Categories
National

ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం…బలమైన గాలులు వీచే అవకాశం

ఢిల్లీలో మళ్లీ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ, కొందరు చేసిన పిచ్చిపనుల కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. ఆదివారం(ఏప్రిల్-12)జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ఒక గీత పెరిగి “మితమైన(మోడరేట్)”కేటగిరీలో నిలిచింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం….PM 2.5 అని పిలువబడే గాలిలోని చిన్న కణాలు 56 వద్ద నిలవగా, PM 10, 104 వద్ద “మోడరేట్” పరిధిలో ఉంది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(CPCB)డేటా ప్రకారం… ఢిల్లీ టెక్నొలాజికల్ యూనివర్శిటీ వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)108గా ఉంది. ముందాకలో 131గా ఉండగా,ద్వారకాలో 96,ITOలో 80,జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 92వద్ద ఉంది.

ఢిల్లీలో గత వారం,ఎయిర్ క్వాలిటీ “గుడ్”కేటగిరీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా చీకట్లను జయించేందుకు ఏప్రిల్-5న దేశప్రజలందరూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మూర్ఖులు దీపాలు వెలిగించడానికి బదులుగా క్రాకర్స్ కాల్చారు. టపాసులు పేల్చారు.

దీంతో తగ్గిన ఎయిర్ పొల్యూషన్ కాస్తా మళ్లీ పెరగడానికి కారణమైంది. ఒక్క ఢిల్లీనే కాకుండా,దేశంలోని చాలా ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు దీపాలు వెలిగించేందుకు బదులుగా బాణసంచా పేల్చి వికృత చేష్టలకు పాల్పడ్డారు.

ఇక ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్(IMD)అంచనావేసింది. మరోవైపు దేశ ఆర్థికరాజధాని ముంబైలో82, పూణేలో65,అహ్మదాబాద్ లో 98 వద్ద AQI “సంతృప్తికర”కేటగిరీలో ఉంది. 

Categories
National Weather

ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం..నేటితో ముగియనున్న సరి-బేసి విధానం

దేశ రాజధాని ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడోరోజు వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపిన ప్రకారం  ఢిల్లీలో ఇవాళ(నవంబర్-15,2019)ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)లెవల్ దాదాపు 500 మార్క్ కు చేరుకుంది. ఇప్పటికే ఢిల్లీలో హెల్త్ ఎమర్జన్సీ కొనసాగుతున్నప్పటికీ సరి-బేసి విధానాన్ని పొడిగించే విషయంలో కేజ్రీవాల్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ 4నుంచి ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. నేటితో ఢిల్లీలో సరి-బేసి విధానం ముగుస్తుంది. 

మరోవైపు ఈ రోజు నుండి బలమైన గాలులు వస్తాయని భారత వాతావరణశాఖ విభాగం అంచనా వేసింది, ఇది వాయు కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. నవంబర్ 16 (శనివారం) నాటికి గాలి నాణ్యత పరిస్థితి స్వల్పంగా మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రమాదకర గాలి నాణ్యతను దృష్ట్యా పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (EPCA) పాఠశాలలను మూసివేయాలని సిఫారసు చేసింది. 

ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారాలను కనుగొనడానికి హైడ్రోజన్ ఆధారిత ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

Categories
National Weather

ఢిల్లీలో దుమ్ము తుఫాన్

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మారిపోయింది.గాలి కాలుష్యం మరోసారి ఢిల్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.బుధవారం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.వాయువ్య భారతంలో దుమ్ము తుఫాన్ కారణంగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మరింత దారుణంగా ఉండే అవకాశముందని కేంద్రప్రభుత్వ ఆధ్వరంలోని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్(SAFAR)తెలిపింది.SAFAR ప్రకారం.. బుధవారం ఢిల్లీలో అత్యంత తక్కువ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 341 దగ్గర ఉంది.గాలి అంతా ధుమ్మూ ధూళితో నిండిపోవడంతో పలువురు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారు.ఇంటి నుంచి బయటకు రాకుండా పలువురు ఇళ్లల్లోనే ఉంటున్నారు.

0 నుంచి 50మధ్యలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ఉంటే దానిని గుడ్ గా పరిగణిస్తారు.51నుంచి 100మధ్యలో ఉంటే సంతృప్తికరంగా,101 నుంచి 200 మధ్యలో ఉంటే ఓ మోస్తారుగా,201 నుంచి 300మధ్యలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటే దానిని వెరీ పూర్ గా పరిగణిస్తారు.401నుంచి 500మధ్యలో ఉంటే తీవ్రమైనదిగా పరిగణిస్తారు.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీలోAQI 339 దగ్గర రికార్డ్ అయింది.

గురువారం(మే-9,2019)రాత్రి నుంచి గుజరాత్,ఢిల్లీ,హర్యానా,రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ విరుచుకుపడే అవకాశముందని SAFAR సైంటిస్ట్ ఒకరు తెలిపారు.శుక్రవారం వరకు పరిస్థితి దారుణంగానే ఉంటుందని ఆయన తెలిపారు.