Categories
Movies Viral

నలుగురు పిల్లలు.. నీకు వేరే పనిలేదా? అంటూ ఆటపట్టిస్తున్నారు..

నలుగురు పిల్లలు సరిపోతారా అంటూ ఆటపట్టిస్తున్నారు-మంచు విష్ణు..

మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు విష్ణు రీసెంట్ ఇంటర్వూలో తనకు పిల్లలంటే చాలా ఇష్టమని చెబుతూ.. నలుగురు పిల్లల విషయంలో ఎవరెవరు తనను ఎలా ఆటపట్టిస్తున్నారో వివరించాడు. ‘నాకు పిల్లలంటు చాలా ఇష్టం.. నా ఫ్రెండ్స్ కొంతమంది కాల్ చేసి.. మేమేమో ఒకరు చాలనుకుంటున్నాం.. నీవల్ల మా ఇంట్లో తిట్లు తింటున్నాం.. అంటున్నారు.  

ఇంకొంతమంది.. ఏంటి డార్లింగ్ ఇంకా సరిపోలేదా? కంటే కన్నావు కానీ ఆ విషయం ఇప్పుడే చెప్పాలా? పిల్లలకి పదహారేళ్లొచ్చాక చెప్పొచ్చు కదా అన్నారు. వినీ (విరానికా) వాళ్ల కుటుంబంలో అయితే జగనన్న కానీ (వైఎస్. జగన్ మోహన్ రెడ్డి), షర్మిలక్క కానీ, మా చెల్లెల్నిఇబ్బంది పెట్టడం ఆపెయ్.. అంటుంటారు.

సుబ్బిరామి రెడ్డి అంకుల్ అయితే ఏమయ్యా నీకు వేరే పనిలేదా అని ఆటపట్టిస్తుంటారు అని చెప్పుకొచ్చాడు విష్ణు. ప్రస్తుతం ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తున్న విష్ణు.. త్వరలో రూ.60 కోట్ల బడ్జెట్‌తో ‘భ‌క్త క‌న్న‌ప్ప’ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపాడు.

See Also | సూట్‌లో ప్రభాస్ లుక్ కిరాక్.. డార్లింగ్ 20 మేకింగ్ వీడియో

Categories
Movies

బిజినెస్‌లోకి అడుగు పెడుతున్న మంచు కిడ్స్

ఫ్యాషన్స్‌ను ఇష్టపడే పిల్లల కోసం రెడీ మేడ్ కిడ్స్ ఫ్యాషన్ లైన్‌ను లాంచ్ చెయ్యడానికి విరానికా మంచు సన్నాహాలు చేస్తున్నారు..

వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తూ కోట్లు ఆర్జిస్తున్న సెలబ్రెటీలకు బయట స్కూల్స్, హోటల్స్, థియేటర్స్ వంటి పలు బిజినెస్‌లు ఉన్నాయి. సినిమాల లానే వ్యాపారాల్లో కూడా వారసత్వం కొనసాగిస్తున్నారు పలువురు స్టార్ వారసులు. అయితే ఇప్పుడు ఫ్యాషన్స్‌ను ఇష్టపడే పిల్లల తల్లులు ఆనందపడేలా, ఒక రెడీ మేడ్ కిడ్స్ ఫ్యాషన్ లైన్‌ను లాంచ్ చెయ్యడానికి విరానికా మంచు రెడీ అవుతున్నారు. 2020 మే నెలలో ప్రారంభమయ్యే ఈ కిడ్స్ వేర్ లైన్ దేశవ్యాప్తంగా లభించనున్నది. మంచు ట్విన్స్.. అమ్మానాన్నలు విరానికా మంచు, విష్ణు మంచు త్వరలోనే ఈ లైన్ బ్రాండ్ పేరును రివీల్ చేయనున్నారు.

ఇన్స్టాగ్రామ్‌లో మంచు ట్విన్స్ ఆరియానా, వివియానా లకు 25 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ట్రెండీ క్లాతింగ్ ధరించిన ఫొటోలను రెగ్యులర్‌గా ఈ కవలలు తమ ఇన్స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. వాటికి వేలాది లైక్స్ వస్తున్నాయి. వాళ్ల ఫాలోయర్స్ అంతకంతకూ పెరుగుతుండటం ఎ-లిస్టర్ డిజైనర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాము డిజైన్ చేసే కిడ్స్ లైన్లను మంచు ట్విన్స్ ద్వారా ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి వారితో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆ డిజైనర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ల జాబితాలో మంచు ట్విన్స్ టాప్‌లో ఉన్నారు. తమ పిల్లలు కూల్‌గా, స్టైల్‌గా కనిపించాలని ఆశించే పేరెంట్స్ వాళ్ల ఫాలోయర్స్ లిస్టులో ఉన్నారు.

Manchu Twins to Launch their own kids Fashion line

 

‘టోటల్లీ ఆసమ్’ అనే ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ డిజిటల్ మీడియా కంపెనీ నిర్వహించిన ‘ఇండియన్ కిడ్స్ డిజిటల్ ఇన్సైట్స్ 2019’ అనే ఒక సర్వే ప్రకారం, డిజిటల్ కంటెంట్‌ను ఉపయోగించే 73 శాతం మంది పిల్లలు తమకు పలానా వస్తువు కొనివ్వమని పేరెంట్స్‌ను అడుగుతున్నారు. ఎందుకంటే, వాటిని చైల్డ్ ఇన్ఫ్లూయెన్సర్ వాడుతుండటం.. అందుకు అనుగుణంగా చైల్డ్ ఇన్ఫ్లూయెన్సర్ ప్రచారకర్తగా ఉన్న వస్తువుల్ని 81 శాతమంది పేరెంట్స్ తమ పిల్లల కోసం కొంటున్నారు.

Manchu Twins to Launch their own kids Fashion line

చక్కని ఫ్యాషన్‌తో ఉండే డ్రస్సుల్లో తమ పిల్లల్ని చూసుకొని మురిసిపోవాలని చాలామంది యంగ్ పేరెంట్స్ ఆ తరహా డ్రస్సుల కోసం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఫ్యాషన్ లైన్ బ్రాండును వినోదాత్మకంగా, సౌకర్యంగా, స్టైల్‌గా, అదే సమయంలో అందుబాటు ధరల్లో ఉండేలా మంచు ట్విన్స్ రూపొందిస్తున్నారు. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ బ్రాండుకు యూనివర్సల్ అప్పీల్ ఇవ్వడానికి న్యూయార్క్, యూరప్, భారత్‌లోని పలువురు పేరుపొందిన డిజైనర్లతో మంచు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

manchu

తన మానసపుత్రిక అయిన ఈ కిడ్స్ లైన్ గురించి విరానికా మాట్లాడుతూ : “ఇది ఒక అద్భుతమైన అవకాశాన్నిచ్చే ఏర్పాటు. ఇది కేవలం ఒక బిజినెస్ కాదు, కిడ్స్ క్లాతింగ్ లైన్‌లో తాజా ఊపిరి లాంటిది. సరైన ధరల పాయింట్లను, మన కలలకు తగ్గ ఉత్పాదక సామర్థ్యాలని క్రియేట్ చెయ్యడం గురించి కూడా మేం ఆలోచించాం. ఇది భారతదేశపు బెస్ట్ చిల్డ్రెన్ క్లాతింగ్ లైన్లలో ఒకటి అవుతుంది” అని చెప్పారు.

Categories
Movies

మంచు ఐరా విద్యను చూశారా : ఎంత క్యూట్‌గా ఉందో!

మంచు విష్ణు, విరానికా దంపతులకు నాలుగో సంతానంగా జన్మించిన పాపకు ‘ఐరా విద్య మంచు’ అని నామకరణం చేశారు..

యంగ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన పూర్తి టైమ్ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తున్నాడు. మంచు విష్ణు భార్య విరానికా ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ఈ జంటకు ఇప్పటికే ఆరియానా, వివియానా అనే ట్వన్స్‌తో పాటు అవ్రామ్ అనే బాబు కూడా ఉన్నాడు. వీరికి నాలుగో సంతానంగా జన్మించిన పాపకు ‘ఐరా విద్య మంచు’ అని నామకరణం చేశారు.

రీసెంట్‌గా పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను విరానికా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మా ఐరా విద్య మంచు’.. అంటూ ఐరాతో పాటు మిగతా కిడ్స్ పిక్స్ కూడా షేర్ చేస్తూ.. ‘మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’.. అంటూ పోస్ట్ చేసింది. మంచు విష్ణు కిడ్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : టెర్మినేటర్ : డార్క్ ఫీట్ – ట్రైలర్..

నెటిజన్స్ ఈ ఫోటోలను లైక్ చేస్తూ, ‘మీ కిడ్స్ చాలా క్యూట్‌గా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు త్వరలో నాలుగు కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.