Categories
Uncategorized

2రోజులు ఎన్నికల సెలవులు: స్కూళ్లకు అదనంగా ఒక రోజు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముఖ్య తేదీలను సెలవులుగా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు తొలివిడత ఆంధ్రలో ఎన్నికలు జరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 11న ఎన్నికలు, మే 23న లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ రెండు రోజులను సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ ఉత్తర్వులు విడుదల చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలోని 25 పార్లమెంట్‌ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. మరోవైపు పోలింగ్‌ కోసం ప్రభుత్వ, విద్యా సంస్థల భవనాలను ఎన్నికల కమిషన్‌ వాడుకుంటుంది. కాబట్టి ఎన్నికల ముందు రోజు అయిన ఎప్రిల్ 10వ తేదీన కూడా స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది.

Categories
Hyderabad

ఏప్రిల్ 10, 11 మరో సంక్రాంతి : బస్సులూ లేవూ.. టికెట్లు లేవూ

ఏడాదికి ఒక సంక్రాంతి వస్తేనే రచ్చరచ్చ. బస్సు టికెట్ల కోసం యుద్ధం. అలాంటిది 2019లో మరో సంక్రాంతి వచ్చింది. ఇది ఓట్ల పండుగ. ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరుగుతుండటం.. ఏపీలో టీడీపీ – వైసీపీ హోరాహోరీగా తలపడుతుండటం తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ అని తేలిపోవటంతో.. ఓట్ల వేటలో పడ్డాయి పార్టీలు. అభ్యర్థులు అయితే తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్ల లిస్టులతో రెడీ అయిపోయారు. ఆ రోజు కచ్చితంగా వచ్చి ఓటు వేసి వెళ్లాలి అంటూ.. అప్పుడే ఫోన్లు చేయటం మొదలుపెట్టారు.

మా వర్గం.. మా లీడర్ గెలవాలి అనుకునే ఉత్సాహంతులైన ఓటర్లు.. టికెట్ రిజర్వేషన్ మొదలుపెట్టేశారు. 2019, ఏప్రిల్ 10వ తేదీకి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. APSRTCలో నెల రోజుల ముందు అడ్వాన్స్ టికెట్ అవకాశం ఉంది. బుకింగ్ అలా ఓపెన్ చేశారో లేదో.. అలా అయిపోయాయి టికెట్లు. ప్రస్తుతం APSTRCలో ఏప్రిల్ 10, 11వ తేదీలకు టికెట్లు లేవు అని చూపిస్తోంది. రెగ్యులర్ బస్సుల్లోని టికెట్లు అన్నీ అయిపోయాయి. ఓపెన్ చేసిన 24 గంటల్లోనే ఏపీలోని 13 జిల్లాలకు వెళ్లే అన్ని బస్సుల్లో టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ప్రైవేట్ ట్రావెల్స్ స్పెషల్ బస్సులు :
కొంత మంది అభ్యర్థులు స్పెషల్ బస్సులు బుక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులకు అడ్వాన్సులు ఇచ్చేశారు. ఏప్రిల్ 10వ తేదీ రాత్రి హైదరాబాద్ లో బయలుదేరే బస్సు.. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం తిరిగి హైదరాబాద్ వచ్చే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ 50 ఓట్లు మాకే.. కచ్చితంగా పడతాయి అనుకుంటే చాలు స్పెషల్ బస్సు తీసుకుంటున్నారు. ఆర్టీసీతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనూ టికెుట్లకు డిమాండ్ వచ్చేసింది. టైం లేకపోవటం.. టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా బస్సులను అద్దెకు తీసుకుంటున్నారు.

మరో సంక్రాంతి :
ఏప్రిల్ 10, 11 తేదీలు ఆర్టీసీతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ కు మరో సంక్రాంతి అంటున్నారు. ఆర్టీసీ భారీ ఎత్తున స్పెషల్ సర్వీసులు నడపటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే వీటిలో 50శాతం ఛార్జీ అధికం. ఇక ట్రావెల్స్ అయితే నిలువుదోపిడీ. డిమాండ్ ఆధారంగా రేట్లు పెంచేస్తోంది. పోలింగ్ సీజన్ కు భారీగా క్యాష్ చేసుకోవటానికి ట్రావెల్స్ ఆల్ రెడీ మన కంటే ముందే వ్యూహాలతో సిద్ధం అయిపోయారు. ముందచూపు అంటే ఇదే కదా…