Categories
Prakasam

తల్లిని కాపాడుకోలేకపోయిన కొడుకు : మృతదేహాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు

బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి అంత్యక్రియలు చేశాడో కొడుకు.

మానవత్వం మంటగలిసింది.. కన్న తల్లిని కాపాడుకోవాలనుకున్న కొడుకు ఆరాటం వృధా అయ్యింది. మృత్యువు తరుముతున్న తల్లిని ఇంట్లో ఉంచవద్దంటూ బయటకు పంపాడు యజమాని. చిన్నప్పటి నుంచి తనను కళ్లల్లో పెట్టుకుని పెంచిన అమ్మ… ఎన్నో కష్టాలకోర్చి తనను పెద్ద చేసిన అమ్మ… క్యాన్సర్‌ బారిన పడేసరికి ఆ కుమారుడి హృదయం తల్లడిల్లింది. ఎలాగైనా సరే… ఆమెను కాపాడుకోవాలని తపించాడు. రెండు రోజులుగా చేతులపై మోసుకుంటూ అక్కడికీ ఇక్కడికీ తిరిగారు. సాటి మనిషి కష్టాల్ని చూసి చలించని మనుషులకంటే తానే నయమంటూ చివరకు ఆ తల్లిని మృత్యు దేవత తీసుకెళ్లింది. బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.

వెంకటయ్య, వెంకటలక్ష్మి దంపతులది ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం. మూడేళ్లుగా పామూరు పట్టణంలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల కిందట వెంకటలక్ష్మికి క్యాన్సర్‌ సోకింది. మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు సతీష్‌ ఆమెను పలు ఆసుపత్రుల్లో చూపించారు. చికిత్సల కోసం సతీష్‌ 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. వెంకటలక్ష్మి ఆరోగ్యం క్షీణించగా (నవంబర్ 18, 2019) పామూరులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రిమ్స్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. 

తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా.. ఇంటి యజమాని తీసుకురావొద్దని హెచ్చరించారు. చేసేది లేక సతీష్‌ తన తల్లిని తిరిగి స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమెను అక్కడ ఉంచడం కుదరదని ఆసుపత్రి సిబ్బంది తేల్చి చెప్పారు. పంచాయతీ అధికారులు ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం’లో ఇచ్చిన గదిలో ఆ రోజు రాత్రికి తలదాచుకోవాల్సి వచ్చింది. 19వ తేదీ ఉదయం సిబ్బంది వచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారు. 

దిక్కుతోచని స్థితిలో సతీష్‌ తన తల్లిని చేతులతో మోసుకుంటూ స్థానిక డీవీ పార్కుకు వెళ్లారు. అక్కడ టెంట్‌ వేసుకుని రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వృద్ధురాలిని పామూరు వైద్యశాలలో చేర్చుకోవాలని వైద్యాధికారికి సూచించారు. సిబ్బంది ఆమెను చేర్చుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటలక్ష్మి మృతి చెందింది. 

బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. అంత బాధలో ఉంటే… స్నేహితులు, బంధువులు సహా ఎవరూ సాయం చేయలేదని, తన గోడు పట్టించుకున్న వారు ఎవరూ లేదని… ఈ దుస్థితి వేరెవరికీ రాకూడదంటూ సతీష్‌ బోరుమన్నారు.  
 

Categories
National

మా ఇష్టం : రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత్ సృష్టత

ర‌ష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల‌పై అమెరికా కొన్ని ఆంక్ష‌లు విధిస్తున్న సమయంలో….భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత వైఖరిని సృష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాష్టింగన్ డీసీలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియోతో స‌మావేశ‌మైన త‌ర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు.

ర‌ష్యా నుంచి మిస్సైళ్ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఎస్‌-400ని కొనుగోలు చేసే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని జైశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ఎవ‌రి ద‌గ్గ‌ర ఎటువంటి మిలిట‌రీ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామ‌న్న విష‌యంలో క్లారిటీతో ఉన్నామ‌ని, అది మా సార్వ‌భౌమాధికారం అని జైశంక‌ర్ తెలిపారు. మిలిట‌రీ ఆయుధాల‌ను కొనుగోలు చేసే స్వేచ్ఛ త‌మ‌కు ఉన్న‌ద‌న్నారు. దీనిపై తమకు ఏ దేశం అభ్యంతరం చెప్పడాన్ని ఇష్టపడమని అన్నారు.

రష్యా నుండి ఏమి కొనాలి, కొనకూడదో,అమెరికా నుంచే కొనాలి అని ఏ దేశం తమకు చెప్పడాన్ని ఇష్టపడమని జైశంకర్ సృష్టం చేశారు. గతేడాది ర‌ష్యా నుంచి సుమారు 5.2 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో సుమారు ఐదు ఎస్‌-400 క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఆయుధాల్ని కొనుగోలు చేసేందుకు భార‌త్ ఒప్పందం కుదుర్చుకున్న‌ విషయం తెలిసిందే.

2017 చట్టం ప్రకారం…ఉక్రెయిన్, సిరియా దేశాల్లో రష్యా సైనిక ప్రమేయం,యుఎస్ ఎన్నికలలో జోక్యం చేసుకుందన్న ఆరోపణల కారణంగా రష్యా నుండి “ప్రధాన” ఆయుధాల కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. నాటో మిత్రదేశమైన టర్కీ జూన్‌ లో రష్యా నుంచి ఎస్ -400 కొనుగోలు చేసేందుకు రెడీ అవడం అమెరికాకు కోపం తెప్పించింది. ఎఫ్ -35 ఫైటర్ జెట్ కార్యక్రమంలో టర్కీ ప్రమేయాన్ని కట్ చేసిన ట్రంప్..ఇతర ఆంక్షలను ఇంకా ప్రకటించలేదు.

Categories
National

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే మృతిచెందిన ఉగ్రవాది ఐడెంటిటీ, ఏ గ్రూప్ కి చెందినవాడో గుర్తించే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.