Categories
Hyderabad

మోడీ, షా ఎంట్రీ : తెలంగాణలో బీజేపీ తలరాత మారేనా

మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా… అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా… అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.

మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా… అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా… అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది. తెలంగాణలో బీజేపీ తలరాత మారుతుందా… లేక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా  అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయా. ఉత్తర భారతంలో బీజేపీ హవా ఉంది. సౌత్‌లో మాత్రం నిలదొక్కుకోలేకపోతోంది. కర్నాటకలో పట్టు సాధించినట్లే కనిపించినా… చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో పాగా వేయాలని ఎన్నాళ్లగానో ట్రై చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభంజనంలో కమలం వికసించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి ఏ మాత్రం కలిసిరాలేదు. 40మంది స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రం  మొత్తం చుట్టేసినా… 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలుంటే.. కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది.
Read Also : పవన్ హామీలు : స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్.. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం

అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయటపడి.. పార్లమెంట్ ఎలక్షన్స్‌తో సత్తా చాటాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా… 5 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తోంది. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూనే.. అగ్రనేతలతో ప్రచారం నిర్వహిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో సికింద్రాబాద్ మాత్రమే సిట్టింగ్ స్థానంగా ఉంది. అక్కడ దత్తాత్రేయ కాకుండా… కిషన్‌రెడ్డి బరిలో నిలిచారు. యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో ఈ మార్పు చేశారు. మరి బీజేపీ సిట్టింగ్ ప్లేస్‌ను కాపాడుకుంటుందో లేదో చూడాలి.

మహబూబ్‌నగర్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి చరిష్మా.. బీజేపీలో చేరాక ఉంటుందో లేదో అర్థం కాని పరిస్థితి. ఆమె అనుచరులు కాంగ్రెస్‌కే సపోర్ట్ చేస్తారో లేక.. కమలానికి  అండగా ఉంటారో చూడాలి. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నారు. యూత్ ఫాలోయింగ్.. కవితపై ఉన్న అసంతృప్తి అరవింద్‌ను గెలిపిస్తుందని కమలం పార్టీ ఆశిస్తోంది. మొత్తం 185మంది  బరిలో ఉండగా.. ఓట్లు చీలితే కొంతైన కలిసొస్తుందని ఆ పార్టీ ఆశిస్తోంది.

కరీంనగర్‌లో బండి సంజయ్‌ గెలుపుపై ఆశలున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలవని ఆయన పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమవుతుందా అనే చర్చ జరుగుతోంది. చేవెళ్లలో దత్తాత్రేయ వియ్యంకుడు, బీజేపీ రాష్ట్ర  కార్యదర్శి జనార్ధన్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ.. గట్టి పోటీ ఇవ్వడమే తప్ప గెలుపుపై గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో.. ప్రధాని మోడీ ప్రచారం.. అమిత్ షా వ్యూహాలు ఎంత వరకు లాభిస్తాయనే చర్చ పార్టీ నేతల్లో  జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా విస్తృతంగా ప్రచారం చేసినా.. ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో అయినా… తలరాత మారుతుంతో లేదా చూడాలి.
Read Also : రాహుల్ హామీ : ఏడాదిలోనే 22లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ