుత్వం. యూరో-6 గ్రేడ్ ఇంధనం అత్యంత శుద్ధి చేసింది. దీని ద్వారా కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుపోతాయి. ముఖ్యంగా.. ప్రమాదకరమైన సల్ఫర్ ఉద్గారాలు 10 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియమ్)కు తగ్గుతుంది. ఈ రణంగానే యూరో-6 ఇంధన వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

మూడేళ్ల కాలంలోనే అప్ గ్రేడ్:
భారత్‌లో ప్రస్తుతం యూరో-4 ఇంధనం వినియోగంలో ఉంది. యూరో-4 నుంచి యూరో-5 అవసరం లేకుండానే భారత్ నేరుగా యూరో-6కి అప్‌గ్రేడ్ అవుతుండటం మరో విశేషం. అది కూడా ప్రపంచంలోని మిగతా దేశాలకు సాధ్యపడని రీతిలో కేవలం 3 ఏళ్ల కాలంలోనే ఇండియా ఈ ఘనత వహిస్తోంది. యూరో-6ను భారత్ బీఎస్-6గా వ్యవహరిస్తోంది.

బీఎస్-6 అందుబాటులోకి వచ్చినా బీఎస్-4 వాడకం:
దేశంలో అత్యాధునిక మోడళ్ల కార్లు, బైకుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కాలుష్య నియంత్రణ అంశంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాల వినియోగం పెరిగింది. కానీ, వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడ్ మాత్రం అప్‌డేట్ కాలేదు. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినా నేటికీ బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీంతో కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో నియంత్రించలేకపోతున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. దేశంలోని మెట్రో నగరాలన్నీ భవిష్యత్తులో ఇదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

ఉత్పత్తి ప్రారంభించిన రిఫైనరీలు:
దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిని ప్రారంభించాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఇంధనం చుక్కను యూరో-6 గ్రేడ్‌గా మార్చబోతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధన సరఫరాను మొదలుపెట్టాయని.. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యూయల్ స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని తెలిపారు.

ధరలు పెరుగుతాయా?
ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ఇంధనంతో పోలిస్తే.. యూరో-6 ఇంధనం ఉత్పత్తికయ్యే ఖర్చు కాస్త ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు నుంచి రూపాయి వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Read More>>Cut, Copy, Paste కనిపెట్టిన కంప్యూటర్ సైంటిస్ట్ ఇక లేరు

Categories
National Political

NPR రాష్ట్రపతితో మొదలు

జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. హింసాత్మకంగా మారి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే…NPR అప్‌డేట్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించడానికి కేంద్రం చర్యలు తీసుకొంటోంది. 

2020, ఏప్రిల్ 01వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. తొలుత న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరును మొట్టమొదట జాబితాలో చేర్చనున్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్లను అధికారులు నమోదు చేస్తారు. రాష్ట్రపతితో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయాలు వెల్లడించాయి. ఎన్యుమరేషన్ కోసం అధికారులు వారింటికి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రయ సందర్భంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రులు సందేశం ఇవ్వనున్నారని సమాచారం. 

దీనికి సంబంధించిన ఫారాల ప్రింటింగ్ మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానుందని అంచనా. అయితే..ఇందులో తల్లిదండ్రుల జన్మస్థలం, ఇతర వివాదాస్పదమైన అంశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. తమ తల్లిదండ్రులు ఎక్కడ జన్మించారో తమకు ఎలా తెలుసని ప్రశ్నిస్తున్నారు. 

NRC, NPR చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై పలు రాష్ట్రాలు గుస్సాగా ఉన్నాయి. ఈ చట్టాలను అమలు చేయవద్దని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాయి. NPR అప్ డేట్ ప్రక్రియ ఏప్రిల్ 01 నుంచి ప్రారంభం కానున్న సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Read More>> దిశ సినిమా : శంషాబాద్ ACPతో ఆర్జీవీ భేటీ

Categories
Business National

Unpaid : సమ్మెలోకి జెట్ ఎయిర్‌వేస్ పైలెట్లు

Jet Airways లో మరో సంక్షోభం రానుంది. ఆ సంస్థకు చెందిన పైలట్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. బాకీగా ఉన్న వేతనాలను చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

Jet Airways లో మరో సంక్షోభం రానుంది. ఆ సంస్థకు చెందిన పైలట్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. బాకీగా ఉన్న వేతనాలను చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పలు విమానాల సర్వీసులు నిలిచిపోయే ఛాన్స్ ఉంది. పైలెట్లకు నాలుగు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కష్టాల్లో మునిగి, నష్టాల నుంచి తేరుకునే మార్గం కోసం వెతుక్కుంటున్న జెట్ ఎయిర్ వేస్‌కు మరింత కష్టాలు రానున్నాయి. 
Read Also : బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ

జెట్ ఎయిర్ వేస్‌ని గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందని అందరూ భావించారు. ఈ సంస్థకు రుణదాతగా ఉన్న SBH, ఇతర బ్యాంకులు రుణాలిస్తాయని ప్రచారం జరిగింది. అయితే..SBH నుండి నిధులు రాకపోవడంతో పైలెట్లకు సకాలంలో వేతనాలు చెల్లించలేకపోయింది.

యాజమాన్య వైఖరికి నిరసిస్తూ ఏప్రిల్ 1వతేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్, జెట్ ఎయిర్‌వేస్ రిజిస్టర్డు పైలెట్ల యూనియన్ ప్రకటించింది. మార్చి 31వ తేదీలోగా చెల్లించాలని డెడ్ లైన్ విధించింది. అప్పటిలోగా జీతాలు చెల్లించకుంటే జెట్ ఎయిర్‌వేస్ విమానాలను నిలిపివేస్తామని యూనియన్ హెచ్చరించింది. 

లీజుదారులకు చెల్లింపులు, అద్దెలు కట్టలేకపోతోంది జెట్ ఎయిర్ వేస్. ఇక సిబ్బంది జీతాల విషయం సరేసరి. వారికి వేతనాలు కూడా చెల్లించడం లేదు. దీని కారణంగా విమానాల సర్వీసులను సంస్థ నిలిపివేస్తోంది. కొన్ని కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల సంస్థను మళ్లీ గాడిలో పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది జెట్ ఎయిర్ వేస్.  
Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?

Categories
National

46 రోజులు అమర్‌నాథ్ యాత్ర : ఏప్రిల్ 1నుంచి రిజిస్ట్రేషన్ షురూ

భోపాల్: హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లలని కోరుకునే యాత్ర అమర్‌నాథ్ యాత్ర.  ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాడు అంటే జూలై 1నుంచి ప్రారంభమై కానుంది. ఇది  ఆగస్టు 15 వరకూ కొనసాగనున్న ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. 2018లో అమర్‌నాథ్ యాత్ర 60 రోజులు జరిగింది. 2019లో ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై ఆగస్టు మొదటివారం వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 400కు మించిన బ్రాంచీల ద్వారా ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన నిబంధనలు కూడా కొనసాగిస్తున్న క్రమంలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని..75 ఏళ్ల కన్నా ఎక్కవ వయసుగల వారికి యాత్ర చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అలాగే ఆరు నెలలు దాటిన గర్భవతులు కూడా యాత్ర చేసేందుకు అవకాశం లేదు.  
 

Categories
National

ఇక రోజంతా విద్యుత్ : ఏప్రిల్ 1 నుంచి అమలు 

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి రోజంతా విద్యుత్ ను సరఫరా చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తప్ప, మిగిలిన అన్ని సమయాల్లో దీన్ని కచ్చితంగా అమలు చేయాలనే తలంపుతో ఉంది. నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయడంలో విఫలమయ్యే డిస్కంలపై జరిమానా విధించేందుకూ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె.సింగ్ ఫిబ్రవరి 26 మంగళవారం గురుగ్రామ్ లో అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో నిర్వహించే సమావేశంలో ఈ పథకంపై విస్తృతంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా విషయమై కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా రాష్ట్రాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది.

ఇందుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ఏప్రిల్ 1 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న గ్రిడ్ లను అనుసంధానించడం ద్వారా ఈ పథకం అమలుకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. గ్రిడ్ ల అనుసంధానం వల్ల జమ్మూకాశ్మీర్ లోని జల విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ ను కన్యాకుమారికి, గుజరాత్ సౌర విద్యుత్ ను అరుణాచల్ ప్రదేశ్ కు సరఫరా చేయడం వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.