Categories
Latest Movies

కిలాడి పక్కన కపూర్ ఫిక్స్ అయింది!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. మిగతా హీరోలు ఏడాది ఒకటో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘Housefull 4, Good Newwz’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అక్షయ్.. సూర్యవంశీ, లక్ష్మీబాంబ్, పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, బెల్ బాటమ్’ వంటి సినిమాలు చేస్తున్నాడు.

Bell Bottom

రంజిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న‘బెల్ బాటమ్’ సినిమాలో కథానాయికగా పొడుగుకాళ్ల సుందరి వాణి కపూర్‌ని ఫిక్స్ చేశారు. అక్షయ్ లాంటి స్టార్ హీరోతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని వాణి తెలిపింది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బెల్ బాటమ్’ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వషూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read:నా చెల్లిని చంపుతామన్నా పట్టించుకోరా? ఇన్‌స్టాగ్రామ్‌పై సోనమ్ సీరియస్..

Categories
Movies

మరోసారి నటవిశ్వరూపం చూపించనున్న కంగనా

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘తేజస్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా.. ‘తేజస్’.. ఆర్ఎస్‌వీపీ ప్రొడక్షన్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మిస్తుండగా సర్వేశ్‌ మేవర దర్శకత్వం వహిస్తున్నారు. సోమవార ఈ చిత్రంలోని కంగన లుక్ రిలీజ్ చేశారు. ‘తేజస్’ సినిమాలో యుద్ధ విమానం నడిపే పైలెటగా ఆమె కనిపించనున్నారు.

ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా కనిపిస్తున్న కంగనా లుక్‌కు ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో వచ్చిన ‘యురి’ తర్వాత అదే నిర్మాత నుంచి వార్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న చిత్రం ఇది. ‘తేజస్’ వచ్చే ఏడాది ఏప్రిలో‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల నటించిన ‘పంగా’ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

మహిళా కబడ్డీ మాజీ ఛాంపియన్‌ జయా నిగమ్‌ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలోని కంగన నటకు మంచి మార్కులే పడినప్పటికీ మూవీ కమర్షియల్‌గా హిట్‌ సాధించలేకపోయింది. ప్రస్తుతం కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు‌. ఈ చిత్రం 2020 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read More>>ధనుష్ 40 – క్రేజ్ మామూలుగా లేదుగా!