Categories
Business Technology

ఏప్రిల్ 30 నుంచి సేల్ : ఒప్పో A9 వచ్చేసింది

ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.

ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఒప్పో A సిరీస్ స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ఏప్రిల్ 30 నుంచి ఒప్పో A9 మోడల్ ఫోన్లపై ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఒప్పో బ్రాండ్ నుంచి 4000mAh బ్యాటరీతో A1k స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇందులో 8ఎంపీ కెమెరాతో పాటు పీ22 ఎస్ఓసీ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ A9 ఫీచర్లు కూడా యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఒప్పో కూడా కొత్త A సిరీస్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
Also Read : చైనా చౌకబేరం : షియోమీ ఎలక్ట్రిక్ సైకిళ్లు విడుదల

6.53 అంగుళాల బెజిల్ లెస్ ఫుల్ HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిసిప్లే అందిస్తోంది. స్ర్కీన్ బాడీ రేషియో 90.7 శాతం ఎట్రాక్టీగా ఉంటుంది. దీని డిసిప్లేపై ఐదో జనరేషన్ కార్నింగ్ గొర్లిల్లా గ్లాస్ తో ప్రొటక్ట్ చేసేలా డిజైన్ చేశారు.

ఒప్పో ఎ9 సిరీస్ లో 4020mAh బ్యాటరీతో పాటు VOOC3.0 టెక్నాలజీ ఫాస్ట్ ఛార్జింగ్ (20W) దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. 2019 ఏడాది ప్రారంభంలో ఒప్పో GB RAM వెర్షన్ ఫోన్ ఒప్పో A7ను రిలీజ్ చేసింది. దీని ధర మార్కెట్లలో రూ.14వేల 990గా ఉంది. ఇండియాలో ఒప్పో A5 స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేయగా… దీని ధర రూ.9వేల 999గా ఉంది. 

స్పెషిఫికేషన్లు.. ఫీచర్లు ఇవే : 
* 6.53 అంగుళాల (బెజిల్ లెస్ ఫుల్ HD+) వాటర్ డ్రాప్ నాచ్ డిసిప్లే
* 16MP, 2MP లెన్స్ రియర్ కెమెరాలు
* 16-MP AI సెల్ఫీ కెమెరా (ఫ్రంట్ సైడ్)
* 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ 
* 256 వరకు ఎక్స్ పాండబుల్ మెమెరీ 
* 5వ జనరేషన్ కార్నింగ్ గొర్లిల్లా గ్లాస్
* 4020mAH బ్యాటరీ
* VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ (20W)
* కలర్ ఓఎస్ 6.0 ఆండ్రాయిడ్ పై
* అక్టా కోర్ హెలియో పీ70 చిప్ సెట్ (మీడియాటెక్)
* Mali-G72 MP3 GPU, గేమ్ బూస్ట్ 2.0
* పొర్టరైట్ మోడ్, కలర్ ఫుల్ మోడ్
* డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac
* బ్లూటూత్ v4.2, GPS