Categories
National

పాక్ ఆర్మీ హాస్పిటల్ లోనే.. పుల్వామా దాడికి వ్యూహరచన

పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సూచనలు ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాకుండా రావల్పిండిలోని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచే తన పథకాన్ని అతడు అమలు చేశాడు. అనారోగ్య కారణాలతో కొన్ని నెలలుగా ఆర్మీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న మసూద్..అక్కడి నుంచే దాడికి ఆదేశాలిచ్చాడు.కేవలం ఎనిమిది రోజుల ముందే పుల్వామా ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులను రెడీ చేశాడు.

 భద్రతా దళాల చేతిలో 2018అక్టోబరులో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైంది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా యువతను రెచ్చగొట్టినట్టు బయటకు వచ్చింది. ఉగ్రవాదుల వల్ల శాంతికి విఘాతం కలుగుతోందని కొందరు మాట్లడుతున్నారు.. కానీ, మీరు మాత్రం సరిహద్దుల వెంబడి పోరాటం ఆపకండి అంటూ ఆ ఆడియోలో అన్నట్లు ఉంది. మరో మేనల్లుడు మహ్మద్ ఉమైర్, అబ్దుల్ రషీద్ ఘాజీల సాయంతో ఈ ఆడియో టేపు ద్వారా కశ్మీర్ లోయలోని యువకుల మనసులో విషబీజాల్ని నాటించాడు. 
పాక్ నుంచి జైషే మహ్మద్‌కు చెందిన ఎవర్నీ పంపకుండా ఉమైర్, ఇస్మాయిల్, అబ్దుల్ రషీద్ ఘాజీల ద్వారా తన పథకాన్ని మసూద్  విజయవంతంగా అమలు చేసినట్టు ఐబీ అధికారులు తెలిపారు.శక్తివంతమై పేలుడు పదార్థాలను ఉపయోగించి దాడులకు పాల్పడాలని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫర్‌బాద్‌లో జరిగిన సమావేశంలో చర్చించారని ఐబీ తెలిపింది. ఈ సమావేశంలో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ బ్రిగేడియర్ జుబైర్, హిబ్బుల్ ముజాయిద్దీన్ సీనియర్ కమాండర్ సయ్యద్ ఉస్మాన్ షా, తదితరులు పాల్గొన్నారని తెలిపింది. 

గురువారం(ఫిబ్రవరి-14,2019) పుల్వామా జిల్లాలో జైషే మహమద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విసయం తెలిసిందే. ఈ దాడి పట్ల యావత్ దేశం రగిలిపోతోంది.మోడీ సర్కార్ పాక్ పై తీసుకొనే ఏ చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని దేశంలోని అన్నీ పార్టీలు ఒకే మాటపై నిలబడ్డాయి.