Categories
Life Style National

80వేల ఏళ్ల క్రిత‌మే భారత్ లో మాన‌వుల సంచారం 

భార‌తదేశంలో మాన‌వ సంచారం ఎప్పుడు మొద‌లైంద‌న్న దానిపై పురావస్తు శాస్త్ర‌వేత్త‌లు ఓ క్లారిటీకి వ‌చ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రిత‌మే.. సెంట్ర‌ల్ ఇండియాలో మాన‌వులు సంచ‌రించిన‌ట్లు అంచ‌నాకు వ‌చ్చారు.

భార‌తదేశంలో మాన‌వ సంచారం ఎప్పుడు మొద‌లైంద‌న్న దానిపై పురావస్తు శాస్త్ర‌వేత్త‌లు ఓ  క్లారిటీకి వ‌చ్చారు. ఉత్త‌ర భార‌తంలో ఉన్న సోన్ న‌ది స‌మీపంలో ఇటీవ‌ల పురావస్తు శాఖ అధికారులు దాబా అనే ప్రాంతం నుంచి కొన్ని రాతి పనిముట్ల‌ను సేక‌రించారు. వాటిని అధ్య‌యనం చేసిన శాస్త్ర‌వేత్త‌లు.. ఇక్క‌డ జ‌రిగిన మాన‌వ సంచారం గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రిత‌మే.. సెంట్ర‌ల్ ఇండియాలో మాన‌వులు సంచ‌రించిన‌ట్లు అంచ‌నాకు వ‌చ్చారు.  

క‌ట్టింగ్ కోసం ఆది మాన‌వులు ఈ రాళ్ల ప‌నిముట్ల‌ను వాడిన‌ట్లు నిర్ధారించారు. మ‌ధ్య‌రాతి యుగంలో నియండ‌ర్త‌ల్స్ వాడిన ప‌నిముట్ల త‌ర‌హాలో రాతిప‌నిముట్లు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు ఓ అభిప్రాయానికి వ‌చ్చారు. కానీ అప్పుడు సంచ‌రించిన మాన‌వులు.. నియండ‌ర్త‌ల్స్ అవునా కాదా అన్న అంశాన్ని మాత్రం తేల్చ‌లేక‌పోయారు. లుమినిసెన్స్ అనే  టెక్నిక్ ద్వారా ఆ నాటి రాతి ప‌నిముట్ల‌ను అధ్య‌యనం చేశారు. ఆ స్ట‌డీ ద్వారా వాటి వ‌య‌సును అంచ‌నా వేశారు. 

అయితే సుమ‌త్రా దీవుల్లోని తోబా అగ్నిప‌ర్వ‌తం పేలిన సంఘ‌ట‌న‌కు సంబంధించిన కోణాన్ని కూడా పురావస్తుశాఖ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. సుమారు 75 వేల ఏళ్ల క్రితం తోబా అగ్నిప‌ర్వ‌తం పేలింది. అది ద‌ట్ట‌మైన రాళ్లును, ధూళిని వెద‌జ‌ల్లింది. అవ‌న్నీ భార‌త ఉప‌ఖండంలో ప‌డ్డాయి. దాంతో ఆనాటి మాన‌వులు కొంత అంత‌రించి ఉంటార‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చారు. 

ఆ అగ్నిప‌ర్వ‌త పేలుళ్ల‌ను త‌ట్టుకుని మ‌రో 50వేల ఏళ్ల పాటు కొంద‌రు బ్ర‌తికి ఉంటార‌ని మ‌రో అంచ‌నా వేశారు. అయితే ఆఫ్రికా నుంచి వ‌ల‌స వ‌చ్చిన మానవుల‌కు, సెంట్ర‌ల్ ఇండియాకు లింకు ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. కానీ హోమో సేపియ‌న్స్‌తో సెంట్ర‌ల్ ఇండియాకు సంబంధంలేద‌ని మ‌రికొంత మంది శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.
 

Categories
National

హిస్టరీలో మిస్టరీ : 5వేల ఏళ్ల నాటి అస్థిపంజరం.. ఎవరిదంటే?

అదో పురాతన స్మశానం. చూడటానికి ఎంతో విశాలంగా కనిపిస్తోంది. తెలిసినవాళ్లు.. పుస్తకాల్లో చదివినవాళ్లు ఇక్కడ ప్రాచీన శిలఖండాలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. మనిషికి అంతుపట్టని రహస్య ఏంటో ఇందులో ఉందని అందరి నమ్మకం.

అదో పురాతన స్మశానం. చూడటానికి ఎంతో విశాలంగా కనిపిస్తోంది. తెలిసినవాళ్లు.. పుస్తకాల్లో చదివినవాళ్లు ఇక్కడ ప్రాచీన శిలాఖండాలు ఉంటాయని విశ్వసిస్తుంటారు. మనిషికి అంతు చిక్కని రహస్యం ఏంటో ఇందులో ఉందని అక్కడి వారి విశ్వాసం. అదే.. పురావస్తు శాఖవారిని అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపేందుకు ఊతం ఇచ్చింది. నెలలు తరబడి విరామం లేకుండా తవ్వకాలు జరిపారు. రెండు నెలల తర్వాత అతి విశాలమైన స్మశానాన్ని కనిపెట్టారు. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల్లో 6 అడుగుల అస్థిపంజరం బయటపడింది. 5వేల సంవత్సరాల కాలం నాటి అస్థిపంజరంగా అంచనా వేస్తున్నారు. ఇంతకీ.. ఈ అస్థిపంజరం ఎవరిదో కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. 
Read Also : వాట్సాప్‌లో కొత్త బగ్ : యూజర్ల ఫొటోలు డిలీట్ చేస్తోంది

హరప్పా నాగరికతకు చెందిన వారివేనా..?
Six feets human skeleton found in Kutch, Discover Graves, Burial sites, Harappan Civilizationపురావస్తు తవ్వకాల్లో తొలుత అస్థిపంజరం బయటపడటంతో అది హరప్పా నాగరికతకు చెందినవారిదిగా శాస్త్రవేత్తలు పొరపాటు పడ్డారు. ఇంతకీ హరప్పా నాగరికతకు చెందినవారిదా కాదా అనే కోణంలో పరిశోధనలు జరుపుతోంది. ఈ పురాతన రహస్య స్మశానం ఎక్కడిదో కాదు.. గుజరాత్ లోని కచ్ జిల్లా ధోలవీరా ప్రాంతానికి 360 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాధి వైశాల్యం 300×300 మీటర్లు ఉంటుందని గుర్తించారు. అంతేకాదు.. ఈ స్మశానంలో 250కు పైగా సమాధులను గుర్తించారు. ఇందులో 26 సమాధులను తవ్వేశారు. తవ్విన అన్ని సమాధుల్లో ఒక మనిషి పూర్తి స్థాయి అస్థిపంజరం బయటపడింది. చూడటానికి ఈ అస్థిపంజరం పొడవు ఆరు అడుగుల వరకు ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని పురావస్తు శాఖ పరిశీలించగా.. 5వేల సంవత్సరాల కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు. 
Six feets human skeleton found in Kutch, Discover Graves, Burial sites, Harappan Civilization

తొలి దీర్ఘచతురస్రాకారపు స్మశానం ఇదే..
గుజరాత్ లో ఇప్పటివరకూ జరిపిన తవ్వకాల్లో దీర్ఘచతురస్రాకారపు ఆకారాల్లో ఉన్న స్మశానాన్ని కనిపెట్టడం ఇదే తొలిసారి. ప్రాచీన కాలం నాటి ఇందులో  4వేల 600 నుంచి 5వేల 200 ఏళ్ల కాలం నాటిదిగా అంచనా వేస్తోంది. ఇప్పటివరకూ గుజరాత్ లో బయటపడిన అన్ని స్మశానాలు వృత్తాకారంలోనూ లేదా అర్థ వృత్తాకారంలో మాత్రమే ఉన్నాయి. మరి.. ఇక్కడ ప్రత్యేకించి దీర్ఘచతురస్రాకారపు ఆకారాల్లో ఎందుకు నిర్మించారు అనేదానిపై పరిశోధనలు సాగిస్తున్నారు శాస్త్రవేత్తలు. డిపార్ట్ మెంట్ పురావస్తు శాఖ, కచ్ యూనివర్శిటీకి చెందిన అధికారి సురేశ్ బండారి దీనిని లీడ్ చేస్తున్నారు. స్మశానంలో జరిగిన తవ్వకాల్లో బయటపడిన ఆరు అడుగుల అస్థిపంజరాన్ని పరీక్షించేందుకు పురావస్తు శాఖకు చెందిన కేరళ యూనివర్శిటీకి తరలించారు. అస్థిపంజరం (మనిషి) వయస్సు ఎంత ఉంటుంది, మరణానికి కారణం ఏంటి.. ఆడ లేదా మగ అనేది కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు బండారీ చెప్పారు. 
Six feets human skeleton found in Kutch, Discover Graves, Burial sites, Harappan Civilization

తూర్పు- పశ్చిమ దిశల్లో సమాధులు..
గుజరాత్ లోని లాక్ పాట్ తాలూకాకు చెందిన కటియా గ్రామ సమీపాన ఉన్న పురాతన స్మశానం కచ్ యూనివర్శిటీ, కేరళ యూనివర్శిటీ సంయుక్తంగా తవ్వకాలు జరిపాయి. ఈ తవ్వకాల్లో తొలిసారి దీర్ఘచతురస్రాకారపు స్మశానం బయటపడ్డాయి. పురావస్తు శాఖ అధికారుల చెప్పిన వివరాలు ప్రకారం.. తూర్పు, పశ్చిమ దిశల్లో దీర్ఘ చతరుస్రాకారంగా ఉండి.. చుట్టూ రాళ్లతో కట్టిన గోడలు కట్టి ఉన్నాయి. సమాధుల్లో ఉన్న అస్థిపంజరాలు తల తూర్పు వైపు ఉంటే.. కాళ్లు పశ్చిమ దిశగా ఉన్నాయి. ఈ సమాధి వైశాల్యం 6.9 మీటర్లు ఉండగా.. మరికొన్ని సమాధులు 1.2 మీటర్లు పరిమాణంలో తక్కువగా ఉన్నాయి.
Six feets human skeleton found in Kutch, Discover Graves, Burial sites, Harappan Civilization

మనిషి అస్థిపంజరాలే కాదు.. చిన్న పిల్లల అస్థిపంజరాలు.. ఈ స్మశానంలో జంతువుల అస్థిపంజరాలు కూడా బయటపడినట్టు పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. సమాధిలో రాయితో తయారు చేసిన కత్తులు, ఆయుధ సామాగ్రి ఇలా మరెన్నో వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. ఈ వస్తువులన్నీ ఏ సంస్కృతి, జాతులకు చెందినవారివి, ఇలా సమాధుల్లో ఎందుకు పూడ్చిపెట్టారో తెలుసుకోనే ప్రయత్నంలో పురావస్తు శాఖ నిమగ్నమైంది. చూడటానికి హరప్పా సంస్కృతికి చెందిన ఆనవాళ్లుగా అంచనా వేస్తోంది. 
Read Also : పైలట్లకు DGCA స్ట్రిక్ రూల్స్: ఇకపై ‘బోయింగ్’ విమానం నడపాలంటే?