Categories
Education and Job Hyderabad

ఏప్రిల్ 18న తెలంగాణ INTER రిజల్ట్స్

తెలంగాణ INTER ఫలితాలు రేపు..మాపు అంటూ వస్తున్న పుకార్లతో ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ INTER ఫలితాలు రేపు..మాపు అంటూ వస్తున్న పుకార్లతో ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంటర్ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 18వ తేదీన ఫలితాలు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు..సెకండియర్ ఫలితాలు కూడా విడుదల చేస్తామన్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ ఇంటర్ ఫలితాలపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏపీలో ఫలితాలు విడుదల కావడంతో ఇక్కడ ఎప్పుడు రిలీజ్ చేస్తారోనని విద్యార్థులు..తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 
Read Also : పోటుగాళ్లు : వరల్డ్ కప్ టీమిండియా ఇదే

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. అనంతరం స్పాట్ వాల్యూయేషన్‌ను అధికారులు ప్రారంభించారు. ఏప్రిల్ 5వ తేదీన పూర్తయింది. తర్వాత ఫలితాలను ఇంటర్ బోర్డుకి ఏప్రిల్ 8వ తేదీన అందించింది. కానీ..ఫలితాల్లో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉండేందుకు అధికారులు మరోసారి సరి చూసుకోవడం జరుగుతోందని బోర్డు అధికారులు వెల్లడించారు. 

ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు జరిగాయి. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. 1300 పరీక్ష కేంద్రాల్లో 9,42,719 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. 
Read Also : జియో స్పెషల్ ఆఫర్ : IPL క్రికెట్ 4G డేటా ప్లాన్ ఇదే

Categories
Education and Job

డోంట్ మిస్ : ఏప్రిల్ 18న మోడల్ స్కూల్స్ ఎంట్రెన్స్ టెస్ట్

ఏప్రిల్ 18న తెలంగాణలోని మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం రాత పరీక్ష నిర్వహించనున్నట్టు మోడల్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ ఏ. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. అందుకు 18న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; 7 నుంచి 10వ తరగతుల వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

పరీక్ష రాయడానికి మొత్తం 1.10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 6వ తరగతి కోసం 55 వేల మంది విద్యార్థులు, మిగిలిన తరగతులన్నింటికీ కలిపి 55 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 10 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నాయి. పరీక్ష ముందు వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

పరీక్ష విధానం:
తెలుగు, ఇంగ్లీష్, మధ్యమాల్లో వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. వీటిలో వచ్చిన మార్కుల ప్రకారం ప్రవేశానికి అవకాశం కల్విస్తారు. అన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.