Categories
Movies

రామ్ ‘రెడ్’ పడేది పక్కా ఆరోజే..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న మాస్ థ్రిల్లర్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న థ్రిల్లర్.. ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్, ఆదిత్యగా రామ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, నువ్వే నువ్వే సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా పలు సినిమా షూటింగులు, రిలీజులు వాయిదా పడుతున్న నేపథ్యంలో ‘రెడ్’ చిత్రం విడుదలపై కూడా సందేహాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా ఎట్టిపరిస్థితిలోనూ ముందు చెప్పిన డేట్ ప్రకారం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9నే ‘రెడ్’ ప్రేక్షకులముందుకు వస్తుంది అని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

Read Also : ఎకరంన్నర ఉంది.. మొత్తం మేకప్ చేయాలా అన్నాడు.. పొట్టి నా.. కొడుకు.. నాగార్జున గారికి చెప్పొద్దని బ్రతిమాలాడాడు..