Categories
Movies

అయాన్ 6వ పుట్టినరోజు-బన్నీ ఎమోషనల్ ట్వీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్‌కు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అయాన్ ఈ శుక్రవారం (ఏప్రిల్ 3) ఆరవ ఏట అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బన్నీ, స్నేహా తమ కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. అయాన్ తన జీవితంలోకి వచ్చిన తర్వాతే అసలైన ప్రేమ అంటే ఏంటో తెలిసిందంటూ తండ్రి ప్రేమను కనబరిచాడు బన్నీ.

స్నేహా, అర్హలతో కలిసి అయాన్ చేత కేక్ కట్ చేయిస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘ప్రేమ అంటే ఏంటని నా జీవితమంలో ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాను. గతంలో చాలా సార్లు అనేక భావాలను పొందాను. కానీ అప్పుడది ప్రేమ కాదని నాకు తెలియదు. అయితే ఎప్పుడైతే నువ్వు(అయాన్‌) నా జీవితంలోకి వచ్చావో అప్పుడే నాకు ప్రేమంటే ఎంటో తెలిసింది. ప్రేమకు అర్థం నువ్వు. లవ్‌ యూ అయాన్‌. హ్యపీ బర్త్‌డే మై బేబీ’’ అంటూ బన్నీ తన తనయుడిపై ప్రేమను తెలుపుతూ హార్ట్ టచింగ్ ట్వీట్ చేసాడు.

Ayaan

ఇటీవల అయాన్ ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో అల్లు కుటుంబమంతా కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఫ్యామిలీతో సమయం గడుపుతూ.. సుకుమార్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు స్టైలిష్ స్టార్. 
Read Also : బాలయ్య మంచి మనసు – కరోనా పై పోరాటానికి భారీ విరాళం

Categories
Movies

అయాన్ స్కూల్ ఫంక్షన్.. అల్లు ఫ్యామిలీ హంగామా మామూలుగా లేదుగా!

అయాన్ ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ సందడి..

లిటిల్ స్టైలిష్ స్టార్ అల్లు అయాన్ స్కూల్ ఫంక్షన్‌లో అల్లు ఫ్యామిలీ అంతా పాల్గొని సందడి చేశారు. బన్నీ తనయుడు అయాన్ ఇటీవలే తన ప్రీ స్కూల్ పూర్తి చేసుకున్నాడు. ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని, అయాన్ చదువుతున్న బోధి వ్యాలీ స్కూల్ టీచర్లను ప్రశంసిస్తూ.. ఈ స్కూల్‌ని ఎంచుకున్నందుకు తల్లిదండ్రులుగా తాము సంతోషిస్తున్నామని ఇటీవల బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి అల్లు అరవింద్, నిర్మల, బన్నీ, స్నేహా రెడ్డి, అర్హ, అయాన్ అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్‌లో అర్హ, అయాన్ మిగతా చిన్నారులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. తన పిల్లలు ముద్దు ముద్దుగా స్టెప్పులేస్తుంటే బన్నీ మొబైల్‌లో షూట్ చేశాడు. ప్రోగ్రామ్ చివర్లో బన్నీ చిన్నారులకు గ్రాడ్యేయేషన్ మెడల్స్, పత్రాలు అందించాడు. అర్హ, అయాన్‌ల డ్యాన్స్ వీడియో ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా వైరస్ కారణంగా కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ.. సుకుమార్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు స్టైలిష్ స్టార్. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నీ, సుక్కుల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
 

Categories
Movies Viral

పుత్రోత్సాహం పొంగిన వేళ : ‘తండ్రిగా గర్వపడుతున్నాను అయాన్’.. బన్నీ ఎమోషనల్ ట్వీట్

తన కుమారుడు అయాన్ ప్రీ స్కూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ని చక్కగా ప్లాన్ చేసుకుంటాడనే సంగతి తెలిసిందే. షూటింగులేనప్పుడు పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరాదాగా గడుపుతూ.. వాళ్లు చేసే అల్లరి వీడియోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు.

తాజాగా తాను పుత్రోత్సాహంతో మురిసిపోతున్నట్టు బన్నీ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తన కుమారుడు అయాన్ ఎదుగుదలలో సహకరిస్తున్న టీచర్లకు బన్నీ కృతజ్ఞతలు తెలిపాడు. ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకున్న బన్నీ.. ఉపాధ్యాయులను ప్రశంసలతో ముంచెత్తాడు. బన్నీ తనయుడు అయాన్ ఇటీవలే తన ప్రీ స్కూల్‌ను పూర్తి చేసుకున్నాడు.

ఈ సందర్భంగా బన్నీ.. అయాన్‌ను అభినందించాడు. చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నందుకు తాను ఎంతో గర్విస్తున్నానని అన్నాడు. అదే విధంగా అయాన్ చదువుతున్న బోధి వ్యాలీ స్కూల్ టీచర్లను ప్రశంసించాడు. అయాన్ మంచి విద్యావంతుడు అయ్యేందుకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ స్కూల్‌ను ఎంచుకున్నందుకు తల్లిదండ్రులుగా తాము సంతోషిస్తున్నామని, ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అయాన్ ఫోటో షేర్ చేశాడు బన్నీ. 

Categories
Movies Viral

రోజురోజుకూ ప్రేమ పెరిగితోంది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్..

మార్చి 6న అల్లు అర్జున్ దంపతులు 9వ పెళ్లిరోజు వేడుకను జరుపుకుంటున్నారు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ పెళ్లిరోజు సందర్భంగా భార్య స్నేహ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 6న అల్లు అర్జున్, స్నేహ దంపతులు 9వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 

ఈ సందర్భంగా బన్నీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన భార్య స్నేహకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘వివాహం జరిగి తొమ్మిదేళ్లు. సమయం చాలా వేగంగా సాగిపోతోంది. కానీ, మన మధ్య ప్రేమ రోజురోజుకూ పెరుగుతోంది’.. అంటూ తమ పెళ్లి నాటి  ఫోటోను షేర్ చేశాడు. అలాగే వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యా, పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు.

‘ఎంతో విలువైన బహుమతులను (పిల్లలను ఉద్దేశిస్తూ) అందించినందుకు థాంక్యూ క్యూటీ’ అంటూ కామెంట్ చేశాడు బన్నీ.. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఫ్యాన్స్ స్టైలిష్ కపుల్‌కు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం సిద్దమవుతున్నాడు స్టైలిష్ స్టార్..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline) on

See More :

ఓ పిట్ట కథ – రివ్యూ

పలాస 1978 – రివ్యూ

Categories
Movies

హ్యాపీ బర్త్‌డే అల్లు అర్హ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హ.. నవంబర్ 21 నాటికి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హ పుట్టినరోజు నేడు (నవంబర్ 21).. ఈ ఏడాదితో అర్హ మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యామిలీ అర్హ బర్త్‌డే ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. బర్త్‌డే బేబి అర్హ క్యూట్ పిక్స్ భలే ఉన్నాయి. ముద్దులొలికే చిరునవ్వుతో ఉన్న అర్హ పిక్స్ సోషల్ మీడియాలో ఈ ఉదయం నుంచి బాగా వైరల్ అవుతున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ టీజర్ చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14వ తేదీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. టీజర్‌లో బన్నీ కుమార్తె అర్హ, కుమారుడు అయాన్ కనిపించి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. అయాన్, అర్హల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముద్దు ముద్దు స్టెప్పులు చూసి అందరూ మురిసిపోతున్నారు.

Read Also : పూరి పెద్దమనసు : పునాదిరాళ్లు దర్శకులు రాజ్ కుమార్‌కు ఆర్థిక సహాయం

అలాగే చిల్డ్రన్స్ డే నాడు బన్నీ భార్య స్నేహా రెడ్డి పిల్లలిద్దరూ కలిసి ఉన్న పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. అన్నాచెల్లెల్లు క్యూట్ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే ఉన్నారు. ఈ ఫోటోకు విపరీతంగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి..

Categories
Movies

వైరల్ అవుతున్న బన్నీ కిడ్స్ క్యూట్ పిక్

చిల్డ్రన్స్ డే నాడు బన్నీ భార్య స్నేహా రెడ్డి పిల్లలిద్దరూ కలిసి ఉన్న పిక్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

అల్లు వారి కిడ్స్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ టీజర్ చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14వ తేదీ ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే.. టీజర్‌లో బన్నీ కుమార్తె అర్హ, కుమారుడు అయాన్ కనిపించి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.

అయాన్, అర్హల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముద్దు ముద్దు స్టెప్పులు చూసి అందరూ మురిసిపోతున్నారు. ఈ సాంగ్ టీజర్ ఇప్పటికే రెండు మిలియన్లకి పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే అర్హ, అయాన్‌ల పిక్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Read Also : ఉత్కంఠ భరితంగా ‘రాహు’ ట్రైలర్

చిల్డ్రన్స్ డే నాడు బన్నీ భార్య స్నేహా రెడ్డి పిల్లలిద్దరూ కలిసి ఉన్న పిక్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.. స్పెషల్‌గా చేసిన ఫోటో షూట్‌లో అన్నాచెల్లెల్లు క్యూట్‌ఎక్స్ ప్రెషన్స్‌తో భలే ఉన్నారు. ఈ ఫోటోకు విపరీతంగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#mybabies #happy children’s day @studiopicaboo

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on