Categories
Movies

ఏప్రిల్ ఫూల్ జోక్ అంట : వెటకారాలకు మేమే దొరికామా వర్మ

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ ఓ వైపు.. మరో వైపు మీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై రాద్దాంతం.. చంద్రబాబు – జగన్ – పవన్ కల్యాణ్ పోటాపోటీగా ప్రచారంలో విమర్శలు, ఆరోపణల పర్వం. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడారో అనే ఉత్కంఠతో ఉన్న నెటిజన్లకు మీ నుంచి వచ్చిన ట్విట్.. సంచలనం అయ్యింది. ఏం చెప్పబోతున్నాడు.. పవన్ కల్యాణ్ పై ఎలా పోటీ చేస్తాడు.. ఏం పర్మీషన్ వచ్చింది అనే చర్చ హాట్ గా సాగుతున్న క్రమంలో.. మీ ఇచ్చిన సమాధానం ఉందే.. ఎక్కడో కాలినట్లు ఉంది నెటిజన్లకు.

మార్చి 28తేదీ నామినేషన్ల ఉపసంహరణ.. మీరేమో పవన్ కల్యాణ్ పై పోటీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు.. ఏమైనా జరగొచ్చని అందరూ అనుకుంటుంటే.. ఇలా ఎలా ఫూల్స్ చేస్తారు వర్మ గారు.. ఏప్రిల్ ఒకటికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది.. ఇంత అడ్వాన్స్ గా మీరు ఫూల్ జోక్ పేలుస్తారని తెలియని మీడియా మొత్తం మిమ్మల్ని ఆకాశానికెత్తింది. అంతలోనే ఫూల్స్ ను చేస్తారా వర్మగారు.. ఇంత సీరియస్ మేటర్ లో వెటకారాలకు మేమే దొరికామా వర్మగారు అంటున్నారు నెటిజన్లు.

మేం మాత్రం చేయలేమా వర్మగారు అంటున్నారు.. మీ గురించి ఏదేదో రాసి.. ఏప్రిల్ ఫూల్ జోక్ అంటే మీకు తిక్కతిక్కగా ఉండదా అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి సమయంలో ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వర్మపై. నాన్న పులి కథ తెలుసుకదా.. మరోసారి ఇలాంటి పోస్టు నిజంగానే మీరు పెట్టినా.. నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకోరా అని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.

ఏమైనా నెటిజన్లు మొదటగా ఫూల్స్ చేసిన వర్మగారికి.. ఏప్రిల్ ఫస్ట్ విషెస్…