Categories
Crime Telangana

గొర్రెకుంట ఘటనలో షాకింగ్ ట్విస్ట్..చక్కెర పొంగలిలో విషం కలిపి తొమ్మిదిమందిని చంపేశారా?

వరంగల్ జిల్లాలో గొర్రెకుంటలో బావిలో తేలిన వలస కూలీల కుటుంబం ఘటనలో విస్తుపోయే వాస్తవాలు బైటపడుతున్నాయి. ఇప్పటి వరకూ మక్సూద్ కుటుంబం మాత్రమే చనిపోయినట్లుగా బావిలో లభ్యమైన  మృతదేహాల వల్ల తెలిసింది. కానీ మక్సూద్ కుటుంబంలోని ఐదుగురితో పాటు  మరో నాలుగు మృతదేహాలు కూడా బావిలో లభ్యమవ్వటంతో ఈ కేసులో షాకింగ్ విషయాలు బైటపడుతున్నాయి.

అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో మృతులు విషం కలిపిన స్వీట్ (చక్కెరపొంగలి) తినటం వల్లనే మృతి చెందినట్లుగా పోలీసుల అనుమానిస్తున్నారు. స్వీట్ తిన్న తరువాత వారిని బావిలో పడేశారా? లేక మత్తులో వుండగా బావిలో పడేశారా? అనే పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి. 

కోల్‌కతాకు  చెందిన మక్సూద్ (50) కుటుంబం 20 ఏళ్ల క్రితం వరంగల్ అర్బన్ జిల్లాలోని కరీమాబాద్‌లో బార్‌దాన్ కూలీగా పనిచేస్తున్నాడు. అతనితో పాటు అతని కుటుంబం సభ్యులు మొత్తం ఆరుగురు కలిసి గొర్రెకుంటలోని ఓ గన్నీ సంచుల గోడౌన్ లో పనిచేస్తున్నారు. 

ఈక్రమంలో  పనిచేసుకుంటూ జీవనం సాగించే  మక్సూద్ కుటంబం అనుమానాస్పదంగా మృతి చెందింది.. మక్సూద్ తో పాటు అతని భార్య నిషా (45), కూతురు బుస్సా, మనుమడు. ఇద్దరు కుమారులు అనుమానాస్పదంగా బావిలో శవాలుగా తేలారు. వారి కుటుంబంతో పాటు వారితోనే గోడౌన్ లో  కలిసి నివసిసస్తున్న మరో నలుగురు బీహారీల్లో  ఇద్దరు బీహారీలు శ్రీరామ్, శ్యామ్ లు కూడా బావిలో శవాలుగా తేలారు.

  
ఇప్పటి వరకూ మక్సూద్ కుటుంబం మాత్రమే మృతి చెందారని భావిస్తున్న పోలీసులు నలుగురు బీహారీలు కూడా కనిపించకపోవటంతో పోలీసులు సదరు బీహారీ యువకులపైనే అనుమానాలు వ్యక్తంచేశారు. మక్సూద్ కుటుంబం మృతికి బీహార్ యువకులకు సంబంధం ఉందా? వారే ఈ హత్యలు చేశారా? అని అనుమానించారు. కానీ బావిలో లభ్యమైన మృత దేహాల్లో ఇద్దరు బీహార్ యువకులు కూడా ఉండటంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది.

 

మృతుల్ని చక్కెరపొంగలిలో విషం పెట్టి చంపి..వారు మత్తులో ఉండగానే బావిలో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనేదానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. కాగా..కొన్ని రోజుల క్రితం మక్సూద్ మనుమడి పుట్టినరోజు వేడుకల్లో జరిగిన గొడవే ఈ హత్యలకు దారితీసిందా? చక్కెర పొంగలిలో  కావాలనే ఎవరో విషం కలిపి పెట్టి వారిని హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

బుధవారం(మే20.2020) రాత్రి ఏంజరిగింది? మక్సూద్ పనిచేసే పరిశ్రమ యజమాని గోడౌన్ వద్దకు వచ్చి చూసేసరికి  వీరవ్వరూ కనిపించకపోవటంతో సదరు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వీరంతా బావిలో శవాలుగా పడి ఉన్న విషయం తెలిసింది. ఎన్నో మిస్టరీలుగా బైటపడుతున్న ఈ అనుమానాస్పద మృతుల ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.