Categories
National

ఆపరేషన్‘Meghdoot’కు సారధ్యం : ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రేమనాథ్ హూన్ కన్నుమూత

1984లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో ముఖ్యపాత్ర పోషించిన వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జన్ రల్ ప్రేమనాథ్ హూన్ సోమవారం (జనవరి 6) సాయంత్రం తన 90 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్యంతో ప్రేమనాథ్ గత కొంతకాలంగా బాధపడుతూ..పచంకులాలోని చండిమందిర్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం 5.30 గంటలకు కన్నుమూశారు.  

1929 అక్టోబర్ 4న జన్మించిన ప్రేమనాథ్ భారత సైన్యంలో చేరారు.పలు సేవలు చేశారు. కశ్మీర్ ప్రాంతంలో సియాచిన్ హిమనీనదంపై పాక్ పట్టు సాధించటానికి యత్నించింది. కానీ భారత్ దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ ఆపరేషణ్ లో ప్రేమనాథ్ హూన్ కీలక పాత్ర వహించారు. భారత సాయుధ దళాల ఆపరేషన్ ‘మేఘతూట్’ కు ప్రేమనాథ్ నాయకత్వం వహించారు. ఈ ఘటన సియాసిన్ సంఘర్షణకు దారి తీసింది. ఈ చర్య ఫలితంగా భారత దళాలు మొత్తం సియాచిన్ హిమనీనదంపై నియంత్రణ సాధించాయి. 

Categories
Crime National

కాశ్మీర్ లోయలో రక్తచరిత్ర : 20 ఏళ్లుగా ఉగ్ర దాడులు

భారత్‌పై విద్వేషంతో ఉగ్రవాదులు దేశంలో నిత్యం దాడులకు తెగబడుతూనే ఉన్నారు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టి పాక్‌లో కలిపివేయాలనే ఓ కుట్రతో ప్రతిరోజూ ఏదో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నారు. ఉగ్రదాడులను మన జవాన్లు సమర్ధంగా తిప్పికొడుతూనే ఉన్నప్పటికీ.. అక్కడక్కడ అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. గత 20 ఏళ్లుగా దేశంలో జరిగిన దాడులను ఓసారి పరిశీలిద్దాం.   

> 1999లో నవంబర్ 3న శ్రీనగర్‌లోని బాదామీబాగ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృత్యువాతపడ్డారు.
> 2000 ఆగస్టు 10న శ్రీనగర్ రెసిడెన్సీ రోడ్‌లో భద్రతా సిబ్బందిపై గ్రైనేడ్ దాడి. 11 మంది సైనికుల దుర్మరణం
> 2002లో మే 14 మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూలో ఆర్మీ జవాన్లు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి.. 36 మందిని పొట్టనపెట్టుకున్నారు. 
> 2001 నవంబర్ 17న రాంబన్‌లో ఉగ్రదాడి. 10 మంది సైనికుల మరణం. > 2001 అక్టోబర్ 1వ తేదీన శ్రీనగర్ ఓల్డ్ శాసనసభ కాంప్లెక్సు వెలుపల కారు బాంబు పేలుడు. 38 మంది దుర్మరణం. 
> 2001 మే 14వ తేదీన కలుచాక్ ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడి. 36 మంది సైనికులు నెలకొరిగారు. 
> 2003 జులై 22న ఉగ్రవాదులు జమ్మూలోని ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక బ్రిగేడియర్‌ సహా ఎనిమిది మంది జవాన్లు మృతి చెందారు.
> 2003 జూన్ 28వ తేదీన సన్జాన్ ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి. 12 మంది సైనికుల మృతి. 
> 2004 మే 23న శ్రీనగర్‌-జమ్మూ హైవేపై ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 30 మంది మృతి చెందగా.. వీరిలో 19 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఉన్నారు. 
> 2004 జూన్‌ 24న శ్రీనగర్‌ పట్టణంలోని రాష్ట్రీయ రైఫిల్స్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 మంది సైనికులు బలయ్యారు.
> 2004 ఏప్రిల్ 8వ తేదీన బారాముల్లా జిల్లాలో ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై దాడి. 11 మంది మృతి. 
> 2006 అక్టోబర్‌ 5 తేదీన శ్రీనగర్‌లోని బాద్షా చౌక్‌ వద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 5గురు పోలీసులు, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు.
2005 నవంబర్ 2వ తేదీన నౌగమ్‌లో సీఎం ముఫ్తీ ఇంటికి సమీపంలో ఆత్మహుతి దాడి. ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరుల దుర్మరణం.
2005 జూన్ 24 శ్రీనగర్ శివారులో కారు బాంబు పేల్చివేత. 9మంది సైనికుల వీరమరణం. 
> 2008 జులై 19న ఉగ్రవాదులు కశ్మీర్‌లోని నర్బల్‌ క్రాసింగ్‌ వద్ద బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు.
> 2013 మార్చి 31న సీఆర్పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 5గురు మృతి చెందారు.
> 2013 జూన్‌ 24న మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని హైదర్‌పొరాలో సైనిక వాహనాలపై దాడులు చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృత్యువాతపడ్డారు. 2013 సెప్టెంబర్‌ 26న మరోసారి ఆత్మాహుతి దాడులకు పాల్పడి.. 13 మందిని బలిగొన్నారు.
> 2014 నవంబర్‌ 7న జమ్మూ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులపై జవాన్లు కాల్పులు జరపగా.. ముగ్గురు ఉగ్రవాదులు మట్టికరిచారు. 
> 2014 డిసెంబర్‌ 5న యూరీ సెక్టార్‌లో ఆర్మీ ఆయుధాగారంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారితో పాటు.. ఏడుగురు జవాన్లు మృతి చెందారు.
> 2016 జనవరి 2న పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృత్యవాత పడ్డారు.
> 2016 ఫిబ్రవరి 21న శ్రీనగర్‌ శివార్లలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ కమాండర్లు మృతి చెందారు. 
> 2016 జూన్‌ 25న శ్రీనగర్‌-జమ్మూ హైవేపై సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు బలయ్యారు.
2016 జూన్ 3వ తేదీన పాంపోర్‌లో సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఉగ్రవాదులంతా హతం కాగా ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు.
2017 ఆగస్టు 26వ తేదీన పుల్వామా జిల్లా పోలీస్ లైన్స్‌పై ఉగ్రవాదులు దాడి. 8 మంది భద్రతా సిబ్బంది మృ‌తి.
> 2019లో జరిగిన దాడిలో ఇప్పటివరకు 44 మంది జవాన్లు మృతి చెందారు. గత 20 ఏళ్లలో ఆత్మాహుతి దాడి చేయడం ఇదే ప్రథమం అని అధికారులంటున్నారు.