Categories
Andhrapradesh

పోలీసుల కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే, ఎందుకో తెలుసా

కరోనా వ్యాప్తి కట్టడిలో, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో తీవ్రంగా శ్రమిస్తున్న వారిలో పోలీసులది కీలక పాత్ర. ఈ పరిస్థితుల్లో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పోలీసుల కాళ్లు మొక్కారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పోలీసులు మన కోసం పని చేస్తున్నారని, వారి నిజంగా గ్రేట్ అని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు కడా పోలీసులకు పూర్తిగా సహకరిచాలని ఎమ్మెల్యే పాల్గుణ కోరారు.

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. మండు టెండుల్లో సైతం డ్యూటీ చేస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. కొందరు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డుపైనే కడుపు నింపుకుంటున్నారు. కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతున్న ప్రతికూల పరిస్థితుల్లో, మండు టెండుల్లో విధులు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే, పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా వారికి సహకరించాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉంది.

Also Read | నిజాముద్దీన్ ఘటన : మతపెద్దలను ముందే హెచ్చరించిన ఢిల్లీ పోలీసుల వీడియో వెలుగులోకి