Categories
Latest Movies

నిన్న అక్కినేని నేడు దగ్గుబాటి!

ట్విట్టర్లో 6 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ దాటిన రానా దగ్గుబాటి..

యువ హీరో రానా దగ్గుబాటి సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. తాజాగా రానా ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కును దాటింది. ఈ సందర్భంగా రానా తన అభిమానులకు మరియు ట్విట్టర్ ఫాలోవర్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా అక్కినేని నాగార్జున కూడా 6 మిలియన్ మార్కును టచ్ చేసిన సంగతి తెలిసిందే.

త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రియమణి, సాయి పల్లవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ‘అరణ్య’ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో త్వరలో విడుదల కానుంది.
 

Read:  గ్రీన్ ఛాలెంజ్- పార్క్‌లో మొక్కలు నాటిన విశ్వక్ సేన్

Categories
Movies

‘అరణ్య’ కోసం రానా ఎంత బరువు తగ్గాడంటే!

‘అరణ్య’ సిినిమా కోసం కఠినమైన ఆహార నియమాలతో బరువు తగ్గిన రానా దగ్గుబాటి..

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ‘అరణ్య‘ చిత్రం 2020 లోనే అతిపెద్ద అడ్వెంచర్ డ్రామా. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ‘అరణ్య’ఒకటి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుంది. తెలుగు వెర్షన్ ‘అరణ్య’, తమిళ వెర్షన్ ‘కాడన్’లో రానాతో పాటు విష్ణు విశాల్, హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో పుల్కిత్ సామ్రాట్ నటిస్తున్నారు. మరో రెండు ఆసక్తికర పాత్రల్ని శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ చేస్తున్నారు.

కాగా ఈ యాక్షన్ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో రానా దగ్గుబాటి కనిపిస్తున్నాడంటూ ఇటు సినిమా వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో చర్చలు నడుస్తున్నాయి. రానా ఫస్ట్ లుక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అప్పట్నుంచే ఆయన అభిమానులు దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో స్పందనకు అంతు లేదు. 35 ఏళ్ల రానా ఈ సినిమాలో ‘బాణదేవ్’ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గారు. సినిమా అంతా ఆయన బాగా పెరిగిన గెడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో కనిపిస్తారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఆ పాత్ర కోసం రానాతో పలు రకాల లుక్స్ ప్రయత్నించారు దర్శకనిర్మాతలు. “డైరెక్టర్ ప్రభు సాల్మన్ నా పాత్రకు సంబంధించి ప్రతిదీ వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించారు. ఎప్పుడూ భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే నాకు ఈ స్థాయిలో బరువుతగ్గడం అనేది చాలా క్లిష్టమైన పని. బాణదేవ్ క్యారెక్టర్ కోసం సన్నగా మారడానికి తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా. అది నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్” అని రానా తెలిపారు.

ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’గా, తమిళంలో ‘కాడన్’గా, హిందీలో ‘హాథీ మేరే సాథీ’ గా 2020 ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన దురదృష్టకర ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు. వన్యప్రాణుల్నీ, ప్రకృతినీ కాపాడుకోవడానికి జరిగే ఘర్షణలో ఆయన ఏవిధంగా భాగమవుతాడో ఈ సినిమాలో మనం చూడనున్నాం.

Categories
Movies Viral

రౌద్రవంగా రానా లుక్ – మూడు భాషల్లో విడుదల..

రానా దగ్గుబాటి నటిస్తున్న హిందీ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’ తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానుంది..

రానా దగ్గుబాటి.. ‘బాహుబలి’ తర్వాత చెయ్యబోయే సినిమాల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడు. క్యెరెక్టర్ కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం రానాకి వెన్నతో పెట్టిన విద్య. బాహుబలిలో భారీ కాయంతో కనపించిన రానా, ఎన్టీఆర్ బయోపిక్ కోసం స్లిమ్ అయ్యాడు. నారా చంద్రబాబు నాయుడు గెటప్‌లో అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు.

ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన రానా ప్రస్తుతం తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నాడు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హథీ మేరే సాథీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నిర్మిస్తోంది. తాజాగా తమిళ్, తెలుగు టైటిల్స్ ప్రకటిస్తూ రానా లుక్ రిలీజ్ చేశారు.

 

HINDI

 

తమిళ్‌లో ‘కాదన్’, తెలుగులో ‘అరణ్య’ పేరుతో ఈ సినిమా తెరెక్కెతోంది. పోస్టర్‌లో రానా డిఫరెంట్‌ వేషధారణ, హావభావాలతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావుంకర్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌, విష్ణు విశాల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అధిక భాగాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరించారు. ఆస్కార్‌ విజేత రసూల్‌  సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా మూడు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

TAMIL