Categories
National

రిపబ్లిక్ డే : గొప్ప అవకాశం.. పరేడ్ అడ్జుటెంట్ కవాతుకు తానా సారథ్యం

అందరూ పురుషులే ఉండే సైనికదళంలో ముందుండి నడిపించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది ..ఊహించనది అందితే..ఎంతో సంతోషం కలుగుతుంది కదా..అదే..తాన్యా విషయంలో జరిగింది. రిపబ్లిక్ డే ఉత్సవాల పెరేడ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. కవాతుకు తొలి మహిళా ‘పరేడ్ అడ్జుంటెంట్’గా తాన్యా షేర్గిల్ ముందుండబోతున్నారు. తొలిసారిగా మొన్నటి 72వ ఆర్మీ డే కవాతును తాన్యా నడిపించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రిపబ్లిక్ డేలో ఆల్ మెన్ ఆర్మీ కంటింజెంట్‌కు లెఫ్టినెంట్ భావనా కస్తూరి లీడ్ చేశారు. పరేడ్ అడ్జుటెంట్ అంటే కవాతు నిర్వహణ బాధ్యత గల సైనిక అధికారి. 

తాన్యా విషయానికి వస్తే..ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌లో పట్టభద్రురాలు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017 మార్చిలో సైనికదళంలోని ఆర్మీ కోర్స్ ఆఫ్ సిగ్నల్స్ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆర్మీ కెప్టెన్‌గా ఉన్నారు. తాన్యా తండ్రి 101 మీడియం రెజిమెంట్‌లో చేరారు. ఆమె తాత 14వ ఆర్మ్‌డ్ రెజిమెంట్‌లో చేశారు. ఆమె ముత్తాత సిక్కు రెజిమెంట్‌లో చేశారు. 2020, జనవరి 26వ తేదీ ఆదివారం న్యూఢిల్లీలోని రాజ్ పథ్‌లోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్ అడ్జుటెంట్‌ ఆఫీసర్‌గా తాన్యా కవాతు చేయనున్నారు. ఈ పెరేడ్‌లో ఇన్ ఫాంట్రీ కంబాట్ వెహికల్ BMP 2K, ధనుష్ గన్ సిస్టమ్, కోర్స్ ఆఫ్ సిగ్నల్స్, సిక్కు లైట్ ఇన్ ఫాంట్రీ, కుమావున్ రెజిమెంట్, గ్రెనడియర్స్, పారాచ్యూట్ రెజిమెంట్ ఉన్నాయి. 

ఇక ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో హాజరు కానున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి ఉండనున్నారు. త్రివిద దళాధిపతులు జనరల్ మనోజ్ ముకుంద్ సవరణె (ఆర్మీ), అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ (నేవీ), మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా (ఎయిర్ ఫోర్స్) ఉండనున్నారు. 

Read More : కంగ్రాట్స్ : విజయవాడ స్టూడెంట్‌కు ICAI ఫస్ట్ ర్యాంకు