Categories
Andhrapradesh

గుంటూరు జిల్లాలో డిపోల నుంచి కదలని ఆర్టీసీ బస్సులు

గుంటూరు జిల్లాలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు కదలడం లేదు. చిలకలూరిపేట నుంచి మాచర్ల మినహా మిగిలిన డిపోల బస్సులు రద్దు చేశారు. గుంటూరు కంటైన్మెంట్ జోన్ లో ఉండటంతో బస్సులు నడిపేందుకు అనుమతి లభించలేదు. దీంతో గుంటూరు బస్టాండు ఖాళీగా ఉంది. చిలుకలూరిపేట, మాచర్ల సర్వీసులు నడుస్తున్నా ప్రయాణికులు మాత్రం బస్సు ఎక్కేందుకు ముందుకు రావడం లేదు. 

గుంటూరు జిల్లాలో అధికారులు తొలుత 99 బస్సులతో మిగతా డిపోలకు ప్రయాణం చేయాలని భావించారు. అయితే గుంటూరు మొత్తం కంటైన్ మెంట్ ఏరియాలో ఉండటంతో బస్సులు నడపడాన్ని అధికారులు అర్ధరాత్రి నుంచి విరమించే పరిస్థితి కనిపిస్తోంది. బాపట్ల, రేపల్లిలో గ్రీన్ జోన్లు ఉన్నా అక్కడ కూడా  కొన్ని బస్సులు వెళ్లని పరిస్థితి కనిపిస్తోంది. 

చిలకలూరిపేట నుంచి మాచర్ల వరకు వెళ్లేందుకు బస్సులు కదులుతున్న పరిస్థితి ఉంది. అయితే గుంటూరు మొత్తం కంటైన్ మెంట్ ఏరియాలో ఉండటంతో ఇక్కడి నుంచి బస్సులను కదిలించేందుకు ససేమిరా అంటున్నారు. నడిపేందుకు 99 బస్సులను తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కంటైన్ మెంట్ జోన్ ఎక్కువగా ఉండటం, నర్సరావుపేట, గుంటూరు నగరంలో కేసులు ఎక్కువగా ఉండటంతో అధికారుల నుంచి అనుమతి రాలేదు. దీంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. 

కేవలం జిల్లాలో ఉన్నటువంటి 13 డిపోలలోని 12 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. చిలకలూరిపేట నుంచి మాచర్ల వరకు మాత్రమే బస్సులు నడుపుతున్నారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు రిజిస్టర్ చేసుకోవడంతో వెసులుబాటు లేకపోవడంతో వారికి కూడా బస్సులు నడపడం లేదు. కేవలం 4 నుంచి 5 మంది ప్రయాణికులు ఉండటంతో అధికారులు కూడా బస్సులు నడిపేందుకు సుముఖత చూపడం లేదు. జిల్లా మొత్తం ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చారు.

Read: శుభవార్త: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం