Categories
Crime International Latest

కరోనాతో మోస్ట్ వాంటెడ్ దావుద్ ఇబ్రహీం మృతి..?!

వంద గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానతో ఖతమవుతుందంటారు.. అచ్చంగా ఇప్పుడు దావూద్ ఇబ్రహీం సిచ్యుయేషన్ కూడా అలానే తయారైంది. భారత్‌లో నరమేథం సృష్టించి పొరుగు దేశం పారిపోయిన మిస్టర్ డి ఇప్పుడు కరోనా సోకి మృతిచెందినట్టు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ భారత్ ఎంత మొత్తుకున్నా డి గ్యాంగ్‌ని కాపాడుకుంటూ వచ్చిన పాకిస్తాన్… తాజా పరిణామంతో ఉలిక్కిపడింది.. వైరస్ బారిన పడిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి ఇప్పుడు 64ఏళ్లు. అంటే కరోనా సోకితే ప్రాణాలు పోగొట్టుకునే ఏజ్ గ్రూప్.. దీనికి తోడు కొన్నేళ్లుగా ఇతగాడికి బిపి, షుగర్ రోగాలున్నాయంటారు..

అంటే మరీ రిస్క్ గ్రూప్ అన్నమాట.. దీంతో దావూద్ ఇబ్రహీం ఒక్కడే కాదు.. అతనితో పాటు వైరస్ దాడి చేసిన అతని భార్యని కూడా కరాచీ మిలట్రీ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది.. దావూద్ ఇబ్రహీం సెక్యూరిటీని.. పర్సనల్ సిబ్బందిని కూడా హోమ్ క్వారంటైన్‌కి తరలించారని అంటున్నారు.. ఈ క్రమంలోనే దావూద్ ఇబ్రహీం కరోనాతో మృతి చెందాడని పాకిస్తాన్‌కు చెందిన న్యూస్‌ ఎక్స్‌ మీడియా శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్‌ మృతి చెందాడని నివేదించింది. ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌‌ అవుతోంది. 

మరోవైపు దావూద్ ఇబ్రహీంకు వైరస్ సోకినట్లు తేలడంతో.. ఇన్నాళ్లూ అతన్ని అంటిపెట్టుకుని తిరిగి దందాలు చేసినవాళ్లంతా కూడా టెన్షన్‌లో పడ్డారట. ఇన్నాళ్లూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరిగినా.. వైరస్ దెబ్బతో చచ్చినట్లు లొంగిపోవాల్సి వస్తుందేమో అనే భయంతో బతుకున్నారుంటున్నారు. దావూద్ ఇబ్రహీం కుటుంబం కూడా ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్తున్నారు.. దావూద్ భార్య పేరు మెహ్‌జాబిన్ అలియాస్ జుబీనా జరైన్. దావూద్, జుబీనాకు నలుగురు పిల్లలు. ఇందులో మహరూక్, మెహ్రీన్, మారియాలు కూతుళ్లు కాగా, మోయిన్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. 

ముంబైలో అండర్ వరల్డ్‌డాన్‌గా చలామణీ అవుతూ..నేరాలకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం బాంబే సీరియల్ బ్లాస్ట్స్ కేసులో ప్రధానసూత్రధారి.. మార్చి 12 1993న జరిగిన పేలుళ్లలో 317మంది చనిపోగా..1400మంది గాయపడ్డారు.. ఈకేసులోనే దోషులుగా తేలిన యాకూబ్ మెమన్‌ని 2015లో ఉరి తీసారు. ఇంకా చాలామందిని అరెస్ట్ చేసినా…దావూద్ ఇబ్రహీం మాత్రం పాకిస్తాన్‌ పారిపోయాడు.. అప్పట్నుంచి అతన్ని అప్పగించమని భారత్ కోరుతున్నా.. పాకిస్తాన్ దొంగనాటకాలు ఆడుతుందే తప్ప మనకి మాత్రం అప్పగించడం లేదు. అలాంటి దుర్మార్గ చక్రవర్తికి ఇప్పుడు కరోనా సోకడంతో మృతిచెందినట్టు సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడుతున్నారు. డెస్టినీ డిసైడ్స్ అంటే ఇదేనేమోనని అంటున్నారు.  

ఇదిలా ఉండగా, దావూద్ కరోనాతో మృతిచెందినట్టు ఎలాంటి స్పష్టత లేదు. దావూద్ మృతికి సంబంధించి సరైన వాస్తవాలు ఇప్పటివరకూ బయటకు రాలేదు. గతంలోనూ పలు సందర్భాల్లో దావూద్ మృతిచెందాడంటూ ఎన్నో వార్త కథనాలు, పుకార్లు వినిపించాయి. 

Categories
Uncategorized

పాకిస్తాన్ కుట్ర : మసూద్ అజార్ చనిపోయాడని దుష్ప్రచారం

Categories
International National

పాకిస్తాన్ కుట్ర : మసూద్ అజార్ చనిపోయాడని దుష్ప్రచారం

పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం

పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది.  మసూద్ చనిపోయినట్టు వార్తలు పుట్టించి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి మసూద్ బతికే ఉన్నాడు. మసూద్‌ను పాకిస్తాన్ ఆర్మీ రహస్య స్థావరానికి తరలించింది.  కోట్‌ఘని భవహాల్‌పూర్‌లోని రహస్య ప్రాంతంలో ఉంచింది. అనారోగ్యంతో ఉన్న అతడికి వైద్యం అందిస్తున్నారు.

మసూద్ మరణించాడు అని సోషల్ మీడియాలో పాక్ మీడియా ప్రచారం చేసింది. ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన ఎయిర్ స్ట్రయిక్స్‌లో మరణించిన  టెర్రరిస్టుల్లో మసూద్ కూడా ఉన్నాడని కథలు పుట్టించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మసూద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని పుకార్లు సృష్టించింది. మసూద్  మరణించాడన్న వార్తలు అంతర్జాతీయంగా హల్ చల్ చేశాయి. పాక్ కథనాలు చూసి మసూద్ చచ్చాడని ప్రపంచం అనుకుంది. కానీ వాస్తవానికి మసూద్ చావలేదు.

మసూద్ అజార్ తమ దేశంలోనే సురక్షితంగా ఉన్నాడని ఇటీవలే పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి అంగీకరించారు. మసూద్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పారు. ఆ తర్వాత మసూద్  కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, డయాలసిస్ చికిత్స పొందుతున్నాడని కథనాలు వెలువడ్డాయి. ఇంతలో మసూద్ మరణించినట్లు వార్తలు పుట్టించారు. ఇదంతా పాక్ మరో  కుట్రలో భాగమేనని తేలిపోయింది.