Categories
Bakthi

మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తాం

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క  సారక్క జాతర వైభవంగా జరుగుతోంది.  గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక  దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా  శనివారం మేడారం జాతరకు వచ్చి గద్దెలపై ఉన్న వన దేవతలను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా స్పష్టం చేశారు. దర్శనం అనంతరం అర్జున్‌ ముండా విలేకరులతో  మాట్లాడుతూ…. దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు సమ్మక, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు అని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతలుగా సమ్మక్క – సారలమ్మ ప్రసిద్ధికెక్కారు అని పేర్కొన్నారు. త్వరలోనే మేడారం మహాజాతరకు జాతీయ గిరిజన పండగ కల సాకారం అవుతోందని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు.

జాతీయ పండుగ హోదా అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని.. త్వరలోనే గిరిజనుల కలను నిజం చేస్తానని అర్జున్‌ ముండా స్పష్టం చేశారు. అర్జున్‌ ముండాకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి,  మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఘనస్వాగతం పలికారు. మంత్రులు ఆయనకు దగ్గరుండి దర్శనం చేయించారు.
Arjun munda at Medaram jatara

Categories
Crime National

జార్ఖండ్ లో షా ర్యాలీ…బీజేపీ ఆఫీస్ పేల్చేసిన నక్సల్స్

జార్ఖండ్‌ లో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్‌ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్‌ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జార్ఖండ్‌ మాజీ సీఎం, బీజేపీ అభ్యర్ధి అర్జున్‌ ముందా ఇదే కార్యాలయం నుంచి పనిచేస్తున్నారు. 

మరోవైపు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఇవాళ(మే 03-2019) ఖుంటి, కొడెర్మా, రాంచీల్లో  ప్రచార ర్యాలీలు నిర్వహించనున్నారు. నక్సల్స్‌ దాడికి గురైన ఖర్సవన్‌ బీజేపీ కార్యాలయం ఖుంటి లోక్‌సభ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఐదో దశలో భాగంగా మే-6,2019న పోలింగ్‌ జరగనుంది. రెండు రోజుల క్రితం మహారాష్రలోని గడ్చిరోలి జిల్లాల్లో నక్సలైట్లు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 16మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Categories
National Political

బ్యాక్ టు పెవిలియన్ : 8సార్లు ఎంపీకి టిక్కెట్ ఇవ్వని బీజేపీ

జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఖూంటీ లోక్ సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించిన ఉన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత కరియా ముండాకు ఈసారి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.ఏప్రిల్-20,1936లో జన్మించిన కరియా మొదటిసారిగా 1977లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.1989,1991,1996,1998,1999,2009,2014లోక్ సభ ఎన్నికల్లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించిన ఆయన1977లో దివంగత ప్రధాని మొరార్జీదేశాయ్ కేబినెట్ లో ఉక్కుశాఖ మంత్రిగా పనిచేశారు.

15వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.వాజ్ పేయి మంత్రివర్గ సభ్యుడిగా కూడా సేవలందించిన ఆయనకు వయసు మీదపడిందనే నెపంతో బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.మాజీ సీఎం అర్జున్ ముండాకు ఖూంటీ సీట్ ని బీజేపీ కేటాయించింది.మూడు సార్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన అర్జున్ ముండా 2009లో జంషెడ్ పూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.

బీజేపీ టిక్కెట్ కేటాయించకపోవడంపై కరియా ముండా మాట్లాడుతూ…వ్యవసాయం చేస్తూనే పార్లమెంటు సభ్యుడినయ్యాను. ఇప్పుడు టిక్కెట్ దక్కలేదు. తిరిగి వ్యవసాయంపై దృష్టిపెడతాను. ఇది బ్యాక్ టు పెవిలియన్. రాజకీయాలనేవి ప్రజాసేవ చేసుకునేందుకు మార్గంగా కనిపించాయి. భగవంతుడు అడగకుండానే అన్నీ ఇచ్చాడు. నేను ఏ పదవి కోసం ఎప్పుడూ పైరవీలు చేయలేదు. నేను పార్టీకి నిజమైన కార్యకర్తను. పార్టీ నాకు ఎటువంటి బాధ్యతను అప్పగించినా తప్పక నెరవేరుస్తానని తెలిపారు.