Categories
Business Technology

బిగ్ అనౌన్స్ మెంట్ : ఏప్రిల్ 2020 నుంచి మారుతి సుజుకీ డీజిల్ కార్లు రావు

ఇండియన్ ఆటోమోటీవ్ ఇండస్ట్ట్రీలో సరికొత్త సంచలనం. ఇటీవల కాలంలో ఆటో మొబైల్ పరిశ్రమలో ఇదొక బిగ్ అనౌన్స్ మెంట్. ప్రముఖ ఆటోమొబైల్ మేకర్ మారుతి సుజుకీ తమ డీజిల్ కార్ల సేల్స్ ను నిలిపివేయనుంది.

ఇండియన్ ఆటోమోటీవ్ ఇండస్ట్ట్రీలో సరికొత్త సంచలనం. ఇటీవల కాలంలో ఆటో మొబైల్ పరిశ్రమలో ఇదొక బిగ్ అనౌన్స్ మెంట్. ప్రముఖ ఆటోమొబైల్ మేకర్ మారుతి సుజుకీ తమ డీజిల్ కార్ల సేల్స్ ను నిలిపివేయనుంది. ఏప్రిల్ 1, 2020 నుంచి డీజిల్ మోడల్స్ మార్కెట్లో కనిపించవు. ఇటీవల జరిగిన మీడియా సదస్సులో మారుతి సుజుకీ చైర్మన్ ఆర్.సి. భార్గవ ప్రకటించారు.

BS-VI ఉద్గార నిబంధనల ప్రకారం 2020 నాటికి తమ డీజిల్ కార్లను నిలిపివేయనున్నట్టు 2018 నవంబర్ లోనే కంపెనీ వెల్లడించింది. మారుతీ డీజిల్ మోడల్స్ సేల్స్ నుంచి వార్షిక ఆదాయంలో 23శాతం వరకు కంపెనీ బెనిఫెట్స్ సాధిస్తోంది. కొన్నిరోజుల క్రితం మారుతి కార్ల తయారీ కంపెనీ BS-VI (1.5లీటర్లు) కంప్లయింట్ డీజిల్ ఇంజిన్ కారు Baleno మళ్లీ ప్రవేశపెట్టింది. 

అందుకే సేల్స్ నిలిపేస్తున్నాం :
కొత్త BS-VI అల్టో కారును కూడా అప్ డేట్ చేసింది. ఇప్పుడు మారుతి.. మరో బిగ్ అనౌన్స్ మెంట్ తో ముందుకొచ్చింది. BS-VI డెడ్ లైన్ కు ముందుగానే మారుతీ తమ డీజిల్ లైనప్ ఇంజిన్ కార్లను నిలిపి వేయనున్నట్టు ప్రకటించింది. భవిష్యత్తులో డీజిల్ కార్లకు డిమాండ్ వస్తే.. మళ్లీ బీఎస్-6 మోడల్స్ డీజిల్ కార్లను తిరిగి ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. బీఎస్-6 కంపైలెన్స్ డీజిల్ కార్ల ఇంజన్లను అప్ గ్రేడ్ చేయడం భారీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో మారుతీ కంపెనీ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

పెట్రోల్, CNG పవర్ ట్రైన్ మాత్రమే :
2020 ఏప్రిల్ నుంచి మారుతి డీజిల్ కార్ల లైనప్ ఇంజిన్లలో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు కనిపించవు. లైట్ కమర్షియల్ వెహికల్స్ పై కూడా మారుతీ ఇదే నిర్ణయం తీసుకుంది. మారుతీ కంపెనీలో పెట్రోల్ లేదా CNG పవర్ ట్రైన్ ఇంజిన్ కార్లు మాత్రమే సేల్స్ కొనసాగనుంది. BS-V నిబంధనలను వదిలేసి.. BS-VI నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వం 2016లో ప్రకటించింది. 

ఈ నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 1, 2020 నుంచి లేటెస్ట్ ఎమిసన్ నామ్స్ తోనే తయారీ విధానం జరగాలని ఆదేశించింది.  BS-VI వెహికల్స్ సేల్స్ ప్రారంభానికి మూడు నెలల ముందే వెహికల్స్ తయారీ జరగాల్సిందిగా ఆటోమొబైల్ సంస్థలకు కేంద్రం సూచించింది.

ఎయిర్ పొల్యుషన్ సమస్యలున్న BS-IV వెహికల్స్ ను ఏప్రిల్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా అమ్మడానికి అనుమతి ఉండదని అపెక్స్ కోర్టు సూచించింది. దేశీయ మార్కెట్ లో మారుతి సుజుకీ ఆర్థిక సంవత్సరం నాల్గో క్వార్టర్ (జనవరి నుంచి మార్చి 2019వరకు)లో మొత్తం అమ్మకం విలువ 4లక్షల 28వేల 863 యూనిట్లుగా నివేదించింది.