Categories
Business

ఫ్యాషన్ రాజధానిలో పాగా వేసిన అరకు కాఫీ 

విశాఖ మన్యంలో పండిన  కాఫీ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో పాగా వేసింది.  భారత ప్రజల మనసు దోచుకున్న కాఫీ పారిస్ ప్రజల మనసూ దోచుకుంది.  ఎంతలా అంటే అరకు కాఫీ తాగనిదే రోజు గడవనంతగా…  కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి వేగించి పొడి చేసి కాఫీ తయారీకి ఉపయోగిస్తారు.

కాఫీ గింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా మరియు ఆఫ్రికాదేశాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేయించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి.మనదేశంలో కాఫీ పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంకోసం పోటీపడుతోంది. 
south india cofee

అరకు కాఫీ 
సహజ సిద్ధంగా కుళ్లిన ఆకులు వేసి పెంచిన ఆర్గానిక్‌ అరకు కాఫీ విదేశాల్లోనూ దూసుకెళ్తోంది. విశాఖ మన్యంలో సాగవుతున్న అరబికా రకం కాఫీ పారిస్‌లో ఇప్పటికే పాగా వేసింది. జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాల్లోనూ విక్రయాలు పెరిగి అక్కడి కాఫీ ప్రియులకూ మన కాఫీ నోరూరిస్తూ సత్తా చాటుతోంది. ఫ్యాషన్‌ ప్రపంచ రాజధాని పారిస్‌లోనూ అరకు కాఫీ బ్రాండ్‌తో 2017, ఫిబ్రవరిలోనే కాఫీ షాప్‌ వెలిసింది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని అక్కడ ఏర్పాటు చేసింది.  కాఫీ సాగు విస్తరణలో మనదేశంలో తమిళనాడును వెనక్కినెట్టి కర్ణాటక తర్వాత రెండో స్థానం కోసం కేరళతో పోటీపడుతోంది.
araku coffee  1

విశాఖ మన్యంలో పండించిన కాఫీ గింజలను గిరిజన రైతుల నుంచి వివిధ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇందులో ప్రధానమైంది. నాంది ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 20 వేల ఎకరాల్లో కాఫీ గింజలను పదేళ్లుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. విశాఖ మన్యంలో పండే  కాఫీకి విదేశాల్లోనూ మంచి డిమాండ్ వుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపూరితమైన పానీయము.

ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్రాంతాలలో దొరికే ఈ పానీయం. పెద్దల నుండి పిన్నల వరకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం  మన ఇంటికి స్నేహితులో బంధువులో  వచ్చినపుడు  వారికి కాఫీ ఇచ్చి  గౌరవిస్తుంటాం. విందులు వినోదాలలో కాఫీ అతి ముఖ్యమైన పానీయం అయ్యింది. ఉత్తర అమెరికాలో 1688లోనే కాఫీ సేవించినట్లు చరిత్ర చెపుతోంది. కాఫీ అనేక సమాజాలలో వారి సంస్కృతిలో ప్రధాన పాత్ర వహిస్తూ జీవిత ఆహారపు శైలిలో ఒక భాగం అయింది.  
araku coffee 2

కాఫీ వల్ల ఉపయోగాలు 
కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్సాహపరుస్తుందని తెలుస్తోంది. ప్రతిరోజూ coffee తాగితే గుండెజబ్బులు, మధుమేహము వచ్చే అవకాశము తగ్గుతుంది . కాఫీ వాడకం వల్ల వృద్ధాప్యము దూరమవుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు, coffee లోని కెఫిన్‌ .. న్యూరొట్రాన్స్మిటర్స్ అయిన ” నార్ ఎడ్రినాలిన్‌ , అసిటైల్ కొలిన్‌ , డోపమైన్‌” స్థాయిలను ఎక్కువ చేస్తుంది . వీటిమూలాన పనిలో ఏకాగ్రత, చురుకుతనము, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి కెఫిన్‌ తక్కువమోతాదో ఉత్సాహాన్ని పెంచి … అలసటను తగ్గిస్తుంది, కెఫిన్‌ మెటబాలిక్ రేట్ ను ఎక్కువచేస్తుంది ….తాత్కాలికంగా ఉసారుగా ఉండేటట్లు చేస్తుంది . కెఫిన్‌ క్యాస్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు .
araku coffee 3

కెఫిన్‌ ” పార్కిన్‌సోనిజం ” జబ్బు వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు . కెఫిన్‌ ” టైప్ 2 మెధుమేహము ” వచ్చే రిష్క్ తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి. కెఫిన్‌ కొన్ని కాలేయ క్యాన్సర్లు రానీయదని పరిశోధనలు ఉన్నాయి . అసలు రోజుకో మూడుకప్పులు కాఫీ తాగితేచాలు.. మతిమరపు దూరం అవుతుందంటున్నాయి తాజా పరిశోధనలు.

రోజూ కాఫీ తీసుకుంటే దానిలోవుండే కెఫిన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోకి చేరే కాలుష్యాలను అడ్డుకోవడంతోపాటు పార్కిన్ సన్ వ్యాధి నిరోధానికి కూడా మంచి ఔషధంగా పని చేస్తుందంటున్నారు సైంటిస్టులు. కాఫీ వాడకం గురించి వచ్చిన  కొత్త నివేదిక  ప్రకారం రోజూ కాఫీ తాగేవారి శరీరంలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చేరిన కారణంగా మెమరీ పవర్ పెరిగినట్టు గమనించారు.

దేశంలో రెండో స్థానానికి పోటీ..
రాష్ట్రంలో కాఫీ తోటలు విస్తరించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ప్రణాళిక అమలు చేస్తోంది. గత నాలుగేళ్లలో మొత్తం 42 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. వీటిని 2025–26 నాటికి మరో 58 వేల ఎకరాలకు విస్తరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఇందుకోసం చింతపల్లి మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. మూడేళ్లపాటు సిల్వర్‌ ఓక్‌ చెట్లు పెరిగిన తర్వాత వాటి మధ్య అంతర పంటగా కాఫీ మొక్కలు, మిరియాల పాదులు నాటుకోవడానికి ఐటీడీఏ సహకరిస్తోంది.  

2025–26 నాటికి మన్యంలో 2 లక్షల విస్తీర్ణంలో కాఫీ తోటలు విస్తరిస్తే దేశంలోనే 20 వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తితో కర్ణాటక తర్వాత ద్వితీయ స్థానానికి ఏపీ చేరుకుంటుంది. ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతో తమిళనాడును వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరింది. ఒక మొక్క నుంచి క్లీన్‌ కాఫీ గింజలు ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఒక మెట్రిక్‌ టన్ను కాఫీ గింజల ధర ప్రస్తుతం రూ.1.50 లక్షల వరకు ఉంది.  

araku coffee 4

విదేశీ ఎగుమతులే కీలకం 
భారతదేశంలో పండుతున్న కాఫీలో 80 శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో కాఫీ సాగు చేస్తున్నా ఎగుమతుల్లో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. కర్ణాటకలో  కార్పొరేట్‌ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఎకరానికి 225 కిలోలు దిగుబడి వస్తుండగా, విశాఖ మన్యంలో 100 నుంచి 120 కిలోల వరకు వస్తోంది. కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారని, దీంతో మరో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించే అవకాశం ఉందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు తెలిపారు. 

Categories
Andhrapradesh Political

visakha utsav 2019..ప్రారంభించిన సీఎం జగన్

విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. 2020, డిసెంబర్ 28వ తేదీ శనివారం విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా విశాఖ నగర వాసులు, వైసీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం RK బీచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారికంగా ఉత్సవ్‌ను ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనుంది కార్యక్రమం. ముగింపు వేడుకలకు గవర్నర్ రానున్నారు. 

సీఎం జగన్ విశాఖ టూర్..హైలెట్స్ :- 
* సభలో ఎంట్రీ ఇచ్చిన సీఎం జగన్‌కు అప్యాయంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి. ఆయనకు శాల్వతో సత్కరించి ఆప్యాయంగా ఆలింగనం * చేసుకున్నారు. 
* నవరత్నాలతో కూడిన ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. 
* బాణా సంచా మెరుపులతో ఆర్కే బీచ్ వెలిగిపోయింది. 

విశాఖలో సీఎం జగన్ చేసిన శంకుస్థాపనల వివరాలు :-
* రూ. 1, 290 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన.
* GVMC చేపట్టనున్న రూ. 905.05 కోట్లు. 
* VMRDA చేపట్టనున్న రూ. 379. 82 కోట్లు. 
* లా కాలేజీ నుంచి బీచ్ రోడ్డు వరకు 80 ఫీట్ల రోడ్ విస్తరణకు రూ. 7.5 కోట్లు.
 

* చుక్కవానిపాలెంలో 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్‌కు రూ. 90 కోట్లు.
* కైలాసగిరి ప్లానెటోరియం ఏర్పాటు కోసం రూ. 37 కోట్లు.
* సిరిపురం జంక్షన్‌లో మల్టీలెవల్ కార్ పార్కింగ్, వాణిజ్య సదుపాయం కోసం రూ. 80 కోట్లు. 
* నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రీసెర్చ్ సంస్థకు రూ. 88 కోట్లు.
* ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణం కోసం రూ. 75 కోట్లు.

Categories
Crime

కిడారి హత్య కేసులో మావోయిస్టు అరెస్టు

విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో  కూంబింగ్ నిర్వహిస్తున్న  పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టుకున్నారు.  విచారణ కోసం ఎన్ఐఏ కు అప్పగించారు. ఇప్పటికే ఈకేసులో కొందరిని పోలీసులు అరెస్టు చేయటం జరిగింది.  ఈహత్య కేసులో పాల్గోన్న నిందితులందరినీ ఒక్కొరొక్కరుగా పోలీసులు అరెస్టు చేయటం జరుగుతోంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కిడారి, సోమ హత్య కేసుకు కారణాలు ఏమిటి, ఎవరెవరు పాల్గోన్నారు, అసలు ఎందుకు హత్య చేశారు, అనే విషయాలను పోలీసులు రాబడుతున్నారు.  జయరాం కిల్లా మిలీషియా సభ్యుడుగా  పని చేశాడు.  కొన్నిసంఘ విద్రోహక చర్యల్లో కూడా ఇతను పాల్గోన్నాడు. ఇతని నుంచి మరింత సమాచాంరం రాబట్టే పనిలో ఎన్ఐ ఏ అధికారులు ఉన్నారు. 2018వసంవత్సరం సెప్టెంబర్ 23న అరకులోయలోని  డుమ్రిగూడ మండలం లివిట్టిపుట్ట వద్ద మావోయిస్టులు కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమలను దారుణంగా కాల్చి చంపారు.

Categories
Political

తమ్ముళ్ల తన్నులాట: విశాఖ టీడీపీలో వర్గపోరు

విశాఖ టీడీపీని అసమ్మతి, వర్గపోరు వేధిస్తోంది. ఇన్నాళ్లుగా నేతల మధ్య ఉన్న అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమంటోంది. సిట్టింగ్‌లకే ఈసారి టిక్కెట్లు కేటాయిస్తే ఓడిస్తామంటూ మరో వర్గం తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. అసలే వలసలతో విలవిల్లాడుతున్న విశాఖ జిల్లా టీడీపీని ఇప్పుడు ఇంటిపోరు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న అధినేతకు అసమ్మతి కుంపట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఇంచార్జులపై, అసమ్మతి నేతలు సెగలు కక్కుతున్నారు. వారికే టిక్కేట్టు ఇస్తే అంతే సంగతులు అని తేల్చి చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో విశాఖలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 11 టీడీపీ, బీజేపీ 1, వైసీపీ 3 గెలుచుకున్నాయి. పాడేరు, అరకు ఎమ్మేల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు పార్టీ మారి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 13కు పెరిగింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపుల వేళ అసమ్మతి వర్గం స్వరం పెంచుతోంది. ఇన్నాళ్లు తమపై కర్ర పెత్తనం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్ ఇస్తే ఊరుకోమని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.

పాయకరావుపేట ఎమ్మేల్యే అనితకు వ్యతిరేకంగానూ నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే కొటవృట్లలో అనిత వద్దు టీడీపీ ముద్దు అంటూ అసమ్మతి నేతలు మీటింగ్ పెట్టేశారు. అంతేకాదు పాయకరావు పేట టౌన్ అధ్యక్షుడు నారాయణరావు అనిత వద్దు తెలుగుదేశం ముద్దు అంటూ ర్యాలీ చేపట్టారు. ఆమెపై తీవ్ర అరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే అనితకు బదులు వేరే వారికి టిక్కేట్ ఇవ్వాలని కోరుతున్నారు. అనితకు టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామని, ఆ ప్రభావం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విజయావకాశాలపై కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు.

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర టీడీపీ అధ్యక్షుడైన వాసుపల్లి గణేష్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గ మైనారిటీ, మహిళా విభాగాల నేతలు, మాజీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ  డిమాండ్ చేశారు. గతేడాది వాసుపల్లి తీరుకు నిరసనగా దళిత నేతలు పార్టీ కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. తాజాగా వాసుపల్లికి టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామంటూ అర్బన్‌ టీడీపీ మైనార్టీ వింగ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ సాదిక్, మాజీ కార్పొరేటర్‌ చెన్నా రామారావు తదితరులు తేల్చిచెబుతున్నారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించిన నేతలపై ఎమ్మెల్యే స్వయంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వారు మండిపడ్డారు.

ఇక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌పై అక్కడి టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కార్పొరేటర్‌ లేళ్ల కోటేశ్వరరావు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టిన వారికి మళ్లీ టికెట్‌ ఇస్తే కార్యకర్తలే ఓడిస్తారని ప్రకటించారు. తాను కూడా టికెట్‌ రేసులో ఉన్నానని తెలిపారు. ఎమ్మెల్యే తీరు వల్లే కోన తాతారావు వంటి నేతలు పార్టీని వీడారని మళ్లీ పల్లాకు టికెట్‌ ఇస్తే చాలా మంది పార్టీని వీడతారంటూ హెచ్చరించారు. మాడుగులలో పార్టీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడుపై సొంత పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలే గ్రూపు కట్టి తిరుగుబాటు ప్రకటించారు. మాడుగులలో పైకి అంతా సవ్యంగా కనిపిస్తున్నా అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉంది.

ఇటువంటి పరిస్ధితుల్లో విశాఖ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి టీడీపీ అధిష్టానం సిట్టింగ్‌లకే టిక్కెట్‌ ఇస్తుందా.. జెండా మోసిన కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా అభ్యర్ధులను మారుస్తుందా అనేది  వేచి చూడాలి.

Categories
Political

అరకు ఎంపీ సీటుకు…. దేవ్‌డే దిక్కా..!

కిషోర్‌ చంద్రదేవ్‌ .. సీనియర్‌ పార్లమెంటేరియన్‌. రాజకుటుంబానికి చెందిన కిషోర్‌ హస్తానికి హ్యాండ్‌ ఇచ్చేశారు. ఇక తెలుగుదేశంలో చేరడమే తరువాయి. మరి కిషోర్‌ చంద్రదేవ్‌ సైకిలెక్కితే.. టీడీపీకి వచ్చే లాభమేంటీ.. ఉత్తరాంధ్ర అరకు టీడీపీకి ఆయనే దిక్కా.. వాచ్‌ దిస్‌ స్టోరీ. 

కిషోర్‌ చంద్రదేవ్‌.. కురుపాం రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. పార్లమెంటేరియన్‌గా 30 ఏళ్ళ అనుభవం. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ తొలి ఎంపీగానూ.. అంతకు ముందు పార్వతీపురం ఎంపీగానూ పనిచేశారు. 1977లో మొదటి సారి ఎంపీగా గెలిచిన నాటి నుంచి 5 సార్లు లోక్‌సభకు, ఒక సారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2009లో అరకు నుంచి విజయం సాధించిన తరువాత కిషోర్ చంద్రదేవ్ .. మైన్స్, స్టీల్, కోల్ మంత్రిగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకూ గిరిజన శాఖ మంత్రిగా, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

ముక్కు సూటి మనిషిగా పేరున్న కిషోర్ చంద్రదేవ్ గతంలో సొంత పార్టీ నిర్ణయాలను కూడా వ్యతిరేకించారు. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలను అప్పటి కేంద్ర మంత్రి మండలి సమర్ధించగా,  ఈయన విభేదించారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా ఉన్న కిషోర్ చంద్రదేవ్‌పై  ఒక్క అరోపణ కానీ విమర్శకాని లేదు. ఒకసారి ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి కిషోర్ చంద్రదేవ్ 2014 ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ నుంచి అరకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారనే చెప్పాలి. 

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా .. కాంగ్రెస్ పార్టీ జాతీయ అదివాసీ అధ్యక్షుడిగా కిషోర్‌ చంద్రదేవ్‌  కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేకుండా పోతోందని అవేదన వ్యక్తం చేస్తూ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీ ఓటమికి ప్రయత్నిస్తానని చెప్పటం ద్వారా ఆయన భవిష్యత్‌లో రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పకనే చెప్పారు. ఈ సమయంలో కిషోర్ చంద్రదేవ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది అసక్తికరంగా మారింది.

2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో గిరిజన నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రధానంగా విశాఖ పార్లమెంట్ స్థానంతో పాటు అరకు, పాడేరు నియోజకవర్గాల్లో  కూడా  వైసీపీ విజయం సాధించింది. ఒకప్పుడు అరకు నియోజక వర్గం టీడీపీకి కంచుకోటగా ఉన్నా 2014 ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు అరకు నుంచి వైసీపీ ఎమ్మేల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత పాడేరు నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరీతో పాటుగా కిడారి సర్వేశ్వరావు కూడా టీడీపీలోకి వచ్చారు. అయితే అరకు, పాడేరు ఎమ్మేల్యేలు టీడీపీలో చేరినా ఆ పార్టీ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసే సమర్ధవంతమైన నాయకుడు ఎవరూ లేరు. ప్రస్తుతం జీసీసీ ఎండీగా పనిచేస్తున్న బాబురావు నాయుడిని బరిలో దింపే అలోచన చేసినా  కిషోర్ చంద్రదేవ్ వంటి నేతలు పార్టీలో ఉండటం వల్ల అరకు పార్లమెంటరీ సీటును ఈజీగా గెలుపొందాలని టీడీపీ పెద్దల అలోచనగా తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే  అయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. 

కిషోర్ చంద్రదేవ్ ఒక వేళ టీడీపీలో చేరితే ఏజన్సీ ప్రాంతంలో ఆయనకు ఉన్న ఇమేజ్ టీడీపీకి వరంగా మారుతుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రలోని రాజకుటుంబాల్లో తొలి నుంచి విజయనగరం రాజులు టీడీపీలో ఉండగా  మిగిలిన కుటుంబాలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో ఉండేవి. అయితే విభజన అనంతరం రాష్ట్రంలో  తిరిగి కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోవడంతో  శత్రుచర్ల,  బొబ్బిలి కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి. ఇక మిగిలినది కురుపాం రాజకుటుంబం మాత్రమే. కిషోర్‌ చంద్రదేవ్‌ కూడా టీడీపీ గూటికి చేరితే ఆలోటూ తీరిపోతుంది.

కిషోర్‌ చంద్రదేవ్‌ బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకం. కానీ ఇంతవరకూ టీడీపీ బాక్సైట్ అనుకూలమో కాదో చెప్పలేదు. బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకం అంటూనే తవ్వాలకు ఇచ్చిన జీవోని టీడీపీ ఇంకా రద్దు చెయ్యలేదు. దీంతో టీడీపీని నమ్మే పరిస్థితుల్లో గిరిజనులు లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో కిషోర్‌ చంద్రదేవ్‌ టీడీపీ గూటికి చేరతారా, టీడీపీ బాక్సైట్‌ తవ్వకాలపై జీవో రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. 

Categories
Uncategorized

ఉత్సాహభరితంగా ’హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌’

ఆంధ్రా ఊటీ అరకులో హాట్‌బెలూన్‌ ఫెస్టివల్‌ ఉత్సాహభరితంగా సాగుతోంది.

విశాఖ : ఆంధ్రా ఊటీ అరకులో హాట్‌బెలూన్‌ ఫెస్టివల్‌ ఉత్సాహభరితంగా సాగుతోంది. దేశంలో ఎక్కాడాలేని విధంగా ఒకేసారి 25 హాట్‌బెలూన్లను ఎగరేసి ఘనత ఏపీకే దక్కింది. ఈ ఫెస్టివల్‌లో మొత్తం  పదిహేను దేశాలకు చెందిన 20మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ ఆహూతులను అమితంగా ఆకర్షిస్తోంది. 
 

Categories
Uncategorized

అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. సంక్రాంతి సమయంలో అంతటా గాలిపటాల జోరుంటే…అరకులోయలో మాత్రం అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది.

విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. సంక్రాంతి సమయంలో అంతటా గాలిపటాల జోరుంటే…అరకులోయలో మాత్రం అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది. బెలూన్లను ఎగురవేసేందుకు 13 దేశాల బృందాలు అరకు వచ్చాయి. జనవరీ 18 నుంచి 20 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. పర్యాటకంగా అరకులోయకు మరింత గుర్తింపు తెచ్చే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను నిర్వహిస్తోంది. చల్లని వాతావరణంలో గడిపేందుకు అరకు వస్తున్న పర్యాటకులకు ఈ హాట్ బెలూన్లు కనువిందు చేస్తాయి. 
ఈ బెలూన్లు సముద్ర మట్టానికి 50వేల అడుగుల ఎత్తు వరకూ ఎగురుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. 2017లో జరిగిన హాట్ బెలూన్ ఫెస్టివలలో భారత్ తో పాటు థాయ్ లాండ్, టర్కీ, ప్రాన్స్, న్యూజిలాండ్ వంటి 13 దేశాలకు చెందిన 16 బెలూన్లు గాళ్లో చక్కెర్లు కొడుతూ పొటీ పడ్డాయి. ఈసారి మరింత గొప్పగా ఈ పండగను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తోంది.