Categories
Crime Latest National

రూ. 5 కోసం ఘర్షణ : కత్తితో దాడి..ఒకరికి తీవ్రగాయాలు

రూ. 5 కోసం ఘర్షణ పడ్డారు. ఇంకేముంది..క్షణికావేశంలో కత్తితో దాడికి పాల్పడ్డారు. ఫలితంగా..ఇద్దరికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హర్యాణాలోని ఓ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. కత్తితో దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే…
బల్లాబార్గ్ ప్రాంతానికి చెందిన..జిత్తు, నిఖిల్, ఫరిదాబాద్ ప్రాంతానికి  చెందిన మోహిత్, దీపక్ లు కారులో వెళుతున్నారు. హర్యాణ రాష్ట్రంలోని కేర్కిదేలా టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. రూ. 65 చెల్లించాలని చెప్పారు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది. దీంతో వారు రూ. 100 తీసిచ్చారు. మిగతా రూ. 35ను కారులో ఉన్న వారికి అందచేశారు. అయితే..వారికి అందచేసే క్రమంలో రూ. 5 కాయిన్ కిందపడిపోయింది. వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక ఇతర వాహనాలు నిలబడి ఉన్నాయి.

దీంతో కారును పక్కకు తీసి..కిందపడిపోయిన రూ. 5 కాయిన్ ను తీసుకోవాలని సిబ్బంది సూచించారు. వారు తీసుకోకుండా..టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే కారులో ఉన్న కత్తిని తీసుకుని సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ప్లాజా మేనేజర్ తో పాటు మరో ఉద్యోగిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

దీనిని అడ్డుకొనేందుకు మరొక ఉద్యోగి ప్రయత్నించాడు. అతడిపై కూడా దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా..తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు..కుప్పకూలి..రక్తపు మడుగులో ఉన్న మేనేజర్, సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు కారులో పరార్ అయ్యారు. పోలీసులు వెంబడించి..వారిని అదుపులోకి తీసుకున్నారు. టోల్ ప్లాజా మేనేజర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

Read: చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య… గత నెలలో యువతికి వేరే అబ్బాయితో వివాహం

Categories
Andhrapradesh

ఇంజినీరింగ్‌ కాలేజీల కేసులో హైకోర్టులో వాడీవేడీ చర్చ

23 కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌ విషయంలో హైకోర్టులో తీవ్ర వాదనలు వినిపించారు. జస్టిస్‌ డి.రమేశ్‌ సమక్షంలో విచారణ నిర్వహించారు. కేసులో ఇంప్లీడ్ చేయాలంటూ ఉన్నత విద్యా కమిటీ పిటిషన్ వేసింది. దానికి హైకోర్టు నిరాకరించ లేదు. దాంతో ప్రభుత్వం తరఫు నుంచి తమ వాదనలు వినాలంటూ అడ్వకేట్‌జనరల్‌ అన్నారు. 

వాదనలు వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ప్రజల ధనం లూటీ చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. ప్రజల ధనాన్ని, ప్రజల ప్రయోజనాలన్ని కాపాడాల్సిన బాధ్యత, విధి కోర్టులపై ఉంది. 

అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు ఇలా ఉన్నాయి. ఉన్నత విద్యా కమిటీ నిర్ధారించిన ఫీజులను ఒప్పుకోకుండా గతంలో అక్రమ పద్దతుల్లో ఖరారుచేసిన ఫీజులను వసూలు చేస్తామనడం ప్రజల ధనాన్ని లూటీ చేయడమే. 2 ఏళ్లనుంచి ఆయా కాలేజీలకు డబ్బు రాలేదు, కాని ఇప్పుడు 2 రోజుల్లోనే ఏమైపోతుంది? 

కోర్టులకు రెండు రోజుల్లో సెలవులు వస్తాయనగా ఇంత అర్జెంటుగా, తుది విచారణ చేయకుండా, కమిషన్‌ వాదన వినకుండా చేయొద్దు. పిటిషనర్లు కోరిన మధ్యంతర ఉత్తర్వులు వారు అడిగిన ఫైనల్‌ రిలీఫ్‌ రెండూ ఒకటే. జీఓఎంఎస్‌ నంబర్‌ 14కు అనుగుణంగా వారు ఎంపానెల్‌కాకుండా, జీవో ఎంస్‌ నంబర్‌ 14ను ఛాలెంజ్‌ చేయకుండా విధానాలకు, చట్టాలకు అతీతంగా వారికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ప్రజా ధనానికి విఘాతం కలిగించవద్దు.

దీన్నితుది విచారణలో విని, కమిషన్, ప్రభుత్వం.. గత ఫీజుల నిర్థారణలో చెప్పిన వాదన కరెక్టా? లేదా వారు వసూలు చేయాల్సిన ఫీజులను మించి కూడా వసూలు చేయడం కరెక్టా అన్న విషయాలను విన్నతర్వాతనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. 

కూలంకషంగా వాదనలు విని ఉత్తర్వులు ఇస్తే..  బాగుంటుంది. హైకోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులుకూడా సహజంగా తుది తీర్పులో ప్రతిఫలించాలి. అలాంటి సందర్భంలో వాదనలు వినకుండా, విషయాన్ని కూలంకషంగా వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు. 

– నా వాదనలను వినాలో లేదో? లేదా నా వాదనలను వినాల్సిన అవసరాన్ని చెప్తూ వాదనలు వినాలోలేదో అన్న అంశాలను కోర్టుకు విడిచిపెడుతున్నా. 
అడిషనల్‌ అడ్వకేట్‌జనరల్‌ వాదనలు: ( పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున)
– పిటిషన్లు దాఖలు చేసిన వ్యక్తులు విద్యారంగాన్ని వ్యాపారమయం చేశారు.
– విద్య అనేది చారిటీ. విద్యాసంస్థలు లాభాపేక్షలేని సంస్థలుగా నడవాలి. 
– సుప్రీంకోర్టు, చట్టాలు ఇవే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
– ఈకాలేజీలన్నీ కూడా వ్యాపార సంస్థలుగా మారాయి. 
– విద్యనుంచి డబ్బును సంపాదించకూడదు. 
– వీరంతా విద్యని వ్యాపారం చేసి వాళ్లు ధనవంతులుగా మారారు.
– బిజినెస్‌ టైకూన్లుగా మారారు. 
– ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేశారు.
– పేద పిల్లలు ప్రయోజనం పొందకుండా వారు అక్రమాలకు, మోసాలకు పాల్పడ్డారు
– వారి దోపిడీలకు మనం లైసెన్స్‌ ఇవ్వకూడదు. 
– వీరుచేస్తున్న అక్రమాలను హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ తవ్వితీసింది.
– ఒక కాలేజీలో 2016లో రూ. 97,800 ఫీజుగా అప్పడు నిర్ధారించారు. అవకతవకలపై విచారణ చేసి, లోతుగా పరిశీలిస్తే రూ. 58,576 మాత్రమే ఫీజుగా వసూలు చేయాలి.  కాని, రూ. 62,500 విద్యార్థులనుంచి, వారి తల్లిదండ్రులనుంచి ఇదివరకేవసూలు చేశారు. వారు ఖర్చుచేసిన దానికంటే అదనంగా పిల్లలనుంచి వసూలు చేసినా, ఇప్పుడు ప్రభుత్వం నుంచి అదే కాలేజీ మళ్లీ ఒక్కొక్కరికీ రూ.35వేలు చొప్పున చెల్లించమని అడుగుతున్నారు. ఇంతకంటే.. దారుణం ఏముంటుంది. 
– ఈ అక్రమాలను అన్నింటినీ కూలంకషంగా విని, తర్వాత తుది ఉత్తర్వులు ఇవ్వండి. మధ్యంతర ఉత్తర్వులు వద్దు. 

కేసు పూర్వాపరాలు:
– 2016లో అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ …  ఫీజులను నిర్దారించింది. 
– 2018–19 వరకూ మూడు ఏళ్లకాలానికి ఫీజులను ఫిక్స్‌ చేసింది.
– కనీస వసతులు లేకపోయినా, ప్రమాణాలు పాటించకపోయినా ఫిక్స్‌ చేయించుకున్నారు.
– ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్, అండ్‌ రెగ్యులేటరీ కమిషన్‌ కొత్త చట్టం ద్వారా ఏర్పాటైంది. 
– 2019–2020 నాటికి ఫీజులు ఖరారుచేసింది.
– ఫీజుల నిర్ధారిస్తూ చేసిన జీఓ 15 వచ్చింది. 
– దీనికి ముందు జీఓ 14ను కూడా ఇచ్చింది.
– ఖరారుచేసిన ఫీజులు ప్రకారం ఎంపానెల్‌చేసుకోమని జీఓ ఇచ్చారు. 
– రాష్ట్రంలో రాష్ట్రంలో 282 కాలేజీలు ఉన్నాయి
– 254 కాలేజీలు కమిషన్‌ నిర్ధారించిన ఫీజులకు అంగీకరించారు. వారికి చెల్లింపులు కూడాచేశారు. 
– 23 కాలేజీలు ఫీజులు ఎంపానెల్‌చేయించుకోలేదు. ఆ కాలేజీలు కోర్టుకు వెళ్లాయి. 6 రిట్‌పిటిషన్లు దాఖలు అయ్యాయి.
– ఎంపానెల్‌ చేయించుకోకుండా, జీవో తప్పని చెప్పకుండా పాత ఫీజులు ప్రకారం చెల్లింపులు చేయించాలని పట్టుబడుతున్నాయి.
– స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హయ్యర్‌  ఎడ్యుకేషన్, సోషల్‌వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రెస్పాడెంట్లు 
– హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఇంప్లీడ్‌ కావడానికి పిటిషన్‌ తనకు తానుగా  ఫైల్‌ చేసింది
– ఫీజు ఫిక్స్‌ చేసింది.. తానే  కాబట్టి.. ఇంప్లీడ్‌ అవుతానని పిటిషన్‌ ఫైల్‌చేసింది.
– 2016లో ఫీజు ఫిక్స్‌ చేసిన ఫీజులను రివ్యూ చేశాం. దాంట్లో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని మేం తెలుసుకున్నాం. కొన్ని రకాల ఖర్చులు ఫీజుల్లో చూపించకూడదు, అయినా చూపించారు. దాన్ని తీసివేస్తే.. ఫీజులు తగ్గుతాయి. తగ్గిపోయే ఫీజులను ఇవ్వాలికాని, పాత ఫీజులను ఇవ్వలేం కదా అని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ పిటిషన్‌లో పేర్కొంది.
– కాని కోర్టు అంగీకరించలేదు.

వాడీవేడీ వాదనలు వినిపించనప్పటికీ కోర్టు అంగీకరించలేదు. 

Categories
Crime National

LPG cylinder గొడవలో భర్తను కొట్టి చంపిన భార్య

45 సంవత్సరాల వయస్సున్న భవన కార్మికుడికి అతని భార్యకు మధ్య గ్యాస్ సిలిండర్ విషయంలో జరిగిన గొడవలో భర్త చనిపోయాడు. హనుమంత్ నగర్ పోలీసులు భార్య ఆశ(35)పై కేసు నమోదు చేశారు. కలాబురాగి జిల్లాలోని చిట్టాపూర్ లో ఉండే ఉమేశ్ అతని భార్య ఆశ ఉంటున్నారు. 

భవన నిర్మాణ కార్మికులుగా గత 12ఏళ్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం ఆశ భర్తకు రూ.500 ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందని నింపుకు రమ్మని చెప్పింది. రాత్రి 9గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఉమేశ్.. భార్యపై దాడికి దిగాడు. చెక్క దుంగ తీసుకుని దాడి చేశాడు. 

ఉమేశ్ నుంచి దుంగను లాక్కునేందుకు ప్రయత్నించింది భార్య. ఆ ప్రయత్నంలో లాక్కుంటూనే భర్తను తలపై గట్టిగా బాదింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఉమేశ్‌ను భార్య పట్టించుకోలేదు. మందు మత్తులో పడిపోయాడనుకుని వదిలేసింది. ఆ రోజంతా అలా వదిలేసి తెల్లారి లేవకపోతుండటంతో చనిపోయినట్లగా కన్ఫామ్ చేసుకుంది. 

స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశపై హనుమంత్ నగర్ పోలీసులు సెక్షన్ 304ప్రకారం.. కేసు ఫైల్ చేశారు. ఘటనపై పూర్తి సమాచారం సేకరించి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. 

Read Here>> గాలివాన బీభత్సం..టోల్ గేట్ షెడ్ కూలి దంపతుల మృతి

Categories
Crime National

బీరు గొడవ: తుపాకీతో కాల్చి చంపేశారు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతంలో బీరు గొడవ యువకుడి ప్రాణం తీసుకుంది. సురేంద్ర, రాజు అనే ఇద్దరు యువకులు బీరు కొనేందుకు వైన్స్ షాపుకు వెళ్లి రేటు ఎక్కువగా ఉందనే కారణంతో షాపులోని వ్యక్తితో గొడవపడ్డారు. బుధవారం ఉదయం ఐచార్ ప్రాంతం పరిధిలోని వైన్స్ షాపు వద్ద ఈ గొడవ చోటు చేసుకుంది.

అక్కడ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న కుల్‌దీప్ నగర్..  కూడా వచ్చిన వ్యక్తులతో వాదనకు దిగగా.. కుల్దీప్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సురేంద్ర, రాజు తమ దగ్గర ఉన్న తుపాకీలను తీసుకుని అతడిపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అందరి ముందు సేల్స్‌మెన్ కుల్దీప్ నగర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సిద్దమయ్యేలోపే నిందితులు ఇద్దరూ అక్కడి నుంచి పారారయ్యారు.

ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్పీ వినీత్ జైస్వాల్.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీరు ధర విషయంలో జరిగిన గొడవ వల్లే నిందితులు బాధితుడిని కాల్చి చంపారా? లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.