Categories
Movies

ఏప్రిల్ 24న శర్వా ‘శ్రీకారం’..

శర్వానంద్, ప్రియాంక మోహన్ జంటగా.. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీకారం’ ఏప్రిల్ 22న విడుదల..

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న 29వ సినిమా ‘శ్రీకారం’. కిశోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ‘ఇతను మన కేశవుల కొడుకు… పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి’.. అంటూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. శర్వా రైతు పాత్రలో కనిపిస్తున్నాడు.

 

ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేది ప్రకటించారు. శర్వా మరికొందరితో కలిసి పడిపోయిన ఓ పెద్ద చెట్టుకి తాడు కట్టి లాగుతున్న పోస్టర్‌కి ‘పట్టరా పట్టు హైస్సా …ఎత్తరా ఎత్తు హైలెస్సా!! వస్తున్నాం రా హైస్సా.. ఏప్రిల్ 24 న హ్యేలెస్సా’ అనే క్యాప్షన్ ఇస్తూ ఏప్రిల్ 22న ‘శ్రీకారం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.

Image

 రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మిక్కీ జె. మేయర్, మాటలు : సాయిమాధవ్ బుర్రా, కెమెరా : జె. యువరాజ్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట, దర్శకత్వం : కిషోర్ బి.
 

Categories
Uncategorized

నో లీక్ : కాళేశ్వరం పనుల్లో గజ ఈతగాళ్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు, తాగు నీరందించాలనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గోదావరి నదిపై బ్యారేజీలతో పాటు టన్నెల్‌ నిర్మాణం వేగవంతమైంది. అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌లోని సర్జ్‌పూల్‌లో  ట్రయల్‌ రన్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి లీకేజీలు లేకుండా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అనుకున్న లక్ష్యానికి నీరందించాలని సీఎం ఆదేశాలతో అధికారులు పనుల్లో వేగం పెంచారు.

6వ ప్యాకేజీలో ఇంజనీరింగ్‌ అధికారులు వెట్‌ రన్‌ పనులు మొదలు పెట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు జీరోపాయింట్‌ నుంచి అప్రోచ్‌ కెనాల్ ద్వారా రెండు సొరంగ మార్గాలకు ఈ నెల17న అధికారులు నీటిని విడుదల చేశారు. తొలిసారి ప్రాజెక్టులోకి గోదావరి జలాలు రావడంతో పూజలు నిర్వహించి హారతి పట్టారు అధికారులు. 6వ ప్యాకేజీలో 0.2 టీఎంసీల నీటిని విడుదల చేసిన అధికారులు నీటి తరలింపుల ప్రక్రియలో లోపాలను గుర్తించే పనిలో పడ్డారు.

మొదటి దశలో 10శాతం…ఆ తరువాత 25 శాతం… మూడో దశలో 50శాతం వరకు నీటిని విడుదల చేయడంతో సర్జ్ పూల్‌లో 124.50 మీటర్ల వరకు నీటి మట్టం చేరుకుంది. ఆ తరువాత నీటి తరలింపును నిలిపి వేశారు. లీకేజీలను గుర్తించేందుకు విశాఖపట్నం, ఒడిశాల నుంచి 10 మంది గజ ఈత గాళ్ళను రంగంలోకి దింపారు. గంటల తరబడి గజ ఈతగాళ్లు నీటిలో ఈదుకుంటు లోపాలున్నయా ? అనేది చూశారు. చివరకు లోపాలు ఏమీలేవని వారు నిర్ధారించడంతో సర్జ్ పూల్ నుంచి మోటార్ల ద్వార నీటిని పంపింగ్ చేసెందుకు సిద్దమవుతున్నారు అధికారులు.

సొరంగాలు, సర్జ్ పూల్లో లోపాలు లేవని నిర్ధారించుకున్న ఇంజనీరింగ్ అధికారులు సర్జ్ పూల్‌ను వంద శాతం అంటే 142 మీటర్ల వరకు నింపడానికి ప్రయత్నిస్తున్నారు. సర్జ్ పూల్‌ను నింపడం ద్వారా నీటి మట్టం పెరుగుతుందని, దీని ద్వారా లీకెజీలు ఏమైన ఉంటే బయటపడే అశకాశముందనే కారణంతో మరోసారి ఎల్లంపల్లి జలాలను 6వ ప్యాకెజిలోకి విడుదల చేశారు. 6వ ప్యాకెజికి సంబందించి ఈ నెల 24 న మరోసారి వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ హాజరై…వెట్ రన్‌ను స్వయంగా పరిశీలించే అవకాశముందని యుద్దప్రాతిపాదికన అధికారులు, కాంట్రక్టు సంస్థల ప్రతినిధులు ఏర్పాట్లు  చేస్తున్నారు..