Categories
National Slider

KGF లో బంగారాన్ని మించిన ‘పల్లాడియం’ లోహా నిక్షేపాలు..!!

కేజీఎఫ్‌లోని బిజిఎంఎల్‌ బంగారు గనుల ప్రాంతంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నాయని.. వీటి వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనుందని ఎంపీ ఎస్‌.మునిస్వామి తెలిపారు. 

మంగళవారం (జూన్ 2,2020)న బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..ఏపీ, కర్ణాటక పరిధిలో విస్తరించి ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్)లో నిక్షేపమై ఉన్న పల్లాడియంను వెలికి తీస్తే కోలార్ జిల్లా వాసులకు అది చాలా శుభవార్త అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజిఎంఎల్‌ పునరుజ్జీవనానికి సంబంధించి గని కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు.

ఆ సమయంలో ప్రధాని సూచనల మేరకు కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్‌జోషి నేతృత్వంలో ఒక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి బిజిఎంఎల్‌ను సందర్శించి బంగారు నిక్షేపాల నమూనాలను ల్యాబొరేటరికి పంపినపుడు.. బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తరహాలో ఈ గనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. దీనిపై వచ్చే పార్లమెంట్‌ సమావేశాలలో తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశముందన్ని అన్నారు. 

పల్లాడియం అంటే: ప్లాటినం గ్రూపు లోహాలకు చెందిన ఇది వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది. బంగారంతో పోలీస్తే పల్లాడియం తక్కువ ఉష్ణోగ్రతకే కరుగిపోతుంది.  ప్రపంచంలో చాలా అరుదుగా లభిస్తున్నందున ఈ అరుదైన లోహంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కార్ల ఇంజిన్‌ విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నా  డిమాండుకు తగినంతగా పల్లాడియం లభ్యత లేదు. దీంతో పల్లాడియం అంటే బంగారం కంటే విలువైనది గామారింది. పల్లాడియం  గ్రాము ధర బంగారం, ప్లాటినంల కంటే చాలా  ఎక్కువేనని నిపుణులు అంటున్నారు.

Read: ఆ పార్టీకి పని చేయనన్న ప్రశాంత్ కిశోర్

Categories
Viral

వైరల్ వీడియో: విమానాశ్రయంలో మూత్రం పోసిన వ్యక్తి!

విమానాశ్రయాల్లో కొన్ని వింత ఘటనలు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన వీడియో సోషట్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులంతా విమానం కోసం టెర్మినల్ హాల్ లో వెయిట్ చేస్తున్నప్పుడు, వారి మధ్యలో కూర్చున్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా ఫ్యాంట్ జిప్ తీసి మూత్రం పోశాడు. దాంతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు  గురైయ్యారు.

షామింగ్ అనే ప్యాసింజర్ వీడియో తీసి “అవును, ఈ ప్రయాణికుడు విమానాశ్రయం టెర్మినల్ లో మూత్రం పోశాడు” అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం అతనిక పోయే కాలం వచ్చిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం అతనికి మూత్ర సమస్య ఉండవచ్చు అంటున్నారు. 

 

Categories
Andhrapradesh

వాళ్లు రైతులు కాదు : భూములు కొట్టేసిన వాళ్లే ధర్నాలు చేస్తున్నారు

రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలు..ఆందోళనలు చేసేవారంతా రైతులు కాదనీ..రాజధాని అమరావతి పేరుతో రైతుల దగ్గర భూములు కొట్టేసినవారే ధర్నాలు చేస్తున్నారనీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా? భూములకు విలువ పడిపోయందని ఆందోళన చేస్తున్నారా? అంటూ తీవ్ర విమర్శలుచేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. 

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటను ఆయన స్వాగతించారు. జగన్ ను అభినందించారు.రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసి..పాలనను అన్ని ప్రాంతాలకు విస్తరించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే ధర్నాలు..రాస్తా రోకోలు అంటూ ఎందుకు రాద్ధాతం చేస్తున్నారని స్పీకర్ ప్రశ్నించారు. పాలన అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే రాష్ట్రం అభివృద్ధి జరగుతుందని అన్నారు.  

కాగా రాష్ట్రానికి మూడు రాజధాలను అంటూ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు.రైతు కుటుంబాల్లోని మహిళలు కూడా రోడ్డుపై కూర్చుని మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ కు  ఓట్లు వేసి సీఎం ను చేస్తే మమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టావు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు మహిళలు. రైతులు చేపట్టిన ఈ ఆందోళనలకు విద్యార్ధులు సైతం మద్దతు తెలిపారు. 

Categories
National

చెట్ల నరికివేత అక్రమం కాదు…పర్యావరణ కార్యకర్తలపై మెట్రో చీఫ్ ఫైర్

ముంబైలోని ముంబైలోని ఆరే కాల‌నీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15 రోజుల తప్పనిసరి నోటీసు వ్యవధి లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్ లు చేశారు.

 ట్రీ అథారిటీ ఆర్డర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయిన తర్వాత 15 రోజుల నోటీసు అవసరమని తప్పుడు ప్రచారం జరుగుతందని, ఇది ఖచ్చితంగా నిరాధారమైనదని ఆమె ఓ ట్వీట్ లో తెలిపారు. ట్రీ అథారిటీ ఉత్తర్వు సెప్టెంబర్ 13 న జారీ చేయబడిందని, సెప్టెంబర్ 28 నాటికే 15 రోజులు గడిచిపోయినప్పటికీ గౌరవ హైకోర్టు తీర్పు వెలువడే వరకు చర్యలు కోసం ఎదురుచూసినట్లు ఆమె తెలిపారు. అరే కాలనీలో మెట్రో కార్ల షెడ్ కోసం చెట్ట నరికివేతను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను శుక్రవారం బాంబే హైకోర్టు అన్ని స్పష్టమైన నిబంధనలతో తోసిపుచ్చిందని, కానీ కొంతమంది ప్రజలు తమను తాము ఉన్నతమైన  న్యాయవ్యవస్థగా భావిస్తారని ఆమె తెలిపారు. వారి స్వంత చర్యలు చట్టవిరుద్ధం అని ఆమె తెలిపారు. కోర్టులో జరిగిన యుద్ధంలో ఓడిపోతే, దానిని వీధికి తీసుకెళ్లడం కంటే గౌరవంగా అంగీకరించడం మంచిదని చెట్ల నరికివేతను అడ్డుకుంటున్నవారిపై ఆమె ఫైర్ అయ్యారు. అరే ప్రాంతంలో చెట్ల నరికివేత కార్య

అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని ముంబై మెట్రో తీసుకున్న నిర్ణయన్నా వ్యతిరేకిస్తూ పర్యావరణ కార్యకర్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చెట్ల నరికివేత అడ్డుకోవాలంటూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. దీంతో శుక్ర‌వారం రాత్రి కొన్ని చెట్ల‌ను తొల‌గించేందుకు మున్సిప‌ల్ అధికారులు ప్ర‌య‌త్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పర్యావరణ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడి శాంతియుతంగా నిరసన చేపట్టారు.

రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు.  మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబై నిబంధనల ప్రకారం కోర్టు ఆర్డర్‌ వెబ్‌సైట్‌లో పెట్టిన 15 రోజుల తర్వాతే చెట్లు నరికివేసే వీలుంటుందని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ మెట్రో అధికారులు మాత్రం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించి చెట్లను నరికివేయడం దారుణమన్నారు.

అయితేచెట్లను నరికివేయడాన్ని రాజకీయనాయకులు,బాలీవుడ్ ప్రముఖులు,సెలబ్రిటీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శనివారం ముంబైలోని ఆరే కాల‌నీలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. అరే ప్రాంతంలో చెట్ల నరికివేత కొనసాగిస్తున్నారు అధికారులు. దీనిని అడ్డుకునేందుకు ఇవాళ ఉదయం ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో శివసేన లీడర్ ప్రియాంక చతుర్వేది కూడా ఉన్నారు.

Categories
Hyderabad

రూ. 35 లక్షల ఆస్తి నష్టం : ఆసీఫ్‌ నగర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రెండు వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆసీఫ్ నగర్‌లో మూడంతస్తులున్న ఓ ఫర్నీచర్ గౌడోన్‌లో మంటలు అంటుకున్నాయి. శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అగ్నిమాపక శకటలతో అక్కడకు చేరుకున్నారు.

అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి. స్థానికంగా ఉన్న వారు ఇబ్బందులు పడ్డారు. 5 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. మూడు గంటల తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. మొదటి, రెండంతస్తులో ఉన్న ఫర్నీచర్ కాలిపోయింది. రూ. 35 లక్షల మేర ఆస్తినష్టం కలిగినట్లు అంచనా వేస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.