Categories
International

ప్రపంచమంతా లాక్ డౌన్…వైరస్ వెలుగులోకి వచ్చిన వూహాన్ లో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత!

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(COVID-19) మొదటగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లో ఉన్న ఈ సమయంలో వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన హుబే ఫ్రావిన్స్ లో మాత్రం ట్రావెల్(ప్రయాణ)ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మంగళవారం(మార్చి-24,2020)చైనా ప్రకటించింది. ఆరోగ్యకరమైన నివాసితులు ఇవాళ అర్థరాత్రి నుంచి ప్రయాణాలు చేయవచ్చు అని చైనా అధికారులు తెలిపారు.

ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని ఆదేశించిన రెండు నెలల తర్వాత చైనా ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేస్తుంది. అయితే వైరస్ ప్రభావం అధికంగా ఉండిన వూహాన్ సిటీలో మాత్రం ఏప్రిల్-8వరకు ఆంక్షలు ఉంటాయని, ఇవాళ ప్రకటించిన రూల్స్ వూహాన్ కు ఏప్రిల్-8వరకు వర్తించవని చైనా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8నుంచి వూహాన్ ప్రజలు కూడా సిటీ దాటి,హుబే ఫ్రావిన్స్ దాటి ప్రయాణాలు చేయవచ్చని అధికారులు తెలిపారు. యూరప్.ఆసియా,మిడిల్ ఈస్ట్,నార్త్ అమెరికా,బ్రిటన్,న్యూజిల్యాండ్ దేశాలన్నీ వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే చైనాలోని కొత్త చోట్ల సినిమా థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. అయితే ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు.

మరోవైపు హుబే ఫ్రావిన్స్ లో కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చింది. అక్కడ పెద్దగా కొత్తగా కరోనా కేసులు నమోదవడం లేదు. అయితే కరోనా ప్రభావం చైనా కంటే ఇటలీపైనే ఎక్కువగా ఉంది. చైనా కంటే కరోనా మృతుల సంఖ్య ఇటలీలోనే ఎక్కువ. ఇటలీలో ఇప్పటివరకు 6వేల 100మందికి పైగా కరోనా సోకి మరణించారు. ఇక స్పెయిన్,ఇరాన్,అమెరికా,బ్రిటన్ లల్లో కూడా కూడా కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా,ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య దాదాపు 4లక్షలకు చేరువలో ఉంది. 17వేల 138మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 1లక్ష 3వేల మంది వరకు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కరోనా మృతుల్లో 98శాతం మంది 60ఏళ్లకు పైబడిన వృద్ధులే. 

ఇక భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటివరకు భారత్ లో కరోనా సోకినవాళ్ల సంఖ్య 500వరకు ఉంది. భారత్ లో 10కరోనా మరణాలు కూడా నమోదయ్యాయి. అయితే భారత కరోనా పేషెంట్లలో 99శాతం మంది విదేశాల నుంచి తిరిగివచ్చినవారే. భారత్ లో ఇప్పటివరకు..కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకడం)లేదు. భారత్ లో కూడా దాదాపు అన్నీ రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్ లో ఉన్నాయి.
 

See Also | భారతదేశంలో కొవిడ్-19 ఎంత వేగంగా వ్యాపించగలదు? ప్రభుత్వం చెప్పిన గణాంకాలు!