Categories
Movies

రజనీ ఇంటిముందు ‘దర్బార్’ డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన – అడ్డుకున్న పోలీసులు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రంతో నష్టపోయిన పంపిణీదారులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు..

ఏదైనా ఓ సినిమా బాగుంది అంటే నిర్మాతకు లాభాలు, హీరోతో పాటు దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరొస్తుంది. ఇంచుమించు పంపిణీదారులదీ ఇదే పరిస్థితి. ఒకోసారి బయ్యర్స్ భారీ లాభాలు చవిచూస్తారు. నష్టాలూ భరిస్తారు. భారీ అంచనాల మధ్య కొన్న పెద్ద హీరో సినిమా ఫ్లాప్ అయితే మొట్టమొదటిగా రోడ్డు మీదకి వచ్చేది వాళ్లే.
ఇప్పుడు ఓ పెద్ద సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లు వసూలు చేసందని నిర్మాత చెప్పారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలతో రోడ్డెక్కారు. ‘దర్బార్’ చిత్రంతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్‌ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కలవకుండా వారిని అడ్డుకోవడంతో నిరాహార దీక్ష చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

గతంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ ‘బాబా’ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో రజనీ కొంతమేర వారిని ఆదుకున్నాడు. ఇంతకుముందు రజనీ ‘లింగ’ సినిమాకు కూడా బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఇప్పుడు ‘దర్బార్’ విషయంలో రజనీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సినిమాకు ఆయన రూ.108 కోట్లు పారితోషికం తీసుకున్నారని సమాచారం.
 

Categories
Movies

దర్బార్ మూవీ రివ్యూ

దర్బార్ ఫక్త్ రజనీకాంత్ సినిమా. కబాలీ, కాలా సినిమాలు డైరక్టర్ సినిమాలు. అభిమానుల్నీ తన మార్కెట్ నీ డిస్ట్రబ్ చేస్తున్నాననుకున్న రజనీ మళ్లీ పాత రూటుకే వెళ్లాలనుకున్నాడు. పేట ఓ మేరకు యుటర్న్ కు ఉపయోగపడితే … దర్బార్ పూర్తి స్థాయిలో రజనీని ఆవిష్కరించింది.కథ విషయంలో మురుగదాస్ కు చెప్పగలిగిన మాట ఒక్కటే పాత రజీనిని చూపిస్తా అంటే పాత కథతో కాదని ఆయన అర్ధం చేసుకుంటే చాలు.

డైరక్టర్ మురుగదాస్ కూడా కథను పూర్తిగా రజనీ ఇమేజ్ చుట్టూనే రాసుకుంటూ వెళ్లాడు. ఓ వేరియేషన్ కోసం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రజనీతో కాఖీ డ్రస్ వేయించాడు. ముంబై డాన్స్ ప్రాభవంతో పెరిగిపోయిన డ్రగ్ అండ్ గన్ కల్చర్ కు చరమగీతం పాడడం కోసం, ఆదిత్య అరుణా చలం అనే ఓ సూపర్ పోలీస్ ను ముంబై పోలీస్ కమిషనర్ గా పంపిస్తారు. ఆయన పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో సహా ముంబైలో దిగుతాడు.

దిగ్గానే డ్రగ్ మాఫీయా మీద దృష్టి సారిస్తాడు. ఆ క్రమంలో ప్రధాన విలన్ కొడుకు దొరికిపోతాడు.అతన్ని ఆ కేసులోంచీ తప్పించడానికి చేసిన ప్రయత్నం కూడా కమిషనర్ కు తెల్సిపోతుంది. ఆ సందర్భంగా విలన్ కొడుకును కమిషనర్ చంపేస్తాడు. తన కొడుకును చంపిన వాడి మీద పగ తీర్చుకోడానికి విలన్ ఇండియా వస్తాడు. వచ్చీ రాగానే కమిషనర్ కూతురును చంపేస్తాడు. అక్కడ నుంచీ కమిషనర్ పర్సనల్ రివేంజ్ ప్లస్ డిపార్ట్ మెంట్ కు తానిచ్చిన హామీ ఏదీ సగంలో వదిలేయను పూర్తి చేసే వస్తాను అనే మాటను కూడా నిలబెట్టుకోవడమే సినిమా.

క్లుప్తంగా ఇది ఒక రివేంజ్ డ్రామా. ఇరవై ఏళ్ల క్రితం ముంబైలో ఓ డాన్ చేతుల్లో చనిపోయిన పోలీసు అధికారుల చావుకు రివేంజ్ తీర్చుకోడానికి వచ్చిన హీరో విలన్ కొడుకును చంపేస్తాడు. కొడుకును చావుకు రివేంజ్ గా విలన్ హీరో కూతుర్ని చంపేస్తాడు. తన కూతురు చావుతో పాటు ఒరిజినల్ రివేంజ్ తీర్చుకోడానికి హీరో విలన్ ను చంపేస్తాడు.ఈ చావుల క్రమాన్ని ఇంట్రస్టింగ్ గా నడపడానికి స్క్రీన్ ప్లే రైటర్ కమ్ డైరక్టర్ మురుగదాస్ కొంచెం పెద్ద కసరత్తే చేశారు. ఓ చిన్న లవ్ ట్రాక్ పెట్టాడు. దాన్ని కూడా అత్యంత గౌరవప్రదంగానే నడిపాడు. యాక్షన్ , ఎమోషన్స్ తో పాటు కామెడీ బాధ్యత కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు రజనీకాంత్.

దర్బార్ మూవీలో రజనీకాంత్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు . నిజానికి తను మొహమాటపడుతున్నాడుగానీ … ఈ సారి మరీ పెళ్లీడుకొచ్చిన కూతురున్న కారక్టర్ కాదు యంగ్ హీరోగానే చేసేయొచ్చు అనే హోప్ ఇచ్చాడు. ఫెర్మామెన్స్ పరంగా నివేదా ధామస్ రజనీ కూతురు పాత్రలో చాలా బాగా నటించింది. ముఖ్యంగా తండ్రి కోమాలో ఉండి … తను చావుకు దగ్గరవుతున్నాననే విషయం తెల్సినప్పుడు ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లో నివేద చాలా బాగా పెర్ఫామ్ చేసింది. విలన్ గా సునీల్ షెట్టి చాలా బాగా యాక్ట్ చేశాడు. అయితే ఆ పాత్రకున్న పరిధి చాలా తక్కువ. అందులోనే తను నటించే సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండాలనే తపనతో నటించిన విషయం ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. నయనతార కేవలం గ్లామర్ కోసమే ఉంది. ఆ బాధ్యత బాగా నిర్వర్తించింది.

సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ చాలా బావుంది. సూపర్ స్టార్ ను చాలా అందంగా చూపించారు. టెక్నీషియన్స్ లో మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ద్ కూడా సూపర్ స్టార్ కోసం మాస్ బీట్ బాగా మోగించాడు. ముఖ్యంగా దుమ్ము ధూళి పాట బాలుతో పాడించడం చాలా బాగుంది. బాల సుబ్రహ్మణ్యం కూడా రజనీని మించిన ఎనర్జీతో పాడి అదరగొట్టాడు. అనిరుద్ద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది.

డైలాగ్స్ అనువాదం విషయంలో మరికొంత శ్రద్ద తీసుకుంటే బాగుండేది. శ్రీ రామకృష్ణ లాంటి చేయి తిరిగిన డబ్బింగ్ రైటర్ నుంచీ ఎక్స్ పెక్ట్ చేయలేని స్థాయిలో భాష ఉంది. పాటల అనువాదం విషయంలో కూడా ఇదే తప్పు దొర్లిపోయింది. ఈ ఒక్క విషయం తప్ప మిగిలిన వ్యవహారమంతా దర్శకుడు మురుగదాస్ బాగానే చక్కబెట్టారు. నిజానికి రజనీ కోసం తన పద్దతిని పూర్తిగా మార్చుకుని చేసిన సినిమా దర్బార్. టైటిల్ సెలక్షన్ కూడా చాలా యాప్ట్ గా అనిపించింది.

దర్బార్ లో రాజుగారు చెప్తారు ప్రజలు వింటారు. మంత్రులు తదితర పెద్దలు ఉంటారుగానీ వారు కూడా రాజుగారు చెప్పిందే వింటారు. అలా ఇది రజనీకాంత్ దర్బార్ డిజైన్డ్ బై మురుగదాస్ అని చెప్పుకోవాలి. దుమ్ము రేపింది అనేది హిట్టు సినిమాల విషయంలో చాలా కాలంగా వాడుతూన్న పదమే. కనుక బాక్సాఫీసు దగ్గర దర్బార్ ఏ మేరకు దుమ్మురేపుతుందో చూడాలి. లైకా రిలయన్స్ భాగస్వామ్యంలో రూపొందిన దర్బార్ లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బావున్నాయి .. అందుకు నిర్మాత సుభాస్కరన్ ను అభినందించాలి. ఓవరాల్ గా రజనీకాంత్ మరో సారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల కోసం అలాగే తన సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కోసం చాలా కష్టపడి ఈ సినిమా చేశారనేది మాత్రం వాస్తవం.

ప్లస్ పాయింట్స్ :
రజనీకాంత్ నటన, ఎనర్జీ లెవెల్స్
నివేదాథామస్, సునిల్ శెట్టి పెర్ఫామెన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్
కథ
సెకండ్ హాఫ్
రొటీన్ క్లైమాక్స్
విలన్ క్యారెక్టరైజేషన్

Categories
Movies

ఎన్టీఆర్‌తో సినిమా: డైరెక్టర్ మురుగదాస్ క్లారిటీ

తమిళ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఉన్న మురుగుదాస్ ప్రస్తుతం ‘దర్బార్’ సినిమా రజినీకాంత్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. లేటెస్ట్‌గా ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మురుగదాస్.

మురుగదాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా తీసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన కథను కూడా ఎన్టీఆర్‌కు చెప్పాడు. అయితే ఈ సినిమా పట్టలేక్కలేదు. ఈ సినిమా ఉంటుదని మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో  పలు ఆసక్తికర విషయాలతో పాటు తెలుగు‌లో చేయబోయే ప్రాజెక్ట్‌లపై స్పందించాడు.

ఎన్టీఆర్‌ను చాలా నెలల క్రితం ఒక కథతో కలిసిన మాట నిజమే. ఈ కథకు తారక్ ఓకే చెప్పినా.. ఇంకా సబ్జెక్ట్ మెటీరిలైజ్ కాలేదు. దాంతో ఆ సినిమా ఒద్దని అకున్నాం. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్‌తో సినిమా లేకపోయినా.. భవిష్యత్తులో మంచి కథతో ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు మురుగుదాస్. మురుగదాస్ తెలుగులో చిరంజీవితో ‘స్టాలిన్’, మహేష్ బాబు‌తో ‘స్పైడర్’ సినిమాలను తీశాడు.

Categories
Movies

బీ రెడీ తలైవా ఫ్యాన్స్‌ : దర్బార్ ట్రైలర్ వచ్చేస్తోంది. 

తలైవ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు శుభవార్త వినిపించింది. దర్బార్ చిత్ర యూనిట్. 2019, డిసెంబర్ 16 సోమవారం సాయంత్రం 6.30 ని.లకు చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నట్లు దర్శకుడు మురుగుదాస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉండమని అభిమానులతో చెప్పారాయన. ఈ వార్త విన్న రజనీకాంత్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. తమ అభిమాన నటుడి ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్‌ ద్వారా సినిమా అంచనాలు మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. 

ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా..తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి రజనీకాంత్ జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన ట్రైలర్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఆ రోజు ఎలాంటి ట్రైలర్ విడుదల కాకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సినిమాలో నివేదా థామస్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య తదితరులు నటించారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించారు. 

Read More : ఇక సెలవు : గొల్లపూడి అంత్యక్రియలు పూర్తి

* తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. 
* అనిరుద్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ చెన్నైలో జ‌రిగింది.
* సస్పెన్స్‌తోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందిందని రజనీ వెల్లడించారు. 
* ‘ద‌ర్బార్‌’ తో న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌నని తెలిపారు రజనీకాంత్.

Categories
Movies

రజినీ ‘దర్బార్’ : దీపావళి శుభాకాంక్షలు

దీపావళి సందర్భంగా ’సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా నటిస్తున్న ‘దర్బార్’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

‘సౌత్ ఇండియన్ సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా, ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘దర్బార్’. రీసెంట్‌గా ‘దర్బార్’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు.. దాదాపు 25 ఏళ్ళ తర్వాత రజినీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రెండు వైవిధ్య భరితమైన కోణాల్లో ఆయన క్యారెక్టర్ సాగుతుందట.

రజినీ ఇమేజ్‌కి తగిన కథా కథనాలతో మురుగదాస్ ‘దర్బార్’ తెరకెక్కించారని కోలీవుడ్ మీడియా సమాచారం. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది ‘దర్బార్’ టీమ్.. రజినీ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, 25 ఏళ్ళ తర్వాత  రజీని సినిమాకి  పనిచెయ్యడం విశేషం.

బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్‌గా నటించగా.. మరో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్ర చేశారు. నివేదా థామస్ రజినీ కూతురుగా కనిపించనుంది. తంబి రామయ్య, శ్రీమాన్, యోగిబాబు తదితరులు నటించిన ‘దర్బార్’ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్, నిర్మాత : సుబాస్కరన్.
 

Categories
Movies

రజినీ ‘దర్బార్’ : గుమ్మడికాయ కొట్టేశారు!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా, ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ షూటింగ్‌ పూర్తి..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా, ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘దర్బార్’. రీసెంట్‌గా ‘దర్బార్’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు.. దాదాపు 25 ఏళ్ళ తర్వాత రజినీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. రెండు కోణాల్లో ఆయన క్యారెక్టర్ సాగుతుందట.

రజినీ ఇమేజ్‌కి తగిన కథా కథనాలతో మురుగదాస్ ‘దర్బార్’ తెరకెక్కించారని కోలీవుడ్ మీడియా సమాచారం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, 25 ఏళ్ళ తర్వాత  రజీని సినిమాకి  పనిచెయ్యడం విశేషం. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్‌గా నటించగా.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్ర చేశారు.

Read Also : మమ్ముట్టి ‘మామాంగం’ – టీజర్ (తెలుగు) : ‘చరిత్రలో అలాంటి యోధుడు లేడు.. ఇక రాడు’..

నివేదా థామస్ రజినీ కూతురుగా కనిపించనుంది. తంబి రామయ్య, శ్రీమాన్, యోగిబాబు తదితరులు నటించిన ‘దర్బార్’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్, నిర్మాత : సుబాస్కరన్.

 

Categories
Movies

దర్బార్ – ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

ముంబాయిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న దర్బార్, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా, టాప్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ షూటింగ్ ముంబాయిలో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్‌గా, నివేదా థామస్ రజినీ కూతురిగా కనిపించనున్నారు.  మురగదాస్ ఈ సినిమాలో రజినీని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా చూపించబోతున్నాడని కోలీవుడ్ టాక్..

ఈ సినిమా లొకేషన్ నుండి లీకైన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబాయిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న దర్బార్, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. మే 29 నుండి దర్బార్ రెండవ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్, మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న దర్బార్ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్.

 

Categories
Movies

దర్బార్ యూనిట్‌పై ‌దాడి : రాళ్ళు విసిరిన విద్యార్థులు

ప్రస్తుతం బాంబేలోని ఓ కాలేజ్‌లో దర్బార్ షూటింగ్ జరుగుతుంది.. అక్కడ మూవీ యూనిట్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కి మధ్య గొడవ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..

సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న దర్బార్ షూటింగ్ ముంబాయిలో జరుగుతుంది. తలైవా పక్కన నయనతార తొలిసారి పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా థామస్ రజినీ కూతురుగా కనిపించనుంది. దర్బార్ షూటింగ్ స్పాట్‌‌లో తీసిన కొన్ని పిక్స్ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాంబేలోని ఓ కాలేజ్‌లో దర్బార్ షూటింగ్ జరుగుతుంది. అక్కడ మూవీ యూనిట్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కి మధ్య గొడవ జరిగిందని, స్టూడెంట్స్ దర్బార్ టీమ్‌పై రాళ్ళతో దాడి చేసారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాలేజ్‌లో షూటింగ్ కావడంతో, షూటింగ్ చూసేందుకు స్టూడెంట్స్ ఎగబడ్డారనీ, వారిని కొంచెం దూరంగా ఉండమని మూవీ యూనిట్ చెప్పడంతో, స్టూడెంట్స్ వారితో వాదనకుదిగి, రాళ్ళతో దాడి చెయ్యగా, దర్శకుడు మురగదాస్ కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చెయ్యడంతోపాటు, లొకేషన్ మార్చాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి దర్బార్ టీమ్ నుండి అఫీషియల్‌గా ఎటువంటి ప్రకటన రాలేదు. 2020 సంక్రాంతికి దర్బార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Categories
Movies

బ్యాట్ పట్టి.. సిక్స్‌లు బాదేస్తున్న సూపర్ స్టార్

షాట్ గ్యాప్‌లో కాస్త ఖాళీ టైమ్ దొరకడంతో యూనిట్ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ ఆడాడు రజినీ..

సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న దర్బార్ షూటింగ్ ముంబాయిలో జరుగుతుంది. తలైవా పక్కన నయనతార తొలిసారి పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా థామస్ రజినీ కూతురుగా కనిపించనుంది. దర్బార్ షూటింగ్ స్పాట్‌‌లో తీసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా దర్బార్ నుండి మరికొన్ని పిక్స్ బయటకొచ్చాయి. రజినీకాంత్ బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అది సినిమా కోసం కాదు..

షాట్ గ్యాప్‌లో కాస్త ఖాళీ టైమ్ దొరకడంతో యూనిట్ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ ఆడాడు రజినీ.. పిక్స్‌‌లో ఆయనతో పాటు, నయనతార, యోగిబాబు కూడా ఉన్నారు. రజినీ బ్యాటింగ్ చేస్తున్న ఫోటోస్ చూసిన ఫ్యాన్స్.. ఇది తలైవా ఐపీఎల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దర్బార్ 2020 పొంగల్ రిలీజ్‌కి రెడీ అవుతుంది.  

Categories
Movies

రజినీ కూతురిగా నివేదా థామస్

సెంట్‌గా మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ దర్బార్ సెట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమాలో నివేదా రజినీ కూతురుగా కనిపించనుంది.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా,  టాప్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘దర్బార్’. ఈ మూవీ షూటింగ్ గతకొద్ది రోజులుగా ముంబాయిలో జరుగుతుంది. ఇటీవలే నయనతార షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. రీసెంట్‌గా మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ కూడా దర్బార్ సెట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమాలో నివేదా రజినీ కూతురుగా కనిపించనుంది. ఇంతకుముందు పాపనాశనం సినిమాలో కమల్ హాసన్ కూతురిగా నటించింది నివేదా..

ఆమెతో పాటు కమెడియన్ యోగిబాబు కూడా షూట్‌లో జాయిన్ అయ్యాడు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత రజినీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండడం, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, రజీని సినిమాకి 25 ఏళ్ళ తర్వాత కలిసి పనిచెయ్యడం విశేషం. 2020 సంక్రాంతికి దర్బార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకి ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్.