Categories
National

83రోజుల తర్వాత ఢిల్లీ దాటిన మోడీ…కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో మమత స్వాగతం

ఆంఫన్ తుఫాన్ నేపథ్యంలో  క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఇవాళ(మే-22,2020)ఉదయం బెంగాల్ రాజధాని కోల్ కతా చేరుకున్నారు ప్రధాని మోడీ. 
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలపాటు ఢిల్లీ దాటి అడుగుపెట్టని ప్రధాని మోడీ…దాదాపు 3నెలల తర్వాత ఢిల్లీ దాటి ప్రయాణించడం ఇదే మొదటిసారి.

ఫిబ్రవరి-29న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్,చిత్రకూట్ లో పర్యటించిన మోడీ ఆ తర్వాత ఢిల్లీ దాటి బయటకు ప్రయాణించలేదు. 83రోజుల తర్వాత ఇవాళ బెంగాల్,ఒడిషాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం బెంగాల్ రాజధాని కోల్ కతా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మోడీకి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,గవర్నర్ జగదీప్ ధన్ కర్ మోడీకి స్వాగతం పలికారు. కరోనా వైరస్ నేపథ్యంలో మోడీతో సహా అందరూ ఫేస్ మాస్క్ లు ధరించి కన్పించారు.

 పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఆంఫన్ తుఫాన్ కారణంగా ప్రభావితమైన ప్రాంతాలను ఇవాళ ఏరియల్ సర్వే ద్వారా మోడీ చూడనున్నారు. మోడీతో పాటు బెంగాల్ కు చెందిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో,ఒడిషాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు.ఆంఫన్ తుఫాన్ సమయంలో అన్ని రకాల సహాయం అందిస్తామంటూ గురువారం ప్రధాని వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. దేశమంతా ఈ సమయంలో బెంగాల్ వెంట ఉంటుందని మోడీ తెలిపారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.

ఇవాళ బెంగాల్ లో నిర్వహించే ఏరియల్ సర్వేల్ మోడీ వెంట గవర్నర్,సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొననున్నారు. ఆంఫన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ బెంగాల్ లో మోడీ,మమత,గవర్నర్ ఏరియల్ సర్వే కొనసాగుతుంది. కోల్ కతాకు తిరిగి చేరుకునే ముందు ఉత్తర24పరణాల జిల్లాలోని బసిర్హట్ లో నిర్వహించే ఓ మీటింగ్ లో పీఎం,సీఎం,గవర్నర్ పాల్గొంటారు. ఆంఫన్ తుఫాన్ కారణంగా 72మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read:శ్రీదేవి ఇంట్లో మరో ఇద్దరికి కరోనా