Categories
National

మే3 వరకు లాక్‌డౌన్, ఏప్రిల్ 20వ తేదీ తర్వాత సడలింపులు: మోడీ

ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3వ తదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని ప్రకటించారు ప్రధాని మోడీ.

ఈ లాక్‌డౌన్‌ వల్లే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చునని అన్నారు మోడీ. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సహనం వహించారని, భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అన్న స్ఫూర్తిని దేశప్రజలు చాటారని అన్నారు. దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదేనని మరో 19రోజులు పొడగింపు నిర్ణయానికి మద్దతు తెలపాలని అన్నారు. అయితే కరోనా హాట్ స్పాట్లు కాని ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ తర్వాత సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే కేసులు పెరగకపోతే మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Categories
Hyderabad

మరో సమరం : 20న స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మూడు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనుంది. 535 జడ్పీటీసీలు, 5 వేల 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం కోటి 56 లక్షల 11 వేల 320 మంది ఓటర్లున్నారు. ఇందుకు 32 వేల 007 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 18వ తేదీ గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వాహణపై చర్చిస్తున్నారు. 

– తొలి విడతలో 212 జడ్పీటీసీలు, 2 వేల 365 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.
– రెండో విడతలో 199 జడ్పీటీసీలు, 2 వేల 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.
– మూడో విడతలో 124 జడ్పీటీసీలు, 1, 343 ఎంపీటీసీలకు ఎన్నికలు. 
– ఏప్రిల్ 22వ తేదీన మొదటి విడత నోటిఫికేషన్‌..మే 6వ తేదీన పోలింగ్. 
– ఏప్రిల్ 26వ తేదీన రెండో విడత నోటిఫికేషన్. మే 10న పోలింగ్. 
– ఏప్రిల్ 30వ తేదీన మూడో విడత నోటిఫికేషన్. మే 14న మూడో పోలింగ్.