Categories
National

మోడీ మరో పిలుపు : ఏప్రిల్ 5న 9 గంటలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించండి

కరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో పిలుపునిచ్చారు. ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి..కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.

చీకటిలో దీపాల కాంతులలో కరోనా రాకాసిని ప్రారదోలాలని, ఇదే రామబాణం అని చెప్పారు. ఈ పోరాటాన్ని కొనసాగించాలని, యుద్ధంలో గెలవాలన్నారు. 130 మంది కోట్ల మంది అందరూ సంఘటితంగా ఉన్నామని చాటి చెప్పాలన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి కోరలు చాస్తోంది. భారతదేశాన్ని కూడా గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతకంటే ముందు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

మార్చి 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మరోసారి ప్రజలనుద్దేశించి మాట్లాడుతానని మోడీ చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు.

ప్రతొక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లేనని, జనతా కర్ఫ్యూ, లాక్ డైన్ ద్వారా ప్రజలు సహకరించారని తెలిపారు. పరిస్థితులు ఎదుర్కోవడంలో సంఘటితంగా ఉండాలన్నారు. భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

ప్రపంచదేశాలు భారతదేశం బాటలోనే పయనిస్తోందని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రారదోలేందుకు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. లాక్ డౌన్ మరింత కఠినంగా పాటించాలని, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు..లైట్లు బంద్ చేయాలని పిలుపునిచ్చారు.

కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్ లైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్స్ వెలిగించాలన్నారు. ఈ సంకట సమయంలో భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు ప్రధాని మోడీ. 

Also Read | ‘తబ్లిగీ’ తక్లీఫ్ : 9,000 మందికి క్వారంటైన్‌