Categories
Business National

గుర్తు పెట్టుకోండి : ఏప్రిల్ 1 బ్యాంకులకు హాలీడే

సోమవారం (ఏప్రిల్ 1, 2019) బ్యాంకులు పని చేయవు. ఆ రోజు బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. మార్చి 31వ అంటే ఈ ఆదివారంతో ప్రస్తుత (2018–19) ఆర్థిక సంవత్సరం

సోమవారం (ఏప్రిల్ 1, 2019) బ్యాంకులు పని చేయవు. ఆ రోజు బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. సోమవారం (ఏప్రిల్ 1) వాణిజ్య, సహకార బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ తెలిపింది. మార్చి 31 అంటే ఈ ఆదివారంతో ప్రస్తుత (2018–19) ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో యాన్యువల్‌ క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ ఆదివారంతో ముగుస్తాయి.

ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆదివారం (మార్చి 31,2019) ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లకు అలాగే చెల్లింపుల లావాదేవీల నిర్వహణకు సంబంధిత ప్రత్యేక బ్యాంక్‌ బ్రాంచీలు పనిచేస్తాయి. పే అండ్‌ అకౌంట్‌ బ్యాంక్‌ బ్రాంచీలు అన్నీ మార్చి 31న పనిచేయాలని కేంద్రం సూచించినట్టు.. ఆర్బీఐ తెలిపింది. RTGS, NEFT వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ లావాదేవీ సమయాలు ఇందుకు అనుగుణంగా పొడిగించారు.
Read Also : Check It : ఏప్రిల్ 11న సెలవు

ఆర్ధిక సంవత్సరం (2018-19) ముగియనుండటంతో మార్చి 31న ఆదివారం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు తెరిచి ఉంటాయి. అదే విధంగా శనివారం (మార్చి 30న) కూడా పని చేయనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ 2 రోజులు బ్యాంకులు పని చేయనున్నాయి. బ్యాంకులతో పాటు ప్రభుత్వ రశీదు, పన్ను చెల్లింపు లావాదేవీలను సులభతరం చేసేందుకుగాను అన్ని చెల్లింపు, అకౌంట్‌ అఫీసులు తెరిచే ఉంచాలని ఆర్బీ ఆదేశాలిచ్చింది. దీంతో బ్యాంకులకు ఆదివారం సెలవును రద్దు చేసింది. మార్చి 30న(శనివారం) రాత్రి 8 గంటల వరకు, మార్చి 31న(ఆదివారం) సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి. అదే విధంగా ఎలక్ట్రానిక్ చెల్లింపులు నిర్దేశించిన కాలంలో జరుగుతాయి. 2019 ఏప్రిల్‌ 1న బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవు. ఏప్రిల్‌ 1న RTGS‌, NEFT లాంటి చెల్లింపు పద్దతులు కూడా పని చేయవని ఆర్బీఐ తెలిపింది.
Read Also : భారీగా డబ్బు ఇస్తాం: బీజేపీ ఆఫర్!