Categories
National

DMK నేత మురుగన్ నివాసంలో ఐటీ సోదాలు

తమిళనాడులో డీఎంకే నేతల్లో ఐటీ దాడులు వణుకుపుట్టిస్తున్నాయి. డీఎంకే నాయకులే టార్గెట్‌గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకే సీనియర్ నేత మురుగన్ నివాసంలో ఐటీ ఆఫీసర్స్ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. లోక్ సభ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగుతున్న సందర్భంలో ఐటీ దాడులు జరగడాన్ని డీఎంకే నేతలు ఖండిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దాడులు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు.

వేలూరుకు చెందిన మురుగన్ డీఎంకే సీనియర్ నేత. డీఎంకే పార్టీకి కోశాధికారిగా ఉంటున్నారు. ఈయనకు ప్రముఖ పేరొందిన కింగ్ స్టన్ కాలేజీ ఉంది. మార్చి 30వ తేదీ శనివారం తెల్లవారుజామున ఆరుగురు ఐటీ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో సోదాలు, తనిఖీలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు మురుగన్ నివాసానికి వచ్చారు. ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాడుల విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.