Categories
Hyderabad Movies

డాక్టర్ పల్లవి వర్మతో హీరో నిఖిల్ నిశ్చితార్థం

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్  నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్‌ పల్లవి వర్మను నిఖిల్‌ వివాహం చేసుకోబోతున్నారు. గత 5 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో  నిఖిల్  డాక్టర్ పల్లవి వర్మతో పెళ్లికి సిద్దమయ్యాడు. 
 

ఏపీలోని భీమవరానికి చెందిన  పల్లవివర్మకు, ఆయన గోవాలో ప్రపోజ్ చేసి మెప్పించాడు. అంతేకాదు పెద్దల్ని కూడా ఒప్పించాడు. ఎక్కడైతే ప్రపోజ్ చేశాడో అక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. దీంతో శనివారం ఫిబ్రవరి1న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్‌, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఇరువైపులా కుటుంబ సభ్యులు,సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హజరయ్యారు. 
hero nikhil 1

నిఖిల్, పల్లవి కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పల్లవి వర్మకు నిఖిల్‌ ప్రపోజ్‌ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెపుతున్నారు.  పలువురు సినీ ప్రముఖులు కుడా నిఖిల్‌కు విషెస్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ఏప్రిల్‌ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. 
hero nikhil 2

గతంలో  మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించిన తెలుగు రియాల్టీషోలో మొదటి సారి నిఖిల్ తన ప్రేమను బయటపెట్టాడు. హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాతి కాలంలో మంచి హీరోగా పేరుతెచ్చుకున్నాడు. విభిన్నమైన కధాంశాలతో  సినిమాలు చేస్తూ ముందుకు వెళుతూ ముందుకు వెళుతున్నాడు. 
 

టాలీవుడ్‌లో నిఖిల్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన అర్జున్‌ సురవరం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. గతంలో  ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’, ‘కిరాక్ పార్టీ’ సినిమాలతో నిఖిల్ హిట్లు అందుకున్నారు. తాజాగా ఆయన ‘కార్తికేయ-2’లో నటిస్తున్నాడు.

Categories
Movies

అర్జున్ సురవరం: చేగువేరా ఇమేజ్ చూడగానే ఎవరు గుర్తొచ్చారో తెలుసా?

అనేక ఆటంకాలు తర్వాత అర్జున్ సురవరం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. సినిమా ప్రచారంలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా‌లో నిర్వహించారు. వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా విచ్చేసి అభిమానుల్లో జోష్ నింపారు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. 

ఈ సినిమాలో ఉన్న చేగువేరా పాటతో రోమాలు నిక్కబొడుచుకున్నాయని, పాటలో చేగువేరా ఇమేజ్ చూడగానే ఎవరు గుర్తొచ్చారో తెలుసా? అంటూ పవర్ స్టార్ మేనరిజమ్ అయిన మెడపై చేతితో రుద్దుతూ.. పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘రాజ్‌కుమార్‌ మొహమాటపడుతుంటే నేనే అడిగి ఈవెంట్ ఏర్పాటు చేయమన్నానని, కష్టాన్ని గుర్తించి సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తాను ఫంక్షన్‌కు వస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. నిర్మాతగా మేమిచ్చిన అవకాశంతో ప్రయాణం మొదలుపెట్టిన ఠాగూర్ మధు ఉత్తమ నిర్మాతగా మరిన్ని సినిమాలు చేస్తాడని కోరుకుంటున్నానన్నారు. మురుగదాస్ దగ్గర కో డైరక్టర్‌గా పనిచేసిన సంతోష్ కుమార్‌ సినిమాను చక్కగా తీశారు’ 

‘హీరో నిఖిల్ సిద్దార్థ్ నాకు తమ్ముడులా ఫీలవుతున్నా. మరో శిష్యుడు దొరికాడనుకుంటున్నా. లవర్ బాయ్, చాక్లెట్ బాయ్‌గా ఉండే నిఖిల్ యాక్షన్ హీరోగా రాబోతున్నాడు. జర్నలిస్టుగా, చేగువేరాలా సినిమాలో కనిపించబోతున్నాడు. ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేసేలా సినిమా ఉంటుందని ఆశిస్తున్నా. సినిమా ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. టెక్నాలజీ చెడ్డదారిలో వెళ్తుందని, దాని కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుందని సినిమాలో బాగా చెప్పారు’ అని తన మాటల్లో చెప్పారు.  

నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. టిఎన్ సంతోష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్ లేఖ రామన్ తదితరులు న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చారు.

Categories
Movies

మరోసారి వాయిదా పడిన ‘అర్జున్ సురవరం’

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న సినిమా అర్జున్‌ సురవరం. తమిళ సూపర్ హిట్ అయిన కనితన్‌ కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట ముద్ర అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. కానీ జగపతిబాబు హీరోగా ఇదే టైటిల్‌తో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చేసేదేమి లేక నిఖిల్ తన సినిమాని అర్జున్ సురవరంగా టైటిల్ మార్చుకున్నాడు. టైటిల్ మారిన తరువాత సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇప్పటికే టైటిల్‌ విషయంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా అనుకోకుండా మళ్ళీ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
Also Read : నేడు TS POLYCET -2019 ఫలితాలు!

ఈ విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్ అధికారికంగా వెల్లడించారు. ‘అర్జున్‌ సురవరం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేట్రికల్‌ హక్కులను కూడా దక్కించుకున్నాం. సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. కాకపోతే.. ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్’, తదితర సినిమాలు విడుదల అవుతున్న క్రమంలో మా సినిమాను ప్రదర్శించలేని పరిస్థితి ఏర్పడింది. 

ఈ సినిమాను ప్రత్యేకించి మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయడానికి అస్సలు వీలు పడటంలేదు. దాంతో నిర్మాతలను, చిత్రబృందాన్ని సంప్రదించి సినిమాను మరో తేదీన విడుదల చేయాలని కోరాం. ఇందుకు వారూ ఒప్పుకోవడంతో ‘మహర్షి’ విడుదలైన తర్వాతే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. 

Categories
Movies

అర్జున్ సురవరంగా మారిన ముద్ర

అర్జున్ సురవరంగా నిఖిల్.

యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ ముద్ర.. ఈ టైటిల్‌పై నెలకొన్న వివాదం కారణంగా.. టైటిల్ మార్చి, నిఖిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్.. ఈ మూవీకి అర్జున్ సురవరం అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సినిమాలో అర్జున్ లెనిన్ సురవరం అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాడు నిఖిల్… పోస్టర్‌లో రన్నింగ్‌లో ఉన్న ఓబీ వ్యాన్‌లోనుండి కెమెరా క్లిక్ అనిపిస్తున్నాడు.. సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ పేర్లన్నీ వ్యాన్‌పై వేసారు.. నిఖిల్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. మూవీ డైనమిక్స్, ఔరా సినిమాస్ నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నాడు. టి.సతీష్ డైరెక్ట్ చేస్తున్నాడు. మార్చి 29న అర్జున్ సురవరం రిలీజ్ కాబోతుంది. కెమెరా : సూర్య, సంగీతం : శ్యామ్ సీఎస్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఫైట్స్ : వెంకట్…

వాచ్ ఫస్ట్ లుక్…