Categories
Movies

ఏప్రిల్ 28 నా జీవితంలో మర్చిపోలేని రోజు..

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఏప్రిల్ 28తో తనకుగల అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు..

ఏప్రిల్ 28.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. ఆయన దర్శకత్వంలో నటరత్న నందమూరి తారక రామారావు హీరోగా తెరకెక్కిన `అడవి రాముడు` 43 ఏళ్ల క్రితం ఏప్రిల్ 28న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే.. ఆయన సమర్ఫణలో రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి-2` మూడేళ్ల క్రితం అదే తేదీన విడుదలై ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాని మరోసారి చూపించింది. ఈ సందర్భంగా తన జ్ఞాపకాలను రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా `అడవిరాముడు` రికార్డుల రాముడిగా ఎలా మారాడో రాఘవేంద్రరావు కొన్ని ఉదాహరణలు పంచుకున్నారు. `అడవిరాముడు` సినిమా 4 సెంటర్లలో ఒక సంవత్సరంపాటు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమైనట్టు తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను తిరగరాసిన `బాహుబలి-2` చిత్రబృందానికి ధన్యవాదాలు తెలియజేశారు రాఘవేంద్రరావు.