Categories
Crime Telangana

సమత హత్యాచారం : నిందితుల తరపున వాదించేందుకు వకల్తా తీసుకున్న లాయర్

ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం కోర్టు విచారణ జరిపి..డిసెంబర్ 19వ తేదీ గురువారానికి వాయిదా వేసింది. నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాది రహీం వకల్తా తీసుకున్నాడు. కానీ..నిందితుల తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రాలేదన్న సంగతి తెలిసిందే.

ఎవరూ కూడా వాదించవద్దని ఆదిలాబాద్ జిల్లా బార్ అసోయేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. షేక్ బాబు (ఏ1), షాబుద్దీన్ (ఎ2), మఖ్దూం (ఏ3)లు నిందితులు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జీషీట్‌ను కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి దాఖలు చేశారు. 44 మంది సాక్షులతో 150 పేజీల ఛార్జీషీట్ ఉంది.

 

2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు హత్యాచారం జరపడం.. సీన్ రీ కన్ స్ట్రక్షన్‌లో భాగంగా షాద్ నగర్‌కు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున నిందితులను తీసుకెళ్లడం..పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పులు నలుగురు నిందితులు చనిపోయారు. 
దీంతో ఒక్కసారిగా ఇతర హత్యాచార కేసుల్లోనూ నిందితులను కాల్చి చంపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఒంటరిగా ఉన్న చిరు వ్యాపారం చేసుకొనే సమతను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి..చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. 
అఘాయిత్యం చేసిన తర్వాత..మహిళను హత్య చేసి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. 
 

ఈ ఘటన 2019, నవంబర్ 24వ తేదీగా జరిగినట్లు భావిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. 
ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంలుగా గుర్తించారు. 
దళిత మహిళపై హత్యాచారానికి పాల్పడిన వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ ఉధృతమైంది. 
ఎల్లపటార్, జైనూర్, సిర్పూర్, లింగాపూర్ గ్రామ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆందోళనలు.నిరసనలకు దిగారు.
Read More : చటాన్‌పల్లిలో మరోసారి కలకలం : నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

Categories
Sports

ప్రశ్నించడమే పాపమా : ధోనికి జరిమానా

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ధోనీకి జరిమానా పడింది. గురువారం(ఏప్రిల్ 11,2019) రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. నో బాల్ విషయమై గ్రౌండ్ లోకి వెళ్లి మరీ అంపైర్లతో ధోని వాదనకు దిగాడు. దీంతో ధోనిపై యాక్షన్ తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అభియోగంపై మ్యాచ్ రిఫరీ ధోనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాడు. మ్యాచ్ ఫీజులో సగం కోత విధించాడు.

ఐపీఎల్‌లో భాగంగా గురువారం(ఏప్రిల్ 11) చెన్నై, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేజ్ చేసే క్రమంలో చెన్నైకి ఆఖరి ఓవర్ లో 18 పరుగులు అవసరం అయ్యాయి. స్టోక్స్ బౌలింగ్ చేశాడు. తొలి బంతిని జడేజా సిక్సర్ కొట్టాడు. తర్వాత స్టోక్స్ నోబాల్ వేయగా.. జడేజా సింగిల్ తీశాడు. ఫ్రీ హిట్‌కు ధోని 2 పరుగులు తీశాడు. తర్వాతి బంతికి మహీ ఔటయ్యాడు. చివరి 3 బంతుల్లో చెన్నై 8 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. నాలుగో బంతిని స్టోక్స్… క్రీజులో ఉన్న శాంట్నర్‌కు నడుం పైకి వేశాడన్న కారణంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. 2 పరుగులు వచ్చాయి. అయితే ఇక్కడే అంపైర్లు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

నోబాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా అంపైర్ ప్రకటించడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ఈ నిర్ణయంపై జడేజా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే.. ధోని మైదానంలోకి దూసుకొచ్చాడు. అంపైర్లతో మహీ వాగ్వాదానికి దిగడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. ఐదో బంతికి శాంట్నర్ 2 పరుగులు తీశాడు. ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా స్టోక్స్ వైడ్ వేశాడు. దీంతో లాస్ట్ బాల్ కి 3 పరుగులు చేయాల్సి ఉంది. స్టోక్స్ వేసిన చివరి బంతిని శాంట్నర్  లాంగాన్‌ దిశగా సిక్సర్ కొట్టి చెన్నైకి గ్రాండ్ విక్టరీ అందించాడు.