Categories
Health International Latest

అమెరికాలో కరోనా తీవ్రత యువకుల్లోనే ఎక్కువ.. ఒకే రోజులో 50వేలకు పైగా పాజిటివ్!

కరోనాకు వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సుల వారికైనా సోకుతుంది. కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకూ చేసిన అధ్యయనాల్లో కరోనా వ్యాప్తి యువకులలో కంటే వృద్ధుల్లోనే ఎక్కువగా తీవ్రత ఉంటుందని చెబుతూ వచ్చాయి. కానీ, అమెరికాలో మాత్రం యువకులను సైతం పట్టీ పీడిస్తోంది కరోనా వైరస్.. అమెరికాలో కరోనా బారిన పడినవారిలో ఎక్కువమంది యువకులే ఉన్నారని తేలింది. అరిజోనాలోని ఎమర్జెన్సీ వైద్యుడు డాక్టర్ క్విన్ స్నైడర్ కరోనావైరస్ కేసులలో ఎక్కువ భాగం వృద్ధులే ఉన్నారు. కానీ మే నెల మధ్యకాలం నుంచి అమెరికాలో లాక్ డౌన్ ఎత్తివేసింది.

ముఖ్యంగా మెమోరియల్ డే సెలవుదినం తరువాత అంతా మారింది. స్నైడర్ 20-44 ఏళ్లలో ఎక్కువ కేసులు నమోదైనట్టు తెలిపారు. వారిలో కొందరు తీవ్ర అనారోగ్యంతో వస్తున్నారు. ఆక్సిజన్, ఇంట్యూబేషన్, వెంటిలేటర్లు అవసరమన్నారు. యువ వయస్సులో ఉన్నవారు కూడా చాలా మంది మరణించారని అన్నారు. యుఎస్ అంతటా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి, ఇప్పుడు 2.6 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. యువతలో వైరస్ తీవ్రత ఉండటంతో మరింత ఇబ్బందికరంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మాట్లాడుతూ.. ఇటీవలి వారాల్లో యుఎస్‌లో కొత్త కేసుల్లో సగం 35 ఏళ్లలోపు వారే ఉన్నారని చెప్పారు.

అరిజోనాలో కరోనా బాధితులంతా యువకులే :
అరిజోనా, టెక్సాస్ ఫ్లోరిడాతో సహా హాట్‌స్పాట్ రాష్ట్రాల్లోని ఆరోగ్య నిపుణులు యువకుల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని హెచ్చరించారు. యువకులు మెరుగైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదమని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా లాక్ డౌన్ చేయడం తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు. అరిజోనాలో దాదాపు 80,000 కేసులలో సగం 20-44 సంవత్సరాల వయస్సు ఉన్నవారే ఉన్నారు. యువకులందరూ మాస్క్ ధరించడం, సమావేశాలకు దూరంగా ఉండటం, శారీరక దూరం, చేతి పరిశుభ్రత వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఏదేమైనా, బార్లలో మద్యం సేవించడంపై తాత్కాలిక నిషేధాన్ని జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. రాష్ట్రంలో ఇటీవలి కేసుల సగటు వయస్సు 30వ దశకంలో ఉంది.
Covid-19 spike among young Americans, record number of new coronavirus cases reported in a single day
యువకుల్లో వైరస్ తీవ్రత.. వృద్ధులకు మరింత ప్రమాదం :
జూన్ 23న 33గా ఉండగా.. ప్రస్తుతం 37 ఏళ్లలోపువారిలో కనిపిస్తోంది. సగం మంది 37 లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారే ఉన్నారు. మంగళవారం ఫ్లోరిడాలో మొత్తం 152,434 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 6,012 పెరుగుదల 3,505 మంది మరణించారు. కేసుల యొక్క నిజమైన సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే డేటా తక్కువ వయస్సు గలవారిని లక్షణం లేని లేదా తేలికపాటి లక్షణాలను మాత్రమే కలిగి ఉండటంతో కచ్చితమైన గణాంకాలు చెప్పలేమంటున్నారు.

కరోనా వైరస్ ప్రారంభంలో ఫ్లూ లాంటిది, వృద్ధులకు మాత్రమే ప్రమాదం ఉంటుంది. కానీ, యువకులు చాలా తక్కువ ప్రమాదమని అంటూ వచ్చారు. వాస్తవానికి ఇది నిజమే. కానీ ఇప్పుడు వైరస్ రూపు మార్చుకుంది. యువకులలో వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది. యువతలో అంటువ్యాధుల పెరుగుదల వృద్ధులకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని నివేదిక హెచ్చరిస్తోంది.
Covid-19 spike among young Americans, record number of new coronavirus cases reported in a single day

అమెరికాలో ఒక్క రోజులో 50వేలకు పైగా కేసులు :
అమెరికాలో మొదటి 50,000 కరోనావైరస్ కేసులను నమోదు చేయడానికి రెండు నెలల కన్నా ఎక్కువ సమయం పట్టింది. ఇప్పుడు ఒకే రోజులో చాలా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం రోజున 50,203 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం డేటా ప్రకారం.. ఒక రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. జూన్ 26న మునుపటి కొత్త కేసులకు చేరుకున్నాయి. యుఎస్ అంతటా 45,255 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో 2,685,000 కన్నా ఎక్కువ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపింది. 128,000 మందికి పైగా మరణించారు. అరిజోనా, కాలిఫోర్నియా, నార్త్ కరోలినా, టేనస్సీ, టెక్సాస్ – కనీసం ఐదు రాష్ట్రాలు కొత్త కేసుల రికార్డులను నమోదు చేశాయి. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియాలో 9,740 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రానికి 5,898 కేసులు, ఐదు రోజుల వ్యవధిలో 3,842 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

Read:ప్రాణాలు కాపాడిన ఆస్పత్రి కోసం ప్రొస్తెటిక్ కాళ్ళతో 5 ఏళ్ల బాలుడు 6 మైళ్లు నడిచాడు..

Categories
International National

ఇంటి నుంచి బయటకొస్తే కరోనా పాజిటివ్, ఈ దేశానికి ఎందుకొచ్చాం దేవుడా.. అమెరికాలో భారతీయుల హాహాకారాలు

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 12వేల మంది మరణించారు. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దీంతో అమెరికా అల్లకల్లోలంగా మారింది. అమెరికన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఇక అమెరికాలో ఉంటున్న భారతీయులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రాణ భయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగువారు హాహాకారాలు పెడుతున్నారు.

అమెరికాలో కరోనాతో 100మంది భారతీయులు మృత్యువాత:
అమెరికాలోని భారత జాతీయులు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టే సాహసం కూడా చేయడం లేదు. విధిలేని పరిస్థితిలో నిత్యావసర వస్తువులకు బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒకరు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 100 మంది దాకా అమెరికాలో ఉంటున్న భారత జాతీయులు కరోనా బారిన పడి మరణించి ఉంటారని అమెరికాలోని భారత సంఘాలు చెబుతున్నాయి. న్యూయార్క్‌లో స్థిరపడి ఆ దేశ పౌరసత్వం తీసుకున్న వారే అందులో ఎక్కువగా ఉన్నారని, న్యూజెర్సీకి చెందిన ఓ పాతిక మంది దాకా ప్రాణాలు విడిచారని తెలుస్తోందన్నారు. 

దిక్కుతోచని స్థితిలో భారతీయుల కుటుంబాలు:
అమెరికాలో సీనియర్‌ జర్నలిస్టుగా పని చేస్తున్న బ్రహ్మ కూచిబొట్ల రెండు రోజుల క్రితం న్యూయార్క్‌ ఆస్పత్రిలో చనిపోయారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీస శ్రద్ధ పెట్టడం లేదని భారతీయులు వాపోతున్నారు. న్యూజెర్సీలో ఓ కుటుంబానికి చెందిన (కర్ణాటక) తండ్రి, కొడుకు కరోనా బారిన పడి చనిపోవడంతో ఇంట్లో ఉన్న అత్తా కోడలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కరోనా భయంతో వారిని పరామర్శించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.

వారం సరుకులు నెల రోజులు సర్దుకోవాల్సిన దుస్థితి:
న్యూజెర్సీలో భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను నెల రోజులు వాడకునేందుకు వీలుగా పొదుపు చేసుకుంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు కమ్యూనిటీలుగా ఏర్పడి వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ‘రోజూ నలుగురో ఐదుగురో కరోనా బారిన పడుతున్నారు. వారికి సాయం చేసే స్థితిలో లేకపోవడం మాకు శోకాన్నే మిగులుస్తోంది. పిల్లలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధిని నియంత్రించడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఈ దేశానికి ఎందుకు వచ్చాం దేవుడా అని రోజుకు పది సార్లు అనుకోవాల్సి వస్తోందని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న తెలుగువాళ్లు వాపోయారు. న్యూజెర్సీలోని హడ్సన్‌ కౌంటీలో దాదాపు 50 వేల మంది భారతీయులు ఉండగా వారిలోనూ 25 నుంచి 30 వేల మంది తెలుగు వారే.(ఉన్మాదం.. యువతిపై ఉమ్మేసి పారిపోయిన యువకుడు, కరోనా సోకుతుందేమోనని భయం)

నిత్యావసరాల కోసం ఇంటి నుంచి బయటకొచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్:
అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్జిన్‌ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు సైతం కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒక్కరు కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. ‘గత శుక్రవారం నేనూ, మా కమ్యూనిటీలోఉండే మరో నలుగురం వేర్వేరు కార్లలో కాస్ట్‌కోకు వెళ్లాం. అక్కడి నుంచే మరో ఇండియన్‌ స్టోర్‌కు కూడా వెళ్లాం. మేమంతా ఇప్పుడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నాం. మా ఐదుగురిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన ఇద్దరం ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నాము’ అని విశాఖకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోనూ కరోనా పంజా:
భారతీయులు ఎక్కువగా నివసించే టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోనూ వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కళ్ల ముందే అనేక మంది కరోనా బారిన పడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలుగు వారు కన్నీటిపర్యంతం అవుతున్నారు. భారతీయ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేటర్‌ వాషింగ్టన్, న్యూయార్క్‌ మెట్రోపాలిటన్, మేరీల్యాండ్‌కు చెందిన అనేక మంది కమ్యూనిటీ లీడర్లు సైతం కరోనా బారినపడ్డారు. వీరిలో మెజారిటీ వారి ఇళ్లలోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. హూస్టన్‌కు చెందిన భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రోహన్‌ బవదేకర్‌ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఆయన చికిత్స కోసం స్నేహితులు 2.04 లక్షల డాలర్లను సేకరించారు. మియామీలోని కార్డియాక్‌ ప్రివెంటివ్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ముకుల్‌ ఎస్‌.చంద్ర వెంటిలేటర్‌ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఆయన మృత్యువు నుంచి బయటపడేందుకు ప్లాస్మా దోనర్‌ కోసం వాట్సాప్‌ గ్రూపుల్లో వినతులు చేస్తున్నారు.  

* ప్రపంచంలో 209కి చేరిన కరోనా ప్రభావిత దేశాల సంఖ్య
* ప్రపంచవ్యాప్తంగా 14లక్షల 30వేల కరోనా కేసులు.. 81వేల 715 మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3లక్షలు
* అత్యధికంగా అమెరికా, స్పెయిన్, ఇటలీలో కేసులు నమోదు
* యూరప్ దేశాల్లో కరోనా పంజా
* బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలు

* అమెరికాలో 4 లక్షలకు పైగా కరోనా కేసులు, 12వేల 716 మరణాలు
* స్పెయిన్ లో లక్షా 40వేల కేసులు, 14వేలకు పైగా మరణాలు
* ఇటలీలో లక్షా 30వేల కేసులు, 17వేలకు పైగా మరణాలు
* ఫ్రాన్స్ లో నిన్న ఒక్కరోజే 1,417 మంది, అమెరికాలో నిన్న ఒక్కరోజే 1,845 మంది మరణం
* అమెరికాలో నిన్న ఒక్కరోజే 27వేలకుపైగా కేసులు నమోదు

* భారత దేశంలో 5వేలు దాటిన కరోనా కేసులు, 169 మరణాలు
* కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 463 మంది
* అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో కరోనా కేసులు నమోదు
* మహారాష్ట్రలో 1018 కేసులు, 64 మరణాలు
* కేరళలో 336 కేసులు, రెండు మరణాలు
* తెలంగాణలో 404 కరోనా కేసులు, 11 మరణాలు
* తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 45
* ఏపీలో 314 కరోనా కేసులు

Categories
International Technology

భూమికి రెండో చంద్రుడొచ్చాడు… మారుతీ కారు సైజులో ఉన్నాడు… కలర్‌లో చూడండి.

భూమ్మీదకు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ తెలుసు. దారితెన్నూ ఉండవు కాబట్టే రోగ్ ఆస్టరాయిడ్స్ అని అంటారు. 2020 CD3అని సైంటిస్ట్ పిలిచిన ఈ ఆస్టరాయిడ్ మాత్రం కార్ సైజులో ఉంటుంది. వచ్చే మూడేళ్లు భూకక్ష్యలోనే తిరుగుతుందని అనడం కన్నా భూమీ తనచుట్టూ తిప్పుకొంటుంది. చంద్రుడుకున్న అన్న లక్షణాలూ దీనికీ ఉన్నాయి… ఒక్క సైజు తప్ప. అటువైపు వెళ్లిపోతున్న ఈ చిన్న మూన్‌ని భూమే ఇటువైపు ఆకర్షించింది. తనచుట్టూ తిప్పుకొంటుంది.  

మూడేళ్ల తర్వాత మూన్‌ని భూమి విశ్వంలోకి విసరేస్తుంది. అంతవరకు మన టెలిస్కోప్‌లు ఈ కొత్త చుట్టాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఈవారంలోనే హువాయ్‌లోని జెమినీ అబ్జర్వేటరీ కలర్ ఫోటో తీసింది. ఫిబ్రవరి 19న Arizonaలోని Catalina Sky Survey ఎక్కడ నుంచే భూమివైపు ఆకాశంలో దూసుకొస్తున్న శకలాన్ని కనిపెట్టింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేటరీలన్నీ టెలిస్కోప్‌లను అటువైపు తిప్పాయి.

దీన్ని మినీమూన్‌గా నిర్ధారించాయి. అలాగనే పెద్దదేమీకాదు. 2.9మీటర్లు పొడవు, 3.5 మీటర్ల వెడల్పు. అంటే మిడ్‌సైజు కారు అంతన్నమాట. ఇలా టెంపరరీగా మూన్‌లు రావడం కొత్తమేకాదు. 2006లో  RH120 అన్న శకలం 2006 సెప్టెంబర్ నుంచి 2007 జూన్ వరకు భూమి ఆకర్షణలోనే ఉంది. ఆ తర్వాత చీకట్లో కలసిపోయింది. ఇప్పుడు ఈ కొత్త మూన్ పరిస్థితి కూడా అదేకావచ్చు.