Categories
Movies

అర్జున్ కపూర్‌తో రకుల్ ప్రీత్

అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ జంటగా.. బాలీవుడ్‌లో కాష్వీ నాయర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది..

అజయ్ దేవ్ గణ్ పక్కన ‘దే దే ప్యార్ దే’లో నటించిన తర్వాత రకుల్ ప్రీత్ ‘మర్జావాన్’ సినిమా చేసింది.. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.. ఇప్పుడు హిందీలో మరో సినిమా కమిట్ అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో జతకడుతోంది రకుల్. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ జంటగా నటించబోయే ఈ సినిమా ద్వారా డైరెక్టర్ శషిలాల్ నాయర్ కుమార్తె, నిఖిల్ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన కాష్వీ నాయర్ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేయలేదు. క్రాస్ బోర్డర్ డ్రమెడీగా రూపొందనున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మోనీషా అద్వాణీ, మనీషా బోజ్వానీ, నిఖిల్ అద్వాణీ, జాన్ అబ్రహాం కలిసి నిర్మిస్తున్నారు.. నవంబర్‌లోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.

Read Also : ‘రాజా నరసింహా’గా మమ్ముట్టి ‘మధుర రాజా’

పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. ‘మన్మథుడు 2’ తర్వాత మరో తెలుగు సినిమా కమిట్ కాలేదు రకుల్.. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, తో పాటు శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది.

Categories
Movies

అబ్దాలీ నీడ పడితే మరణం ప్రళయ తాండవం చేస్తుంది : ‘పానిపట్’ ట్రైలర్

ర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

మరాఠా చరిత్రలో జరిగిన పానిపట్టు యుద్ధం ఆధారంగా అర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’.. అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేస్తున్నారు. సోమవారం ‘పానిపట్’ సినిమా నుంచి క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేసిన టీమ్, మంగళవారం (నవంబర్ 5) థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. అర్జున్ కపూర్ మరాఠా నాయకుడు ‘సదాశివ రావు’ పాత్రలో చక్కగా సరిపోయాడు.. కృతి సనన్, సదాశివ రావు భార్య ‘పార్వతీ బాయి’ క్యారెక్టర్ చేస్తుంది.

సంజయ్‌ దత్‌ ‘అహ్మద్‌ షా అబ్దాలీ’ పాత్రలో నటిస్తున్నారు.. ‘అహ్మద్‌ షా అబ్దాలీ.. అతడి నీడ ఎక్కడ పడితే అక్కడ మరణం ప్రళయ తాండవం చేస్తుంది’ అంటూ సంజయ్ క్యారెక్టర్‌ని చూపించారు.. ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్దాలీ పాత్రకు హుందాతనం తీసుకొచ్చింది.. విజువల్స్, ఆర్ఆర్, ఆర్ట్ వర్క్ చక్కగా సెట్ అయ్యాయి.. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సినిమాలోని భారీతనమంతా ట్రైలర్‌లో చూపించారు. ‘పానిపట్’ డిసెంబర్‌ 6న విడుదల కానుంది.

Read Also : పదిమంది ఉండగా.. ‘ప్రతిరోజూ పండగే’

సంగీతం : అజయ్‌-అతుల్‌, కెమెరా : సి.కె.మురళీధరన్, ఎడిటింగ్ : స్టీవెన్ బెర్నార్డ్, ప్రొడక్షన్ డిజైనర్ : నితిన్ చంద్రకాంత్ దేశాయ్, ఎస్ఎఫ్‌ఎక్స్ : విశాల్ త్యాగి, యాక్షన్ : అబ్బాస్ అలీ మొఘల్,  బ్యానర్స్ : అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌, ప్రొడ్యూసర్స్ : సునీతా గోవారికర్, రోహిత్ షేలత్కర్..

Categories
Movies

‘పానిపట్’ క్యారెక్టర్స్ లుక్స్ చూశారా!

అర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘పానిపట్’ క్యారెక్టర్స్ లుక్స్ విడుదల చేసిన మూవీ టీమ్..

అర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’.. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా ఈ చ్రితం రూపొందుతుంది. అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేస్తూ, విజన్ వరల్డ్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ‘పానిపట్’ సినిమా నుంచి క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేసింది టీమ్.. 

సంజయ్‌ దత్‌ ‘అహ్మద్‌ షా అబ్దాలీ’ పాత్రలోనటిస్తున్నారు.. సంజూ భాయ్ లుక్ ఆకట్టుకుంటుంది. కృతి సనన్ తన లుక్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది.. ఆమె ‘పార్వతీ బాయి’ క్యారెక్టర్ చేస్తుంది. అర్జున్ కపూర్ మరాఠా నాయకుడు ‘సదాశివ రావు’ పాత్రలో నటిస్తున్నాడు.. అతని లుక్ కూడా రివీల్ చేశారు.

Read Also : ‘తిప్పరామీసం’ – సెన్సార్ పూర్తి

నవంబర్ 5న ‘పానిపట్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. సినిమా డిసెంబర్‌ 6న విడుదల కానుంది. సంగీతం :  అజయ్‌-అతుల్‌, కెమెరా : సి.కె.మురళీధరన్, నిర్మాణం : అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌.

 

Categories
Movies

మలైకా బర్త్‌డే పార్టీ : అర్జున్ కపూర్‌తో కలిసి రచ్చ రచ్చ!

23న తన 46వ బర్త్‌డే సందర్భంగా మలైకా గత రాత్రి బాంబేలో బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చింది.. పార్టీలో అర్జున్ కపూర్, మలైకా అరోరాల డ్యాన్స్ స్టెప్స్ హైలెట్‌గా నిలిచాయి..

అర్జున్ కపూర్, మలైకా అరోరాల డేటింగ్ వ్యవహారం బయటకొచ్చినప్పటి నుంచి మీడియాకి, జనాలకు వాళ్ల రిలేషన్‌పై తెలియని ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దానికి కారణం మలైకా, అర్జున్ మధ్య వయసు తేడా అనేది తెలిసిందే. ఇక వీళ్లిద్దరూ బయట కలిసి కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్‌మనిపిస్తుంటారు.. రీసెంట్‌గా మరోసారి వార్తల్లో నిలిచిందీ జంట..

23న తన 46వ బర్త్‌డే సందర్భంగా మలైకా గత రాత్రి బాంబేలో బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చింది. హాట్‌ సిల్వర్‌ ఔట్‌ఫిట్స్‌ ధరించి మలైకా అదరగొట్టింది. అంతేకాదు ఈ పార్టీలో ఆమె వేసిన స్టెప్పులు అయితే హైలెట్‌ అనే చెప్పాలి. ఆమె ప్రియుడు అర్జున్‌ కూడా ఈ పార్టీలో తన స్టెప్పులతో రెచ్చిపోయాడు.

Read Also : ‘డార్లింగ్’కి సెలబ్రిటీల బర్త్‌డే విషెస్

పార్టీలో ఈ ఇద్దరు చేసిన డ్యాన్సుల వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కరిష్మా కపూర్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, శిల్పా శెట్టి, తారా సుతారియా, శ్వేతా నందన్ బచ్చన్, జాన్వీ కపూర్ అర్జున్ రాంపాల్, రాజ్ కుమార్ రావు తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Birthday girl burns the dance floor #malaikaarora #happybirthdaymalaika #birthdaygirl #birthdaybash

A post shared by Filmy Chutzpah (@filmy_chutzpah) on

Categories
Movies

కోమలి రీమేక్‌లో అర్జున్ కపూర్

తమిళ్ సూపర్ హిట్ ‘కోమలి’ రీమేక్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.. హీరోగా నటించనున్న అర్జున్ కపూర్..

జయం రవి, కాజల్ అగర్వాల్, సంయుక్త హెగ్డే మెయిన్ లీడ్స్‌గా, ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో, వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, ఇషారి కె.గణేష్ నిర్మాణంలో రూపొందిన తమిళ సినిమా ‘కోమలి’.. అనుకోకుండా 16 ఏళ్ల పాటు కోమాలో ఉన్న వ్యక్తి తిరిగి సృహలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే అంశాలతో కామెడీ హైలెట్‌గా తెరకెక్కిన ‘కోమలి’ తమిళ్‌లో సూపర్ హిట్ అయింది.

జయం రవి రకరకాల గెటప్స్‌లో డిఫరెంట్‌గా కనిపించి తమిళ తంబీలను ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ‘కోమలి’ రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. ఆయన తనయుడు అర్జున్ కపూర్ హీరోగా నటించనున్నాడు.

Read Also : పెన్సిల్‌పై ప్రభాస్ పేరు చూశారా!

హిందీతో పాటు తెలుగు, కన్నడ హక్కులను కూడా ఆయన సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. అజిత్ నటించిన ‘నేర్‌కొండ పార్వై’ (పింక్ రీమేక్) చిత్రంతో నిర్మాతగా కోలీవుడ్‌లోకి ఎంటర్ అయిన బోనీ కపూర్ ప్రస్తుతం అజిత్ 60వ సినిమాను నిర్మిస్తున్నారు.

Categories
Movies

ఇంట్రెస్టింగ్‌గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ : ట్రైలర్

రీసెంట్‌గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమాపై అంచనాలను పెంచేలా ఉందీ ట్రైలర్..

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.. భారతదేశంలో ఎన్నో దాడులకు పాల్పడిన ఇండియాస్ ఒసామా అనే ఉగ్రవాది నేపథ్యంలో రూపొందించిన సినిమా ఇది. ఆ ఇండియాస్ ఒసామా ఎవరో, ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అతణ్ణి పట్టుకోవడానికి ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించకుండా, ఇండియాకి చెందిన ఐదుగురు వ్యక్తులు ఎలాంటి రిస్క్ చేసారు? అనేదే ఈ మూవీ స్టోరీ. రీసెంట్‌గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమాపై అంచనాలను పెంచేలా ఉందీ ట్రైలర్..

అర్జున్ కపూర్ ఆ ఐదుగురిలో ఒకడిగా, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ప్రభాత్‌గా కనిపించనున్నాడు. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్‌లో, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, రాజ్ కుమార్ గుప్తా మరియు మైరా కార్న్ సంయుక్తంగా నిర్మించారు. మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ : డుడ్లీ, ఎడిటింగ్ : బోధాదిత్య బెనర్జీ, మ్యూజిక్ : అమిత్ త్రివేది.

వాచ్ ట్రైలర్..

Categories
Movies

మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్

రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ, కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్. మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

అర్జున్ కపూర్, రాజేష్ శర్మ, ప్రశాంత్ అలెగ్జాండర్, శాంతిలాల్ ముఖర్జీ, దేవేంద్ర తదితరులు మెయిన్ లీడ్‌గా, రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్‌లో, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, రాజ్ కుమార్ గుప్తా మరియు మైరా కార్న్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ, కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్. మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. నో గన్స్, నో గ్లోరీ, ఓన్లీ గట్స్.. 5 అన్ లైక్లీ హీరోస్, 1 అన్ టోల్డ్ స్టోరి అనే క్యాప్షన్‌తో పోస్టర్ డిజైన్ చేసారు. గౌరవ్ మిశ్రా, ఆసిఫ్ ఖాన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఫోటోగ్రఫీ : డుడ్లీ, ఎడిటింగ్ : బోధాదిత్య బెనర్జీ, మ్యూజిక్ : అమిత్ త్రివేది.

వాచ్ టీజర్..

Categories
Movies

అర్జున్ క‌పూర్‌, మలైకా పెళ్లి డేట్ ఫిక్స్!

బాలీవుడ్ స్టార్స్ అర్జున్ క‌పూర్‌, మ‌లైకా ఆరోరా చాలా రోజులుగా రిలేష‌న్ షిప్‌లో ఉన్నార‌ని వార్త‌లు వింటూనే ఉన్నాం. తాజాగా ఈ జంట ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో అపార్ట్ మెంట్ తీసుకున్న మలైకా, అర్జున్ జంట‌ త్వ‌ర‌లోనే ఆ ఇంట్లోకి అడుగుపెట్ట‌నున్నారని అన్నారు. అయితే బాలీవుడ్ మీడియా ప్ర‌కారం ఈ జంట ఏప్రిల్ (19, 2019)న చ‌ర్చిలో పెళ్లి చేసుకోబోతున్నార‌ట‌. ఈ పెళ్లికి ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు, బంధువులు హాజ‌ర‌వుతార‌ట‌. ఇప్ప‌టికే ఈ పెళ్లికి ఏర్పాటు పూర్త‌య్యాయ‌ని అంటున్నారు.  

మలైకా అరోరా 1998లో అర్భాజ్ ఖాన్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ళ కుమారుడు కూడా ఉన్నారు. కొన్నాళ్ళుగా వీరి మధ్య వచ్చిన గొడవల వలన 2016 నవంబర్ లో కోర్టు మెట్లెక్కారు. కౌన్సిలింగ్ తో వారి నిర్ణయాన్ని మార్చుదామని కోర్టు ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మే (17,2017)న‌ బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి వివాహ బంధానికి శాశ్వతంగా బ్రేక్ వేసింది. 

కుమారుడి సంరక్షణ బాధ్యతలను మలైకా కి అప్పగించగా, బాబుతో సరదాగా గడిపే సమయం వెచ్చించేందుకు అర్బాజ్ కి కోర్టు అనుమతినిచ్చింది. అయితే అర్బాజ్, మలైకాకి గొడవ రావడానికి కారణం బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అని అప్ప‌ట్లో పుకార్లు షికారు చేశాయి. అర్జున్ క‌పూర్ ప్ర‌స్తుతం అశుతోష్ గోవ‌రిక‌ర్ పీరియ‌డ్ డ్రామా పానిప‌ట్ చిత్రం చేస్తున్నాడు.