Categories
Movies

మోహన్ లాల్ ‘బిగ్ బ్రదర్’ – మోషన్ పోస్టర్

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న మలయాళ సినిమా ‘బిగ్ బ్రదర్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా, సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా ‘బిగ్ బ్రదర్’.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదురుడు అర్భాజ్ ఖాన్ మల్లూవుడ్‌కి పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమాలో అర్భాజ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా  కనిపించనున్నాడు. తాజాగా ‘బిగ్ బ్రదర్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సట్నా టైటస్ (బిచ్చగాడు ఫేమ్) కథానాయిక. అనూప్ మీనన్, శిల్పా అజయన్, సర్జానో ఖలీద్, విష్ణు ఉన్ని కృష్ణన్  కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

S టాకీస్, షామాన్ ఇంటర్నేషనల్, వైశాఖ సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు 2020 జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం : దీపక్ దేవ్, కెమెరా : జితూ దామోదర్, ఎడిటింగ్ : K.R.గౌరీ శంకర్.